twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ నమితకు వేధింపులు, బలవంతంగా అయినా..., కోర్టుకు కేసు

    నమిత తను ఉంటున్న ఇంటి యజమానిపై కోర్టుకి ఎక్కింది.

    By Srikanya
    |

    చెన్నై: వేధింపులు విషయంలో సినిమావాళ్ళు, మరొకరు అనే తేడా ఉండదు. అయితే సెలబ్రెటీ హోదాలో ఉన్నవాళ్ళు ధైర్యంగా పోలీస్ స్టేషన్స్ కు, కోర్ట్ లకు వెళ్లి న్యాయం పొందేందుకు ప్రయత్నిస్తూంటారు. అదే ధైర్యం సామాన్యులలో కొరవడుతూంటుంది. తెలుగు,తమిళ భాషల్లో హీరోయిన్ గా వెలిగిన నమిత కు ఇప్పుడు అదే సమస్య ఎదురైంది.

    పూర్తి వివరాల్లోకి వెళితే... సినీ నటి, తమిళనాడు అధికార పార్టీ ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి నమితకు.. ఆమె అద్దెకు నివసిస్తున్న ఇంటి యజమాని నుంచి వేధింపులు ఎదురయ్యాయి. గత కొన్నాళ్లుగా యజమాని తనను వేధిస్తున్నాడని, గత ఏడాది డిసెంబరు 31 కల్లా కచ్చితంగా ఇంటిని ఖాళీ చేయాలని తనపై ఒత్తిడి తెచ్చాడని ఆమె ఆరోపించారు.

    నమిత పిటీషన్ లో విషయాలేంటి, ఇంటి యజమాని ఏం చేసాడు..అసలేం జరిగింది...ఎందుకు కోర్టు మెట్లు నమిత ఎక్కాల్సి వచ్చింది. వంటి విషయాలు క్రింద నమిత మాటల్లోనే చదవండి.

    తీవ్ర పరిణామాలు

    తీవ్ర పరిణామాలు

    ఇంటి యజమాని.. నమిత మేనేజర్ ని సైతం బెదిరించాడని, ఇల్లు ఖాళీ చెయ్యకపోతే వచ్చే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారని ఆమె ఆరోపించారు. తనను అన్ని రకాలుగా బెదిరించాలని చూస్తున్నాడని , తను మాట వినకపోవటంతో మేనేజర్ తో చెప్పించాలని ట్రై చేసాడని ఆమె అన్నారు.

    బలవంతంగా అయినా

    బలవంతంగా అయినా

    అంతేకాకుండా ఇప్పటికే తను ఉంటున్న ఇంటి.. ఎలక్ట్రసిటీ, వాటర్ సప్లైలు ఇప్పటికే ఆపేసి, ఆమెను బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాలని చూస్తున్నారని ఆమె పిటీషన్ లో పేర్కొన్నారు. తను అద్దె ఫెరఫెక్ట్ గా కడుతున్నప్పటికి ఇలా చేయటం దారణమని ఆమె పేర్కొన్నారు.

    బెదిరించి ఈవెంట్స్ కు

    బెదిరించి ఈవెంట్స్ కు

    అయితే నమిత ఇంటి యజమాని దారుణ బిహేవియర్ ని కూడా ఆమె వివరించారు. అతను చాలా సార్లు ఆమెను తమ బంధువల ఇంట్లో ఫంక్షన్స్ కు,ఈవెంట్స్ కు వచ్చి పాల్గొనమన్నాడని, అప్పటికి కొన్ని ఇనాగరేషన్స్ లో, ఏ విధమైన రూపాయి తీసుకోకుండా పాల్గొన్నానని ఆమె చెప్పారు

    డబ్బు గుంజాలని

    డబ్బు గుంజాలని

    అయితే అక్కడితో సంతృప్తి చెందటం లేదని, అద్దె పెంచాలని, తన నుంచి ఎక్కువ డబ్బు గుంజాలని ప్రయత్నిస్తున్నాడని, యాంటి సోషల్ ఎలిమెంట్స్ ని పంపి తనను బెదిరిస్తున్నారని ఆమె కోర్టుకు విన్నవించుకున్నారు.

    కోర్టు ఏమందంటే...

    కోర్టు ఏమందంటే...

    ఇక తాను ఇప్పటికే రూ.15000 చొప్పున నెలనెలా కచ్చితంగా అద్దె చెల్లిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆమె స్థానిక 13వ అసిస్టెంట్‌ సిటీ సివిల్‌ కోర్ట్‌లో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. జడ్జి జీ శాంతి ఇరు పక్షాల వాదనలు విని.. ఈ నెల 12 వరకు నమిత ఆ ఇంట్లోనే ఉండేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

    English summary
    A court in Chennai granted an ad-interim injunction restraining a house owner from evicting actor Namitha from her rented flat in Nungambakkam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X