twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోర్టు ఆర్డర్: శృతిహాసన్‌ కొత్త సినిమాలునో...క్రిమినల్ ఇన్విస్టిగేషన్

    By Srikanya
    |

    చెన్నై: తెలుగు,తమిళ భాషల్లో రాణిస్తున్న శృతిహాసన్ కెరీర్ కు అర్దాంతరంగా బ్రేకులు పడ్డాయి. ఆమె ఏ కొత్త సినిమా ఒప్పుకోకూడదని, క్రిమినల్ ఇన్విస్టిగేషన్ చెయ్యమని చెన్నై కోర్టు ఆర్డర్ వేసింది. పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ (హైదరబాద్,చెన్నై) వారు ఈమెపై సివిల్ మరియు, క్రిమినల్ ప్రొసీడిగ్స్ జరపమని కోరారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇదంతా నాగార్జున, కార్తి చిత్రం గురించి వివాదం అని తెలుస్తోంది. ఈ బైలింగ్వుల్ చిత్రం నుంచి ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ కాలేక తప్పుకోవటంతో కోర్టుకు వెళ్లారని సమాచారం. ఆమె షూటింగ్ కు రావాల్సిన సమయంలో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ సమయంలో తాను షూటింగ్ కు హాజరు కాలేకపోతున్నానని ఈమెయిల్ ఇవ్వటంతో వారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సమచారం.

    COURT ORDER: SHRUTI HASSAN NOT TO SIGN ANY NEW MOVIE & CRIMINALINVESTIGATION ORDERED

    దీన్ని అనైతిక చర్యగా, అన్ ప్రొఫిషనల్ వ్యవహారంగా పరిగణించినట్లు ఆ సంస్ద ప్రకటించింది. తమకు ఫైనాన్సియల్ లాస్, రిప్యుటేషన్ లాస్ తమ సస్దకు ఈ చర్యతో కలిగాయని చెప్తున్నారు. కోట్లకొలిది డబ్బు, రిప్యుటేషన్ పోవటం, సమయం కూడా చాలా కోల్పోవటం జరిగిందని అంటున్నారు. దీనివలన బిజిగా ఉన్న మిగతా ఆర్టిస్టుల షెడ్యుల్ దెబ్బ తిని లాస్ చాలా ఉంటుందని చెప్తున్నారు.

    ఈ విషయమై పిక్చర్ హౌస్ మీడియా వారు చాలా సీరియస్ గా ఉన్నారు. వారు కోర్టునిఆమెపై సివిల్ మరియు క్రిమినల్ పొసీడింగ్స్ జరపమని కోరారు. దాంతో కోర్టు వారు...ఆమె ఏ కొత్త చిత్రం సైన్ చేయకూడదని, పోలీస్ లు ఈ కేసుపై ఇన్విస్టిగేషన్ చెయ్యాలని కోరారు.

    వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళం, తెలుగులో నిర్మితమవుతున్న చిత్రంలో నాగార్జున, కార్తి కలిసి నటిస్తున్నారు. ఇందులో కార్తికి జంటగా నటించడానికి శృతిహాసన్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌, చెన్నైలోనూ జరిగింది. ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి శృతిహాసన్‌ తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి.

    ఇప్పటికే తమిళంలో విజయ్‌, తెలుగులో మహేష్‌ బాబుతో కలిసి నటిస్తున్న ఆమె హిందీలో గబ్బర్‌' సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు. వీటితో బిజీగా ఉండటంతో కాల్షీట్ల సమస్య తలెత్తిందని, కార్తిక్‌ చిత్రంలో కొనసాగాలనుకున్నా కాల్షీట్ల సమస్యతో మిగిలి చిత్రాల్లో నటించడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఆ చిత్రం నుంచి శృతిహాసన్‌ తప్పుకున్నారని, కార్తి సరసన హీరోయిన్‌ను ఎంపిక చేయడంలో చిత్ర బృందం నిమగ్నమైందని చెప్పారు. ఈ లోగా కోర్టు నుంచి ఈ విధమైన ఆర్డర్ వచ్చింది.

    English summary
    Picture House Media Ltd, a leading media and entertainment house based out of Chennai and Hyderabad has initiated Civil and Criminal Proceedings against actress Shruti Hassan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X