twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'లింగ' చూడాలంటూ సెలవులు

    By Srikanya
    |

    చెన్నై :'లింగ' విడుదల సందర్భంగా తనకు సెలవు ఇవ్వాలని నటుడు ధనుష్‌ దర్శకుడికి సెలవుచీటి ఇచ్చిన విషయం తెలిసిందే. అదేబాటలోనే పలువురు నటీనటులు కూడా నడుస్తున్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్‌ కూడా సెలవుచీటీ ఇచ్చారు. ఇక ధనుష్ తన లీవ్ విషయమై ట్విట్టర్ లో ఇలా రాసారు...లింగా టిక్కెట్ రిజర్వేషన్స్ మొదలయ్యాయి..చూడాలి..దర్శకుడు బాలాజీ మోహన్ కు లీవ్ లెటర్ ఇచ్చాను. దానికి దర్శకుడు బాలాజీ మోహన్ రిప్లై ఇస్తూ... లింగా లీవ్ లెటర్ వచ్చింది సార్...మాకు ఓ టిక్కెట్ పంపగలరా అని అడిగారు.

    https://www.facebook.com/TeluguFilmibeat

    ఇక సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు ఆనందోత్సాహాలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తమ 'తలైవర్‌' పుట్టినరోజు కోసం భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆయన అభిమాన సంఘాలు తలమునకలయ్యాయి. అలాగే అన్నదానం, రక్తదానం నిర్వహించనున్నట్లు కూడా కొన్ని అభిమాన సంఘాలు ప్రకటించాయి. ఐదేళ్ల తర్వాత తమ అభిమాన తార నటించిన 'లింగ' చిత్రం విడుదలవుతుండటంతో సంబరాలు చేసుకుంటున్నారు.

    థియేటర్ల వద్ద భారీఎత్తున బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వస్తుండటంతో నగరం పూర్తిగా రకరకాల పోస్టర్లు, పెయిటింగులతో కళకళలాడుతోంది. కొన్ని థియేటర్లలో గురువారం నుంచి కటౌట్లకు పాలాభిషేకం చేయడం ఆరంభించారు. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో 'ముత్తు', 'పడయప్పా' చిత్రాల తర్వాత రజనీకాంత్‌ నటిస్తున్న మూడో చిత్రం 'లింగ'. ఓ జలాశయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రపంచ స్థాయిలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

    Dhanush applies for leave to watch 'Lingaa' FDFS

    తెలుగు, తమిళం, హిందీ భాషల్లో శుక్రవారం తెరపైకి రానుంది. చిత్రకథ హక్కులకు సంబంధించి పలు సమస్యలను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ అనుకున్నట్లుగానే ఈ సినిమాను శుక్రవారం తెరపైకి తీసుకురానున్నట్లు ఈరాస్‌ సంస్థ ప్రకటించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తప్పకుండా విడుదలవుతుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ప్రస్తావించింది. కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటామని కూడా ప్రకటనలో పేర్కొంది. ఇప్పుడున్న ఆనందోత్సాహాలకు ఏమాత్రం కొదవ లేకుండా అభిమానులు సినిమాను చూడొచ్చని ప్రస్తావించింది.

    రజనీకాంత్‌ 'లింగ' చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగాయి. చిత్రాన్ని యథావిధిగా శుక్రవారం విడుదల చేసుకోవచ్చని మద్రాసు హైకోర్టులోని మధురై బెంచ్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ వి.ధనబాలన్‌, జస్టిస్‌ వి.ఎం.వేలుమణి గురువారం ఆదేశించారు. ఈ సినిమా కథ తాను నిర్మించిన 'ముల్త్లెవనం 999' కథను పోలి ఉందంటూ తమిళ దర్శకనిర్మాత కె.ఆర్‌.రవిరత్నం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

    దీనిపై విచారణ జరిపిన బెంచ్‌ రూ.పది కోట్లను న్యాయస్థానంలో గ్యారంటీగా చెల్లించి సినిమాను విడుదల చేసుకోవచ్చని 'లింగ' నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ను ఆదేశించింది. ఇందులో రూ.ఐదు కోట్లను నగదు రూపంలోనూ, మరో రూ.ఐదు కోట్లకు బ్యాంకు గ్యారంటీగా శుక్రవారం మధ్యాహ్నంలోగా చెల్లించాలని న్యాయమూర్తులు ఆదేశించారు.

    తీర్పు కాపీ వచ్చిన నాలుగు వారాల్లో ఈ కేసును సివిల్‌ కోర్టులో ఆశ్రయించవచ్చని పిటిషనర్‌కు న్యాయస్థానం తెలిపింది. 'లింగ' నిర్మాత సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని బెంచ్‌ స్పష్టం చేసింది. న్యాయస్థానం తీర్పును గౌరవించి గ్యారంటీ చెల్లించి సినిమాను శుక్రవారం విడుదల చేస్తున్నట్లు రాక్‌లైన్‌ వెంకటేష్‌ తెలిపారు.

    English summary
    Dhanush is promoting Lingaa aggresively on his Twitter page. Dhanush tweeted “LINGA day after tom !!!! Reservations from today :) I have given my leave letter to balaji Mohan ;)”.Balaji Mohan who is directing Dhanush’s Maari is also a Superstar Rajinikanth fan and the director replied back by tweeting “dhanushkraja #LingaaLeaveLetter received sir :) could u also send me a #LingaaFDFS ticket ;)”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X