Don't Miss!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- News కడప కోర్టు ఆంక్షలపై హైకోర్టుకు సునీత..! వైసీపీపై కీలక వ్యాఖ్యలు..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
ఈసారి కూడా రజనీకాంత్ కి తన టైటిల్ ఇచ్చేసాడు
చెన్నై : తమ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎప్పుడెప్పుడు కొత్త సినిమాతో వస్తారా అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూంటారు. ఆ ఎదురుచూపులు ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. ఎందుకంటే...ఆయన రీసెంట్ చిత్రం 'లింగ' అంచనాలు తలక్రిందులు చేసి ఫ్లాప్ కావటంతో తదుపరి చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో ఎవరూ వూహించనివిధంగా ఆయన కొత్త దర్శకుడు రంజిత్‌కు అవకాశమిచ్చారు. ఓకే డైరక్టర్ ఖరారు అయ్యారు. దాంతో ఈ చిత్రం టైటిల్ ఏమిటి..కథ ఏమిటి అనే విషయాలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.
ఈలోగా ఇదే టైటిల్ అంటూ ఓ వార్త చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారంలోకి వచ్చింది. ఆ టైటిల్ ఏంటంటే... 'కన్నాభిరాన్ ' సినిమాలో ఎక్కువ భాగం మలేషియాలో జరగనుంది. దర్శకుడు అమీర్ ఈ టైటిల్ ని గతంలో రిజిస్టర్ చేసారు. కానీ సినిమా ప్రారంభంకాలేదు. దాంతో ఇప్పుడా టైటిల్ ని అమీర్ నుంచి అడిగి తీసుకోవటం జరిగింది. రజనీకూడా ఈ టైటిల్ ని చాలా ఇష్టపడుతున్నట్లు చెప్తున్నారు. గతంలోనూ అమీర్ రిజిస్టర్ చేసిన లింగా టైటిల్ నే రజనీ టైటిల్ కు పెట్టారు. ఈ విషయమై దర్శకుడు అమీర్ చాలా ఆనందంగా ఉన్నారు. తన టైటిల్ ని రజనీ సినిమాకు పెట్టడం తను ఆనందపడే విషయమని చెప్పుకొచ్చారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇంతకీ...
ఈ సినిమా ఎలా ఉండబోతోంది?.. . రజనీకాంత్ సరసన ఎవరెవరు నటిస్తున్నారు?.. రంజిత్ శైలిలో వాస్తవిక సినిమానా?.. అంటూ పలు రకాల ఆలోచనలో పడ్డారు అభిమానులు. గ్యాంగ్‌స్టర్‌కు సంబంధించిన కథతో రూపొందించనున్నట్లు కోడంబాక్కం సమాచారం. రజనీకాంత్ ఓకే చెప్పిన వెంటనే.. రంజిత్ ప్రస్తుతం విదేశాల్లో లొకేషన్లు వెతికే పనిలో పడ్డారు.
ఇక దర్శకుడు రంజిత్ ..విషయానికి వస్తే...అతనో యంగ్ డైరెక్టర్.. ఇప్పటివరకూ కేవలం రెండు చిత్రాలకే దర్శకత్వం వహించాడు.. అయితేనేం.. తన కథతో బడా ప్రొడ్యూసర్ ను ఒప్పించాడు... కోలీవుడ్ సూపర్ స్టార్ ను మెప్పించాడు. దీంతో రజనీకాంత్ నెక్స్ట్ మూవీకి దర్శకుడయ్యాడు రంజిత్.
రజనీకాంత్ తదుపరి చిత్రం విషయమై.. కొన్నాళ్లుగా శంకర్, కె.ఎస్.రవికుమార్ వంటి కోలీవుడ్ర్ డైరెక్టర్స్ క్యూలో ఉండగా.. వీరందరినీ కాదని... 'అట్టకత్తి', 'మద్రాస్' వంటి చిన్న చిత్రాలతో మెప్పించిన రంజిత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజనీకాంత్.
తమిళ స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన అగ్రనిర్మాత కలైపులి థాను.. ఈ సినిమా నిర్మించనున్నారు. గతంలో థాను నిర్మించిన 'యార్' చిత్రంలో అతిథిపాత్ర పోషించిన రజనీకాంత్.. మళ్లీ ఇప్పుడు ఈ సంస్థలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు నిర్మాత థాను తెలియజేశారు.
తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. సో.. పెదరాయుడు తర్వాత రజనీకాంత్ నటించనున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కానుంది. మరి.. లింగా వంటి ఘోర పరాజయం తర్వాత.. రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమా.. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ ఏ మేరకు మెప్పిస్తుందేమో చూడాలి.