twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టార్గెట్ రజనీకాంత్‌, కుట్రలో భాగమేనంటూ...!(ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘లింగా' చిత్రానికి సంబంధించి రజనీకాంత్ చుట్టూ వివాదం ముదురుతోంది. ‘లింగా' చిత్రం ద్వారా తాము భారీగా నష్టం పోయాం...ఆయన స్వయంగా జోక్యం చేసుకుని నిర్మాతలతో మాట్లాడి తమకు డబ్బులు ఇప్పించాలని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నిరాహార దీక్షకు కూడా మొదలు పెట్టారు.

    అయితే అభిమానుల వాదన మరోలా ఉంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే సంకేతాల నేపథ్యంలో...ఆయన పాలిటిక్స్ లోకి రాకుండా కుట్ర చేస్తున్నారని, ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. నష్టపోయిన వారు ఏవిషయం అనేది నిర్మాతతో తేల్చుకోవాలి. రజనీకాంత్‌ను బదనాం చేయడం దేనికని ప్రశ్నిస్తున్నారు.

    Distributors Protest Against Lingaa Movie

    ‘లింగా' డిస్ట్రిబ్యూటర్ల నిరాహార దీక్షల వెనక రాజకీయ కోణం ఉందనడానికి ‘నాన్ తమిళర్ కట్చి' పార్టీ నాయకుడు సీమాన్ కూడా పాల్గొనడమే అంటున్నారు ఫ్యాన్స్ . ‘తమిళుడే ఈ గడ్డను ఏలాలి. రజనీకాంత్ తమిళుడు కాదు. అతన్ని నాయకుడిగా మేము ఒప్పుకోం. ఆయ రాజకీయాల్లోకి వస్తే తొలి ప్రత్యర్థి తానే' అంటూ గతంలో సీమాన్ వ్యాఖ్యలు చేసారు.

    Distributors Protest Against Lingaa Movie

    మరోవైపు తమిళ నటుల సంఘమైన నడిగర సంఘం కూడా రజనీకాంత్‌కు మద్దతుగా నిలిచింది. ‘లింగా' నష్టాల విషయంలో రజనీకాంత్ ను బాధ్యుడిని చేయడం తగదని తమిళ నటుల సంఘమైన ‘నడిగర సంఘం' స్పష్టం చేసింది. ఏమైనా ఉంటే నిర్మాతతో తేల్చుకోవాలి. రజనీకాంత్ ను బ్లేమ్ చేయడం తగదని పేర్కొన్నారు.

    మొత్తానికి ‘లింగా' డిస్ట్రిబ్యూటర్ల వివాదం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఈ చిత్రాన్ని రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు. ఆయన ఈ చిత్రాన్ని ఈ రోస్ ఇంటర్నేషనల్ సంస్థకు అమ్మారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నుండి స్థానిక డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరకు కొనుగోలు చేసి నష్టపోయారు.

    English summary
    After being snubbed by the producers of Lingaa , the film’s distributors on Thursday announced that they would go on a sit-in fast in order to get the attention of actor Rajinikanth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X