twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్ అల్లుడికి అధికారుల గిల్లుడు, ఇంటి కూల్చేవేత!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రజనీకాంత్ అల్లుడు సినీ నటుడు ధనుష్‌ అక్రమంగా నిర్మించిన ఇంటిని అటవీశాఖ అధికారులు కూల్చేసారు. కోయంబత్తూరు జిల్లా వైదేహి నీర్విళిచ్చి రిజర్వ్ ఫారెస్ట్ ఈ భవనాన్ని నిర్మించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రిజర్వ్ ఫారెస్టులో ఇల్లు నిర్మించడం చట్టవిరుద్దం కావడంతో కూల్చేసారు.

    మనదేశంలో అటవీ చట్టాలు చాలా కఠింనగా ఉంటాయి. ఇప్పటికే దేశంలో అడవుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో అడవులకు హానిచేసే కార్యకలాపాలను అధికారులు ఉక్కు పాదంతో తొక్కేస్తున్నారు. జంతువులు సంచరించే అటవీప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఉండవు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఈ ప్రాంతంలో నిర్మాణాలు నిషేధం కావడంతో ధనుష్ ఇంటిని కూల్చేసారు.

     Forest officers demolish actor Dhanush's house

    ఈ సంఘటనపై విచారణ జరిపిన అనంతరం అధికారులు.....తదుపరి చర్య తీసుకోనున్నారు. అయితే ధనుష్‌ అది అటవీ భూమి అనే విషయం తెలియకుండా కొనుగోలు చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ధనుష్ భవనం కూల్చి వేసిన సంఘటన తమిళనాడులో హాట్ టాపిక్ అయింది.

    ఓ వైపు తను నటించిన 'వేలయ్ ఇల్ల పట్టాతారి' చిత్రం విజయం...మరో వైపు ఇటీవల జరిగిన పుట్టినరోజు వేడుక సంతోషం నుండి తేరుకోక ముందే ధనుష్‌కు షాక్ తగిలిందని చెప్పొచ్చు. ధనుష్ జులై 28తో 30వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ధనుష్ నటించిన తమిళ మూవీ 'వేలయ్ ఇల్ల పట్టాతారి' చిత్రం విజయం సాధించ నేపథ్యంలో యూనిట్ సభ్యుల సమక్షంలో ధనుష్ భర్త్ డే పార్టీ వేడుక ఇటీవల చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది.

    English summary
    Forest officers demolish actor Dhanush's house in Tamilnadu. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X