» 

రీమేక్‌ చేయటంలేదంటూ హీరో ప్రకటన

Posted by:

చెన్నై : ప్రభు- కార్తీక్‌ల కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌గా మణిరత్నం తెరకెక్కించిన 'అగ్నినక్షత్రం' (ఘర్షణ)అప్పట్లో సంచలనం సృష్టించింది. 1990వ దశకంలో వచ్చిన ఈ చిత్రం నేటికీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఉంది. ప్రభు, కార్తీక్‌ నట వారసులైన విక్రమ్‌ప్రభు, గౌతమ్‌కార్తీక్‌లు సినీరంగ ప్రవేశం చేసిన నేపథ్యంలో వీరిద్దరితో ఆ చిత్ర రీమేక్‌ను తెరకెక్కించనున్నట్లు వార్తలు జోరుగా వినిపించాయి. గౌతమ్‌కార్తీక్‌ మాత్రం ఈ వార్తలకు తెరదించాడు.

గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ.. '' అగ్నినక్షత్రం రీమేక్‌లో విక్రమ్‌ప్రభుతో కలిసి నేను నటించనున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మా నాన్న చిత్రాలను రీమేక్‌ చేసుకోవాలంటే నా ఛాయిస్‌ 'ఉళ్లత్త్తె అళ్లిత్తా'కే. ప్రస్తుతం తెలుగులో వచ్చిన 'అలా మెదలైంది' రీమేక్‌లో నటిస్తున్నాను''అని తెలిపారు.

మణిరత్నం 'కడలి' చిత్రంతో పరిచయమైన గౌతమ్ కార్తీక్ తెలుగులో విజయవంతమైన 'అలా మొదలైంది' తమిళ రీమేక్ లో నటించటానికి కమిటయ్యారు. ఈ చిత్రాన్ని రవి త్యాగరాజన్ డైరక్ట్ చేయనున్నారు. ఇమామ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మిగతా డిటేల్స్ వెలవడనున్నాయి. ఇక గౌతమ్ మరో ప్రక్క ఐశ్వర్యా ధనుష్ దర్శకత్వంలో చిత్రం కూడా ఒప్పుకున్నారు.

ఇక నాని, నిత్యా మీనన్ కాంబినేషన్ లో నూతన దర్శకురాలు బి.వి. నందినిరెడ్డి రూపొందించిన చిత్రం 'అలా మొదలైంది '. ఈ చిన్న చిత్రం భాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రం రీమేక్ రైట్స్ అరకోటికి పైగా అమ్ముడైనట్లు సమాచారం. తమిళంలో రెగ్యులర్ సినిమాలు తీస్తున్న ఓ లీడింగ్ ప్రొడ్యూసర్ ఈ రైట్స్ ని తీసుకున్నారు.

Read more about: gowtham kaarthik, parabhu, vikram prabhu, gharshana, గౌతమ్ కార్తీక్, ఘర్షణ, ప్రభు, విక్రమ్ ప్రభు
English summary
Gautham Karthik says, "I haven't signed a second film. The Agni Natchathiram remake is a rumour and I didn't even know till I read some tweets about it."
Please Wait while comments are loading...