»   » నయనతార సీరియస్ అయ్యింది...ఎందుకంటే : హీరో సూర్య ( ఇంటర్వూ)

నయనతార సీరియస్ అయ్యింది...ఎందుకంటే : హీరో సూర్య ( ఇంటర్వూ)

Posted by:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సూర్య అంటే తమిళవారికి ఎంత పరిచయమో...తెలుగువారికి అంతకన్నా ఎక్కువే అన్నట్లు ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారాయన. యముడు, సింగం చిత్రాలు ఇక్కడ రికార్డులు క్రియేట్ చేసాయి. ఈ నేపధ్యంలో ఆయన ప్రతీ చిత్రం ఇక్కడ రిలీజ్ అవుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


తెరకు పరిచయమైన తక్కువ కాలంలోనే తన సీనియర్లు అజిత్‌, విజయ్‌లకు పోటీగా మారిన నటుడు సూర్య. వాసరత్వం నుంచి వచ్చిన కమర్షియల్‌ నటుడనే చట్రానికి మాత్రమే పరిమితం కాకుండా.. వైవిధ్య నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.


'పితామగన్‌', 'శ్రీ', 'పేరళగన్‌' వంటి భిన్న పాత్రల్లో కనిపించి 'కాక్కకాక్క', 'సింగం' సీక్వెల్స్‌లో పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా అలరించారు. తొలిసారిగా దెయ్యం కథాంశంతో 'మాస్‌' (తెలుగులో రాక్షసుడు) లో నటిస్తున్నారు. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.


ఈ సినిమాలో నయనతార హీరోయిన్. 'ఆదవన్‌' తర్వాత సూర్య సరసన రెండోసారి ఆమె నటిస్తున్నారు. ప్రేమ్‌జీ, పార్థిబన్‌, సముద్రకని, కరుణాస్‌, శ్రీమాన్‌ తదితరులు ఇతర తారాగణం. ఈనెల 29న తెరపైకి రానున్న ఈ చిత్ర విశేషాల గురించి నటుడు సూర్య చెప్పిన కబుర్లివి..స్లైడ్ షోలో సూర్య వైవిధ్యమైన ప్రశ్నలకు ..ఇచ్చిన సమాధానాలను...చదవండి...


వెంకట్‌ప్రభు చాలా సరదా దర్శకుడు, మీ రూట్ వేరు...

 


జ: ఇలాంటి ప్రశ్నల నుంచే 'మాస్‌' చిత్రం ఆరంభమైంది. సినిమా గురించి ప్రకటించినప్పటి నుంచి నాకు తెలిసిన మిత్రులందరూ ఈ ప్రశ్నే అడిగారు. మీ ఇద్దరి కలయికే భిన్నంగా ఉందే.. నిజంగానే నటిస్తున్నారా? అని కూడా ప్రశ్నించారు. వాటన్నింటినీ పక్కనబెట్టి ఇప్పుడు సినిమా పూర్తిచేశాం. వెంకట్‌ప్రభు మాదిరిగానే నేను కూడా జాలీ హీరోగా మారిపోయా.


 


ఏ సమస్యా రాలేదు

 


'ఆయన కార్తీ మాదిరిగా కాదు. కాస్త సీరియస్‌గా ఉంటారు. ఎప్పటిలా ఆడుతూ పాడుతూ సినిమా తీస్తే సూర్యకు కోపమొస్తుంది'అని వెంకట్‌ప్రభుకు ఆయన స్నేహితులు కూడా చెప్పినట్లు నాతో అన్నారు. మాకు ఎలాంటి సమస్యా రాలేదు. విన్న కథే.. ఇప్పుడు పూర్తి సినిమా అయింది. నిజానికి మేం ఇద్దరం ఒకే పాఠశాలలో చదువుకున్నాం.


 


'రాక్షసుడు‌' స్పెషాలిటీస్...

జ: ఇందులో చాలా 'మాస్‌' విషయాలున్నాయి. నా పాత్ర పేరు కూడా అదే. సినిమా చూస్తేనే అది అర్థమవుతుంది. చాలా కొత్తగా అనిపిస్తుంది.


 


ద్విపాత్రాభినయం అంటున్నారు?

 


జ: ఇందులో నేను ద్విపాత్రాభినయం పోషిస్తున్న విషయాన్ని స్పష్టం చేయలేదు. సినిమానే అందుకు సమాధానం చెబుతుంది.


 


దెయ్యం కథ.. నిజమేనా

 


దెయ్యం, ప్రేతాత్మ.. అని చెప్పడం కన్నా.. ఇదో హర్రర్‌ కామెడీ సినిమా అంతే. కొత్త ప్రయోగం చేశాం. వర్కవుట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. చిన్నారులతోపాటు పెద్ద వారికి కూడా నచ్చే సినిమాగా ఉంటుంది.


 


స్పాట్‌లో కూర్చుని మీవి కాని సీన్స్ చూశారట?

 


జ: అవును. ఆ స్థాయిలో ఈ సినిమా నచ్చింది.


 


అదే వెంకట్‌ప్రభు ప్రత్యేకత

 


అంతేకాదు షూటింగ్ స్పాట్‌కు వచ్చినప్పుడు షూటింగ్‌ హడావిడి ఏమాత్రం కనిపించదు. చడీచప్పుడు లేకుండా ఉంటుంది. తదుపరి సీన్‌ చెప్పేవారు కూడా కనిపించరు. కానీ అనుకున్న సమయానికి.. అన్ని సన్నివేశాలను తెరకెక్కించేస్తారు.. హంగామా లేకుండా! అదే వెంకట్‌ప్రభు ప్రత్యేకత. దాన్ని చూసేందుకే అక్కడ ఉంటా.


 


ఇందులో నయనతార కూడా దెయ్యమట?

 


జ: లేదండి. ఇప్పటికే ఆమె చిత్ర యూనిట్‌పై చాలా సీరియస్‌గా ఉన్నారు. తనకు ఎక్కువగా ప్రేమ సన్నివేశాలు లేవని. మీరు కొత్త సమస్యను సృష్టించకండి.


 


ఈ సినిమాకు సిక్స్‌ప్యాక్‌ పెట్టారా?

 


జ: అన్ని సినిమాల్లోనే సిక్స్‌ప్యాక్‌ తప్పనిసరి కాదు. 'వారనం ఆయిరం', 'ఏళాం అరివు', 'మాట్రాన్‌' చిత్రాలకు అవసరమనిపించింది. పనిగట్టుకుని సిక్స్‌ప్యాక్‌లో నటించడం నాకిష్టం ఉండదు. కథకు అవసరమనిపిస్తేనే చొక్కా గుండీలు తీస్తా.


 


'హైకూ' ఎంత వరకొచ్చింది?

 


జ: అద్భుతమైన కథ. దర్శకుడు పాండిరాజ్‌ వన్‌లైన్‌ చెప్పేటప్పుడే చాలా ఆసక్తిగా అనిపించింది. చిన్నారులకు ఇలాంటి సినిమా చాలా అవసరం. అందుకే నేనే నిర్మించేందుకు ముందుకొచ్చా. కార్తికుమార్‌, బిందుమాధవి నటిస్తున్నారు. నేను, అమలాపాల్‌ అతిథి పాత్ర పోషిస్తున్నాం.


 


మీ నెక్ట్స్ '24' విశేషాలు?

 


జ: విక్రంకుమార్‌ దర్శకత్వంలోని 'మనం' సినిమా చాలా బాగా నచ్చింది. అప్పుడే '24' కథ చెప్పారు. నా నటనకు మేత దక్కేలా వైవిధ్యంగా అనిపించడంతో నటిస్తున్నా. ఏప్రిల్‌ నుంచి చిత్రీకరణ నాన్‌స్టాప్‌గా సాగుతోంది. సమంత, కేథరిన్‌ కూడా నటిస్తున్నారు. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సినిమాకు ప్లస్‌పాయింట్‌.


 


హరి సినిమా ఎప్పటినుంచీ?

 


జ: హరితో కలిసి 'సింగం 3' తెరకెక్కిస్తున్న మాట నిజమే. స్క్రిప్ట్‌ పూర్తయింది. కొంత సమయంలో తీసుకుని సెట్స్‌పైకి వెళ్తాం. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం.


 


English summary
Hero Surya very much happy with his latest Mass movie.
Please Wait while comments are loading...