twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదే అనుష్కకి,అవ్వకీ తేడా: రజనీకాంత్ ('లింగ' ఆడియో ఫొటోలు)

    By Srikanya
    |

    చెన్నై: సూపర్ స్టార్ రజనీ అంటే దేశం మొత్తం క్రేజ్. ఆయన సినిమాలు లాగానే ఆయన సినిమాలకు జరిగే పంక్షన్ లను సైతం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. తాజాగా ఆయన చిత్రం లింగ ఆడియో విడుదలైంది. రజనీ స్వయంగా విడుదల చేసిన ఈ ఆడియో పంక్షన్ గురించే అంతటా మాటలు. ఇందులో ఆయన చమక్కులు సైతం విసిరారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించారు. ఖచ్చితంగా హిట్ కొడతామనే నమ్మకం ఆయన మాటల్లో కనిపించింది. ఆయన సెన్సాఫ్ హ్యూమర్ గురించి హాస్య నటుడు సంతానం వివరించి అందరినీ నవ్వించారు.

    రజనీకాంత్‌లో హాస్యగుణాలు చాలా ఎక్కువ. సెట్‌లో ఆయన అందర్నీ ఆటపట్టిస్తుంటారు. టైమింగ్‌గా నవ్వించడం ఆయనకే సాధ్యం. సమాధానాల్లో కూడా ఆయన సెటైర్లుంటాయి. ఓ సారి 'ప్రేమకు, కోరికకు మధ్య తేడా ఏంట'ని ప్రశ్నించా.. 'అవ్వకు, అనుష్కకు మధ్య ఉన్న తేడా' అని ఆయన సమాధానమిచ్చారు. ఆయన సమాధానం ప్రశ్నను బట్టికాదు.. వ్యక్తిని బట్టి కూడా ఉంటుందని అప్పుడే తెలుసుకున్నా అని సంతానం అన్నారు.

    'రోబో', 'కోచ్చడయాన్‌' తర్వాత సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం 'లింగ'. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూర్చారు. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో ఆయన నటించిన 'లింగ' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో ఆదివారం జరిగింది.

    స్లైడ్ షోలో ఫొటోలు..ఫంక్షన్ విశేషాలు..

    ఘనంగా...

    ఘనంగా...

    కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలోని సత్యం థియేటర్‌లో ఆదివారం జరిగింది.

    ఆవిష్కరణ..

    ఆవిష్కరణ..

    తెలుగు, తమిళ పాటలను రజనీకాంత్‌ ఆవిష్కరించగా.. శంకర్‌, విజయకుమార్‌ తదితర అతిథులు అందుకున్నారు.

    రజనీకాంత్‌ మాట్లాడుతూ....

    రజనీకాంత్‌ మాట్లాడుతూ....

    ''నన్ను తెరపై చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎందుకంటే.. రోబో తర్వాత నాలుగు సంవత్సరాలైపోయింది. కోచ్చడయాన్‌లో నిజంగా కనిపించకపోయే సరికి చాలా ఆవేదన చెందారు. అందువల్లే ఈ ఏడాదిలోనే అభిమానులకు సినిమా అందివ్వాలని నిర్ణయించుకున్నా. అనుకున్నట్టుగానే సిద్ధమైంది. డిసెంబరు 12వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.'' అన్నారు.

    ఎక్కడా ఆగలేదు..

    ఎక్కడా ఆగలేదు..

    రజనీ కంటిన్యూ చేస్తూ...'కోచ్చడయాన్‌' అనేది పూర్తిగా వేరే చిత్రం. నా కుమార్తె సౌందర్యపై పెద్ద భారం మోపేశాను. అయినా ఆమె చాలా చాకచక్యంగా సినిమాను రూపొందించారు. కానీ విడుదలకు పలు సమస్యలు ఎదురయ్యాయి. వాటిని పరిష్కరించాకే 'లింగ' ప్రారంభించాలని అనుకున్నాం. ఏ సమస్య వచ్చినా.. దాన్ని పరిష్కరించేంత వరకు నిద్రపోకూడన్నది నా విధానం. 'లింగ' ఆరంభించాక ఎక్కడా ఆగలేదు.

    కన్నబిడ్డలా చూసుకుంది..

    కన్నబిడ్డలా చూసుకుంది..

    రజనీ ఎమోషనల్ గా మాట్లాడుతూ...నన్ను చిత్రయూనిట్‌ చిన్నబిడ్డలా చూసుకుంది. ఎప్పుడూ 20 మంది నా చుట్టూ ఉంటూ.. నా బాగోగులు చూసుకునేవారు అన్నారు.

    అది కేవలం రవికుమార్ కే సాధ్యం

    అది కేవలం రవికుమార్ కే సాధ్యం

    రజనీ చెప్తూ... కెమెరామెన్‌ రత్నవేలు, కళా దర్శకుడు శిబుసారిల్‌, పాటల రచయిత వైరముత్తు.. ఇలా ఇంత పెద్ద నిపుణులతో.. చాలా పెద్ద సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేయడమంటే.. అది కేఎస్‌ రవికుమార్‌కు మాత్రమే సాధ్యమైం''దని అన్నారు.

     ఆవేదన చెందారనే వెంటనే...

    ఆవేదన చెందారనే వెంటనే...

    రజనీకాంత్‌ మాట్లాడుతూ ...''సౌందర్య దర్శకత్వంలోని 'కోచ్చడయాన్‌' చూసి చాలామంది అభిమానులు నేను రియల్‌గా కనిపించలేదని బాధపడ్డారు. 'కనీసం చివర్లో ఒక్క నిమిషమైనా కనిపించి ఉంటే సంతోషించేవాళ్ల'మని చాలా ఆవేదన చెందారు. అందుకే వెంటనే ఓ సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నా ఇది చేసాను అన్నారు.

    అదే విషయం చెప్పాను..

    అదే విషయం చెప్పాను..

    ఈ చిత్రాన్ని ఆరు నెలల్లో పూర్తి చేసి విడుదల చేయాలనుకున్నాం. ఆ విషయాన్నే కేఎస్‌ రవి కుమార్‌కు చెప్పా. అనుకున్నట్లుగానే చిత్రీకరణ ముగించారు. పాటలనూ విడుదల చేశారు. ఇదో పీరియడ్‌, యాక్షన్‌ సినిమా. అయినా ఇంత త్వరగా సాధ్యమైందంటే అందుకు కారణం కేఎస్‌ రవికుమార్‌ మాత్రమే అన్నారు.

    నాకే తెలియదు..

    నాకే తెలియదు..

    నా గురించి ఎవరెవరో ఏదేదో అనుకుంటారు. నిజానికి నా గురించి నాకే పూర్తిగా తెలియదు'' అని రజనీ వ్యాఖ్యానించారు.

    నాకు భయం లేదు..

    నాకు భయం లేదు..

    రాజకీయాల్లోకి ఎంట్రీ పై రజనీ స్పందిస్తూ...''పరిస్థితులే నన్ను ఈ స్థాయికి చేర్చాయి. నాకు రాజకీయాలంటే భయంలేదు. వాటి గురించి నాకు తెలుసు. లోతెంతో కూడా అర్థం చేసుకోగలను. ఎంత ధైర్యం కావాలో తెలుసు. చాలా మందిని దాటుకుని వెళ్లాలి అన్నారు.

    దేవుడు ఆదేశిస్తే...

    దేవుడు ఆదేశిస్తే...

    అన్నీ సాధించిన తర్వాత.. ప్రజలకు మంచి చేయగలమా? అనే ఆలోచనతోనే కాస్త వెనుకాడుతున్నా. ఏదేమైనా దేవుడు ఆదేశిస్తే నేను రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నా. ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చ'' అని రజనీకాంత్‌ పేర్కొన్నారు.

    దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ..

    దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ..

    కొన్నేళ్ల క్రితం కమల్‌హాసన్‌ నటించబోయే సినిమాను రజనీతో చర్చించా. ఏం పేరుపెట్టాలో అనుకుంటుండగా.. 'తెనాలి' పెట్టొచ్చుగా అని సలహా ఇచ్చారు. అలా ఇతరుల సినిమాకే పేర్లు పెడతారు. మరి ఆయన సినిమాకు పేరుపెట్టే ఛాన్స్‌ వేరేవారికి ఎలా ఇస్తారు? తాను కోలుకుని ఇంటికి వచ్చాక.. మానసికంగా ఆనందాన్ని పంచిన తన మనవడు 'లింగ'ను చూసే.. ఈ సినిమాకు ఆ పేరు పెట్టారని అనుకుంటున్నా అన్నారు.

    కన్నీళ్లు పెట్టుకుని...

    కన్నీళ్లు పెట్టుకుని...

    రవి కుమార్ మాట్లాడుతూ....నన్ను చాలా సీరియస్‌ దర్శకుడు, ప్రతిదానికీ కోప్పడతారని అందరూ అనుకుంటారు. పనిరీత్యా వారితో అలా మాట్లాడతానేగానీ.. వ్యక్తిగతంగా అలా వ్యవహరించను. అందుకే ఇవ్వాళ పాటలను విడుదల చేయగలుగుతున్నా. లేకుంటే ఇంకా చిత్రీకరణ చేసుకునేవాళ్లం. నేను కొన్ని విషయాల్లో గట్టిగా వ్యవహరించినా.. నా చిత్రయూనిట్‌ ఎంతో శ్రమకోర్చి తట్టుకుని విజయవంతంగా ముగించడానికి కృషిచేసింది. (కన్నీళ్ల పర్యంతమవుతూ..)

    కేఎస్‌ రవికుమార్‌ కంటిన్యూ చేస్తూ...

    కేఎస్‌ రవికుమార్‌ కంటిన్యూ చేస్తూ...

    ''రజనీకాంత్‌కు కథ చెప్పిన మరుక్షణమే నటించేందుకు ఒప్పుకొన్నారు. అప్పుడే కొన్ని షరతులూ పెట్టారు. అందులో ఒకటి సినిమా ఆరు నెలల్లో పూర్తవ్వాలనేది. కానీ మేం అనుకున్న కథ ప్రకారం చాలా సమయం పడుతుంది. అయినా చేయగలమన్న నమ్మకంతో ఒప్పుకున్నాం అన్నారు.

    మొదట వేరే టైటిల్...

    మొదట వేరే టైటిల్...

    ప్రారంభంలో 'వెంకన్న' అని పేరుపెట్టాం. తర్వాత ఆయనే 'లింగ' పెట్టమని రజనీ సలహా ఇచ్చారు అని దర్శకుడు రవి కుమార్ చెప్పారు.

    అలా అనుష్క,సోనాక్షిని...

    అలా అనుష్క,సోనాక్షిని...

    గతంలో రజనీతో నటించని, నా దర్శకత్వంలో పనిచేయని హీరోయిన్ల కోసం వెతికాం. అలా అనుష్క, సోనాక్షిని ఎంపికచేశాం. ఇందులో రజనీకాంత్‌ డాన్స్‌ డబుల్‌ స్పెషల్‌గా ఉంటుంది''అని రవికుమార్ చెప్పారు.

    మిమ్మల్ని నమ్ముకున్నాం

    మిమ్మల్ని నమ్ముకున్నాం

    మరో దర్శకుడు అమీర్ మాట్లాడుతూ...దర్శకుణ్ని కానంత వరకు నేను కమల్‌ అభిమానిని. సినిమాల్లోకి వచ్చాక రజనీకి పెద్ద ఫ్యాన్‌గా మారిపోయా. ఎంతోమంది నేతలున్నా.. రజనీ మాత్రమే అసలైన నాయకుడిగా అనిపిస్తారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని కోట్ల మంది అనుకుంటున్నారు అన్నారు.

    మీ వెంటే మేం...

    మీ వెంటే మేం...

    'సార్‌.. మీ గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకండి. మీరు సరేనంటే.. నాలాంటి కోట్ల మంది మీ వెంట నడుస్తారు. మీరు ఒక్క ప్రకటన ఇస్తే చాలు. అన్ని కుర్చీలూ మీ కోసం క్యూ కడతాయి (రజనీని చూసి ఇలా మాట్లాడుతుండగా.. మరోవైపు అభిమానుల కేకలు మిన్నంటాయి. రాజకీయాల్లోకి తప్పకుండా రావాలని అభిమానులు సైతం నినాదాలు చేశారు.). చూశారా.. మేమంతా మిమ్మల్నే నమ్ముకున్నాం. నా నమ్మకం చాలా దృఢమైంది అని అమీర్ ఎమోషనల్ గా చెప్పారు.

    జగపతిబాబు మాట్లాడుతూ...

    జగపతిబాబు మాట్లాడుతూ...

    నేను పుట్టి పెరిగింది చెన్నైలోనే. రజనీకాంత్‌ సినిమాలను చూసే ఎదిగా. ఆయన చిత్రాలంటే ఎంతో ఇష్టం. క్రమం తప్పకుండా చూసేవాణ్ని. అలాంటిది ఆయన నటించిన 'లింగ'లో విలన్‌గా నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. రజనీని చూడటానికి ప్రతిరోజూ హోసూరు, కృష్ణగిరి నుంచి వేల మంది అభిమానులు వస్తుంటారు. షూటింగ్‌ అయ్యాక.. వారందర్నీ ఆయన పలకరించి, వారితో ఫొటోలు తీసుకుంటారు. నిజంగా అభిమానులంటే ఆయనకున్న అభిమానాన్ని చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.

     సంతానం మాట్లాడుతూ...

    సంతానం మాట్లాడుతూ...

    జలాశయం సన్నివేశాలు తెరకెక్కిస్తున్నప్పుడు వేల మంది రజనీని చూసేందుకు వచ్చేవారు. సాయంత్రం అయితే ఆయనతో ఫొటోలు తీసుకునేవారు. దీంతో ఆ ప్రాంతంలోని ఓ ఫొటో గ్రాఫర్‌ అక్కడే సెటిలయ్యాడు. వారికి ఫొటోలు తీసి.. ఆ డబ్బుతో కొన్ని రోజుల తర్వాత అక్కడే 'లింగ' అనే పేరుతో స్టూడియో పెట్టేశాడు. రజనీసార్‌తో సినిమానే కాదు.. ఫొటోలు తీసుకున్నా డబ్బులు సంపాదించగలమని ఆ రోజే అర్థమైంది.

    దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ....

    దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ....

    ''ట్రైలర్‌, పాటలను చూస్తుంటే చిత్రయూనిట్‌ ఏ స్థాయిలో శ్రమించిందో అర్థం చేసుకోగలను. జలాశయం సెట్‌ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇది 'రోబో' కలెక్షన్లను తప్పకుండా దాటుతుందని నమ్ముతున్నాన''న్నారు.

    టైటిల్ త్యాగం..

    టైటిల్ త్యాగం..

    'లింగ' టైటిల్ ...మరో ప్రముఖ తమిళ దర్శకుడు అమీర్ రిజిస్టర్ చేయించారు. రజనీ ఆ టైటిల్ అడిగారని తెలియగానే ఆయన తన టైటిల్ ని ఈ చిత్రానికి ఇవ్వటానికి అంగీకరించారు. ఈ విషయం దర్శకుడు తెలియచేసారు.

    కొత్త డౌట్

    కొత్త డౌట్

    ఇటు రజనీ, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఇద్దరూ...ఈ చిత్రం అనుకున్న టైమ్ కే విడుదల అవుతుందంటే... దర్శకుడు మాత్రం గ్రాఫిక్స్ మాత్రం లేటయ్యే అవకాసం ఉందని అన్నారు.

    అందుకే రాక్ లైన్ వెంకటేష్ తో చేసా...

    అందుకే రాక్ లైన్ వెంకటేష్ తో చేసా...

    రజనీకాంత్ ఎంతో మంది తమిళంలో పెద్ద నిర్మాతలు ఉండగా...రాక్ లైన్ వెంకటేష్ తో చేయటానికి కారణం...తనకు కెరీర్ ప్రారంభంలో చేసిన సాయం అని, తను ఎదుటివారు చేసిన సాయిం మరిచిపోనని అందుకే ఈ డేట్స్ ఇచ్చానని అన్నారు.

    ఇంకా ఎవరెవరు

    ఇంకా ఎవరెవరు

    రజనీకాంత్‌, కేఎస్‌ రవికుమార్‌, నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌, అనుష్క, సోనాక్షిసిన్హా, జగపతిబాబు, దర్శకులు శంకర్‌, ఆమీర్‌, కిచ్చా సుదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    The audio launch of Rajinikanth starrer 'LIngaa' held in Chennai is a starry affair with entire cast and crew of the movie gracing the occasion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X