twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిరాహార దీక్షకు డుమ్మా కొట్టిన రజనీ, కమల్, విజయ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అవినీతి కోసులో 4 ఏళ్ల జైలు శిక్షకు గురైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సంఘీభావం తెలుపుతూ తమిళ సినీ పరిశ్రమ మొత్తం మంగళవారం షూటింగులు, థియేటర్లు బంద్ పాటించడంతో పాటు, నిరాహార దీక్షలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిరాహార దీక్షల్లో తమిళ స్టార్స్ సూర్య, విక్రమ్, కార్తి, శరత్ కుమార్ లాంటి స్టార్స్ తో పాటు పరిశ్రమలోని ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు ఇలా అందరూ పాల్గొన్నారు.

    అయితే కొందరు ప్రముఖ స్టార్స్ మాత్రం ఈ ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశం అయింది. తమిళ టాప్ స్టార్స్ అయిన రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ లాంటి వారు దీనికి హాజరు కాలేదు. కావాలనే వీరు ఈ నిరాహార దీక్షలకు దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

    Hunger strike: Rajinikanth, Kamal Haasan, Ajith Kumar Were missing

    గతంలో విశ్వరూపం సినిమా విడుదల సందర్భంగా....జయలలి ప్రభుత్వం కమల్ హాసన్‌ను ఇబ్బంది పెట్టిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి. అదే విధంగా విజయ్ సినిమా ‘అన్న' విడుదల సమయంలోనూ ఇబ్బందులకు గురి చేసిదంటూ జయలలిత ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఇక రజనీకాంత్ మోడీ మద్దతు దారుడు కాబట్టే ఈ నిరాహార దీక్షకు దూరంగా ఉన్నారని కొందరు అంటున్నారు.

    కాగా...అవినీతి కేసులో జైలు పాలైన జయలలితకు మద్దతుగా తమిళ సినీ పరిశ్రమ మద్దతుగా ఉండటం కొందరు విమర్శిస్తున్నా.....పరిశ్రమ కోసం ఆమె ఎంతో మేలు చేసింది, అందుకే ఆమెకు సంఘీభావంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తమిళ సినీ వర్గాలు సమర్థించుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉండి 66 కోట్లు అక్రమంగా కూడబెట్టుకున్నారనే ఆరోపణలు 18 సంవత్సరాల పాటు సాగిన విచారణ అనంతరం రుజువు కావడంతో జయలలితకు ప్రత్యేక కోర్టు 4 నెలల శిక్షతో పాటు, రూ. 100 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

    English summary
    Tamil Cinema supports Jayalalithaa, Rajinikanth, Kamal Haasan, Ajith Kumar Were missing from Hunger strike.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X