twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రుద్రమదేవి' ట్రైలర్ షో వద్ద ఇళయరాజా (ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ : భారత చలన చిత్ర పరిశ్రమలో తొలి చారిత్రక స్టీరియో స్కోపిక్ 3డి చిత్రం ‘రుద్రమదేవి' . గుణ టీం వర్క్స్ పతాకంపై దర్శకుడు గుణశేఖర్ నిర్మాణ సారథ్యంలో అనుష్క ప్రధాన పాత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ని రీసెంట్ గా తమిళనాట ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఇళయరాజా కు చూపించటం జరిగింది. ఈ ఫొటోలను ఇక్కడ మీరు వీక్షించవచ్చు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    రాణీ రుద్రమది ఓ అద్భుతమైన ప్రయాణం. ప్రపంచ చరిత్రలో ఆమె స్థానం పదిలం. ఈ తరానికి ఆమె కథ తెలియాలి. సాధ్యమైనంత వరకూ చరిత్రను వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సాంకేతికంగా ఈ సినిమాని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. అనుష్క కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది . రాణీ రుద్రమ కదనరంగంలోనే కాకుండా కళా రంగంలోనే గొప్ప కళాకారిణి అని, కత్తిపట్టినా, కాళ్ళకు గజ్జె కట్టినా ఆమెకు సాటి ఆమేనని ఈ చిత్రంలో దర్శకుడు తెలియజేయనున్నాడు.

    ఇప్పటికే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో నిండిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లు విడుదల చేసిన ఈ చిత్రయూనిట్ ఇప్పుడు మరో టీజర్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

    రుద్రమదేవిగా అనుష్క నటిస్తున్న ఈ చిత్రంలో రాజకుమారుడిగా రాణా, విప్లవ వీరుడు గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఇంకా నిత్యామీనన్, క్యాథరిన్, ప్రకాశ్ రాజ్, కృష్ణం రాజు తదితరులు నటిస్తున్నారు. ఇన్ని విశేషాలతో కూడిన ఈ సినిమాను చూడటానికి అల్లు అర్జున్, అనుష్క, రాణాల అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. సంగీతం ఇళయరాజా, ఛాయగ్రహణం ఆర్యన్ విన్సెంట్.

    ఫొటోలు స్లైడ్ షోలో...

    విభిన్నంగా..

    విభిన్నంగా..

    కాకతీయ వీరనారి రుద్రమదేవి కథ కావడంతో ఈ చిత్ర టీం ఈ సినిమా ఆడియోని ఓరుగల్లు ఘనతకు చిహ్నంగా ఉన్న వరంగల్ ఫోర్ట్ లో రిలీజ్ చేయడానికి ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

    లాంచ్ తేది

    లాంచ్ తేది

    అలాగే ఈ ఆడియో లాంచ్ తేదీని ఏప్రిల్ 8న లాక్ చేసే అవకాసం ఉంది.

    ప్రస్తుతం

    ప్రస్తుతం

    దాదాపు 9 సంవత్సరాలు రీసర్చ్ చేసి తెరకెక్కించిన ఈ పీరియాడికల్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

    రిలీజ్ ఎప్పుడంటే...

    రిలీజ్ ఎప్పుడంటే...

    ఈ చిత్రం ఏప్రియల్ 24న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ కు చెప్పినట్లు తెలుస్తోంది. 5

    ఒకే రోజున

    తెలుగు,తమిళ,మళయాళ వెర్షన్ లు సైతం ఏప్రియల్ 24న విడుదల చేస్తారు.

    బడ్జెట్ ఎంత

    బడ్జెట్ ఎంత

    దాదాపు 45 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో తనకే సాధ్యమైన రీతిలో ఎవరూ వంక పెట్టలేని విధంగా రూపొందించాలని గుణ శేఖర్ కష్టపడుతున్నారు

    అల్లు అర్జున్ ఎంట్రీ..

    అల్లు అర్జున్ ఎంట్రీ..

    అలాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎంట్రీ కలవటం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

    దర్శుడు మాట్లాడుతూ...

    దర్శుడు మాట్లాడుతూ...

    ''కాకతీయుల కాలం నాటి వైభవాన్ని కళ్లకు కట్టేలా ఈ సెట్‌లు ఉండబోతున్నాయి. వీటి కోసం తోట తరణి 400 స్కెచ్‌లు వేశారు. నాటి సంప్రదాయలు, జీవన స్థితిగతులను ప్రతిబింబించేలా చిత్రబృందం ఎంతో శ్రమించి వీటికి రూపు తీసుకొస్తోంది. '' అన్నారు.

    ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

    English summary
    Maestro Ilaiyaraaja has watched the trailer of Gunasekar's Tamil Telugu bilingual 3D flick Rudhramadevi at Sathyam Cinemas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X