twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్...అంకుల్ అని పిలిస్తే కాలదా

    By Srikanya
    |

    చెన్నై: తన కన్నా చిన్న వయస్సు హీరోయిన్స్ తో చేసేటప్పుడు హీరోలకు సమస్యే. అందులోను అంకుల్ అని పిలిస్తే ఇంకేముంది. అదే సమస్య తమిళ హీరో జీవా(రంగం ఫేమ్)కి ఎదురైంది. అతనికి జోడిగా చేస్తున్న తులసి(రాధ కూతురు,కడలి హీరోయిన్) జీవాని అంకుల్ అని పిలుస్తోంది. దాంతో అంకుల్ అని పిలవద్దని చెప్పానని మీడియాతో చెప్తున్నారు. కోలీవుడ్‌ స్టార్‌ యువ హీరోలలో ఒకరైన జీవా చక్కని నటుడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తండ్రి ఆర్‌బీ చౌదరి అండతో వచ్చినా అనతి కాలంలోనే తనదైన నటనతో ప్రత్యేక ఇమేజీ సంపాదించారు. అన్ని పాత్రల్లో ఇట్టే ఇమిడిపోగల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 'యాన్‌'లో నటిస్తున్నారు.

    జీవా మాట్లాడుతూ... తులసి చిన్నమ్మాయే అయినా.. మంచి పరిపక్వతతో నటించగలదు. తొలిసారి నన్ను కలిసినప్పుడు అంకుల్‌ అనే పిలిచింది. 'పేరు పెట్త్టెనా పిలువు. కానీ అంకుల్‌ అని మాత్రం పిలవొద్ద'ని చెప్పా. ఆ తర్వాత నుంచి సర్‌ అనడం ప్రారంభించింది. తులసి అమ్మ రాధ పెద్ద నటి కావటంతో కుమార్తెకు సరైన శిక్షణ ఇచ్చి మరీ పంపారు. అందువల్లే ఫలానా సన్నివేశం అంటూ కాకుండా.. సెంటిమెంట్‌, రొమాన్స్‌ ఇలా అన్నింటిలోనూ మెచ్చుకోదగిన నటనే కనబరిచింది. మీరు చెప్పే కెమిస్ట్రీ కూడా మా ఇద్దరి మధ్య బాగానే కుదిరింది అన్నారు.

    Jeeva fire on Tulasi for calling him "Uncle"

    'యాన్‌'లో తన పాత్ర గురించి మాట్లాడుతూ... ఎలాంటి చీకూచింతా లేకుండా.. హాయిగా జీవించే యువకుడి కథ. అనుకోని విధంగా అతడు సమస్యలో చిక్కుకుంటాడు. తనదైన పోరాటం చేసి ఎలా బయటపడ్డాడనేదే అసలు కథ. ఇప్పటివరకు నటించిన చిత్రాల్లో ప్రేమికుడిగా, అల్లరిచిల్లరి యువకుడిగా కనిపించిన నేను తొలిసారిగా ఇందులో మాత్రం ఓ అంతర్జాతీయ సమస్యను పరిష్కరించేందుకు పోరాటం చేస్తుంటాను. ఇలాంటి కథలు గతంలో చాలానే వచ్చినా.. కొత్తగా చూపించనున్నాం. అందులోనూ పతాక సన్నివేశాలు ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపిస్తాయి. మానవీయతకు సంబంధించిన ఓ అంతర్జాతీయ సమస్యను ధైర్యంగా మా చేతుల్లోకి తీసుకున్నాం అన్నారు.

    అలాగే కచ్చితంగా యాన్‌ ఘన విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పగలను. ఓ సినిమా విడుదలకు ముందు పాజిటివ్‌గా మాట్లాడానికి భయంగానే ఉంది. ఎందుకంటే అలా ధీమా ప్రదర్శించిన చాలా చిత్రాలు ఊసురుమనిపించాయి. అందుకని మా చిత్రంపై అపనమ్మకంగా ఉన్నామని కాదు. కచ్చితంగా నా కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ కథతో తొలుత హిందీలో అభిషేక్‌బచ్చన్‌తో చేయాలనుకున్నారు. ఆయన బిజీగా ఉండటంతో ఆ అవకాశం నాకు దక్కింది అన్నారు.

    English summary
    Thulasi Nair, younger daughter of yesteryear heroine Radha is now doing a film 'Yaan' opposite hero Jiiva. Apparently our hero is one short of 30 and our heroine is 15 year old. Reports have that when Thulasi is about calling Jiiva as uncle, our heroine asked her not to call in that way. Though for the kind of seniority Jiiva is having, there should be some respect given, but calling him uncle is not a right thing to do, stated an observer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X