twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కబాలి' : డైరక్టర్ కు షాక్ ఇచ్చిన రజనీ

    By Srikanya
    |

    చెన్నై : 220 పేజీల బౌండెడ్ స్క్రిప్టుని ఒక్క రోజులో చదివి,గుర్తు పెట్టుకోవటం సామాన్యమైన విషయం కాదు. అదీ నడి వయస్సు దాటిన రజనీకాంత్ వంటి సూపర్ స్టార్. అదే చేసారు రజనీ. ఆయన తన తాజా చిత్రం 'కబాలి' స్క్రిప్టుని ఒక్క రోజులో మొత్తం చదివేసారు. అంతేకాదు అందులో సీన్స్ ,డైలాగ్స్ విషయమై దర్సకుడుతో చర్చించారు. ఆయన ధారణ శక్తి కు, జ్ఞాపక శక్తికి దర్శకుడు షాక్ కి గురి అయ్యారు. ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా తెలియచేసారు.

    డైరక్టర్ రంజిత్ మాట్లాడుతూ...నేను ఓ వారం రోజులు పడుతుంది ఈ 220 పేజీల స్క్రిప్టు పూర్తిగా చదివి అర్దం చేసుకోవటానికి అనుకున్నాను. కానీ నా అంచనాలు తారు మారు చేసారు. ఒక్క రోజులో మొత్తం చదివేసి తెల్లారి నాతో డిస్కస్ చేసారు.

     ‘Kabali’ :Rajini stunned his director

    సినిమాలో ఇంటర్వెల్ గురించి, అనేక డైలాగ్స్ గురించి నాతో చర్చించారు. ఆయనకు స్క్రిప్టుపై ఏర్పడ్డ కమాండ్ చూసి ఆశ్చర్యం వేసింది అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు రంజిత్.

    రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'కబాలి' . రజనీ 159 వ చిత్రం ఇది. ఇందులో రజనీ గ్యాంగస్టర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం వినాయిక చవితి సందర్బంగా పూజ చేసి, లాంచ్ చేసారు. ఈ లాంచింగ్ పంక్షన్ కు రజనీ తో పాటు దర్సకుడు, నిర్మాత, నటీనటుుల, సాంకేతిక నిపుణులు విచ్చేసారు. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

     ‘Kabali’ :Rajini stunned his director

    అందుతున్న సమాచారాన్ని బట్టి...ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 106 రోజులు ప్లాన్ చేసారు. జనవరి నెలాఖరు వరకూ షూటింగ్ జరుగుతుంది. చెన్నైలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసి, మలేషియాకు తరువాత షూటింగ్ కు వెళ్తారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజనీ డాన్ గా కనిపించనున్నారు. సినిమా కథ మొత్తం మలేషియా బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. షూటింగ్ సింగపూర్ లో ప్లాన్ చేసారు. దర్శకుడు ఎందుకని సింగపూర్, మలేషియా ఎంచుకున్నారు అంటే... అక్కడ ఉన్న ఆసియా దేశాల ముఖ్యంగా ఇండియా లేబర్ ఎక్కువ. అక్కడ వారితో ఓ డాన్ కు ఉన్న రిలేషన్ తో కథ నడవబోతోందని తెలుస్తోంది.

    వినాయిక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక,నిర్మాతలు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని ఇక్కడ చూడండి.

    English summary
    Rajinikanth has stunned his Kabali movie director Ranjith by read and memorised the entire 220 page bounded script in a single day! Superstar Rajinikanth‘s 159th film “Kabali”, in which he essays the role of a gangster, was officially launched here on Thursday. Dressed in light blue jeans and dark blue full-sleeve shirt, Rajinikanth arrived for the film’s puja ceremony. The entire cast and crew of the film, including producer Kalaipuli S. Thanu and director Pa. Ranjith were present at the launch. The regular shooting of the film has also started. The film, which is said to be based on the life of a Chennai-based don, also features Radhika Apte, Dhansikaa, Kalaiarasan and John Vijay, who play important roles
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X