twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సార్‌బోర్డు పై మరోసారి కమల్‌హాసన్‌ ఫైర్

    By Srikanya
    |

    చెన్నై : సెన్సార్‌బోర్డు తన స్వేచ్ఛను అడ్డుకుందని ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌ ఆరోపించారు. సృజనాత్మక స్వేచ్ఛ కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టంచేశారు. బోర్డు నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన పలుసార్లు గళమెత్తిన విషయం తెలిసిందే.

    ఇంతకు ముందు ... 'సినిమాల విషయంలో సెన్సార్‌ బోర్డు తన పరిధికి మించి జోక్యం చేసుకుంటోంద'ని ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ విమర్శించారు. 'ఉత్తమ విలన్‌'కు సంబంధించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ''సినిమా వాళ్లు ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పేందుకు సెన్సారు బోర్డు ప్రయత్నిస్తోంది. దీన్ని నేను సమ్మతించను'' అని కమల్‌ అన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Kamal Haasan again fire on censor board

    అలాగే...సెన్సార్‌ బోర్డు తీరు ప్రస్తుతం బాధాకరంగా అనిపిస్తోంది. మాట్లాడే స్వేచ్చపైన, అభిప్రాయ వ్యక్తీకరణపై వారు పాదం మోపడం సమంజసం కాదు. సినిమాలో ఏం మాట్లాడాలన్నా.. ముందు వారికి చెప్పి.. అనుమతి తీసుకున్నాకే సినిమాలో పెట్టే పరిస్థితి వస్తుందేమో. అయినా వారిని ఎదుర్కోవడానికి నువ్వెవరు?.. అని అడగొచ్చు. నేను ఓ కళాకారుడిని.

    కమల్ హాసన్ మాట్లాడుతూ...''ఓ కళాకారుడిగా ప్రజలకు సందేశాన్ని ఇవ్వడం నా బాధ్యత. అయితే దీనికి అడ్డుపడుతున్న వారి గురించి కూడా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా'' అంటూ పరోక్షంగా సెన్సార్‌ బోర్డుపై విమర్శలు గుప్పించారు.

    అదేంటో కానీ.. నా సినిమాలకు పనిగట్టుకుని కొత్త సమస్యలు సృష్టిస్తుంటారు. 'ముంబయి ఎక్స్‌ప్రెస్‌' పేరును మార్చమన్నారు. ఆ తర్వాత 'దశావతారం' కథ నాదని ఒకరొచ్చారు. అసలు అతన్ని ఎవరు పంపారో కూడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో కూడా తెలుసు. 'విశ్వరూపం'ను కూడా అలాగే చేశారు. ఇప్పుడు 'పాపనాశం' సినిమాకు కూడా పలు అడ్డంకులు ఎదురయ్యాయి. ఇవన్నీ సహజమే అనుకుని వెళ్తున్నా.

    Kamal Haasan again fire on censor board

    ఆయన తాజా చిత్రం ఉత్తమవిలన్ గురించి మాట్లాడుతూ..ఈ చిత్రంలో నేను రెండు భిన్నమైన కాలాలకు చెందిన వ్యక్తులుగా నటించా. ఈ రెండింటినీ కలిపే పాత్రలో కేబీ నటించారు. కానీ కేబీ పోతూపోతూ నా ఆశయాన్ని నెరవేర్చి నా సినిమాలో నటించారనే అనుకుంటున్నా. ఉత్తమవిలన్ లో కె.విశ్వనాథ్‌ పాత్ర కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఇద్దరూ పరస్పరం పోటీపడే పాత్రల్లో నటించారు.

    ఇది ఎలాంటి కథ.. అని అందరూ అడుగుతున్నారు. 'ఉత్తమ విలన్‌' కోసం నేనేమీ అద్భుతాలు సృష్టించలేదు. నేను చూసిన, గతంలో నా సినిమాలో ఉన్న కొన్ని అంశాలే ఈ చిత్ర కథ. ఇది కమల్‌ చిత్రం మాత్రమే కాదు.. అందరి కృషి ఇందులో కనిపిస్తుంది. వూశ్వరి, ఆండ్రియా, పూజాకుమార్‌, పార్వతిమేనన్‌.. కొత్తలుక్‌లో కనిపిస్తారు.

    ఇక నాజర్‌, ఎం.ఎస్‌.భాస్కర్‌, జయరామ్‌ పాత్ర ప్రేక్షకులను రంజింపజేస్తాయి. ఇందులో అందరూ నాకు జోడీయే. ప్రత్యేకించి హీరోయిన్ అని ఎవర్నీ చెప్పలేను. ఇందులో నెత్తురోడే సన్నివేశాలేవీ లేవు. అలాంటిది ఉండకూడదని ప్రారంభంలోనే నిర్ణయం తీసుకున్నాం.

    English summary
    Kamal Haasan is the new entrant to join the bandwagon of members supporting certification and not censorship."Censorship is a clear sign of someone not wanting you to speak your mind even if thoughts are just and normal. Even children try to stop their friends from revealing something which they think might be embarrassing to them. It is a childish trait in a grownup society. Governments which are still not open to democracy, do such things. We are not under such a government," he added.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X