twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాబోయే సీఎం కు కమల్ హాసన్ ట్వీట్ వార్నింగ్, సినిమా సంగతి ఏమైంది

    “నెమలి ఈకలు బండి ఇరుసుని విరగ్గొట్టగలవు” అని అర్థం వచ్చే ఒక కొటేషన్ ను కమల్ ట్వీట్ చేసాడు.

    By Srikanya
    |

    హైదరాబాద్ : జయలలిత మృతి సమయంలో ...చేసిన ట్వీట్ తో తమిళనాట అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కమల్ మరోసారి తన ట్వీట్ తో తమిళనాట రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నారు. సినీ నటుడు కమల్ హాసన్ ట్విటర్ ద్వారా తన అసంతృప్తిని వెళ్ళగక్కాడు. "నెమలి ఈకలు బండి ఇరుసుని విరగ్గొట్టగలవు" అని అర్థం వచ్చే ఒక కొటేషన్ ను శశికళను ఉద్దేశించి... కమల్ ట్వీట్ చేసాడు.

    ఎన్నో అవినీతి ఆరోపణలు, కేసులు వేడుర్కొంటున్న శశికళ ని అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు తమ నేతగా ఎన్నుకోవడం తోనే ఈ ట్వీట్ చేసారని చెప్తున్నారు. సామాన్యుడి సహనాన్ని పరీక్షించవద్దంటూ కమల్ ఘాటుగా స్పందించటం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

     Kamal Haasan has the courage to comment on political affairs of the state, even indirectly.

    ఇదిలా ఉంటే కొందరు మాత్రం ...కమల్ తాజా చిత్రం శభాష్ నాయుడు షూటింగ్ మానేసి, రాజకీయాలమీద పడ్డారేంటని విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియాలో. కమల్ హాసన్ హీరోగా తెలుగు, తమిళం, హిందీలలో రూపొందుతున్న మూవీ 'శభాష్‌ నాయుడు'. ఈ చిత్రం షూటింగ్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో గత కొద్ది రోజులు షూటింగ్ చేసారు. ఈ షెడ్యూల్ లో బ్రహ్మానందం, రమ్యకృష్ణ కూడా పాల్గొన్నారు. సినిమాలో వీళ్లిద్దరూ చాలా కీలకమైన రోల్స్ వేస్తున్నారు.

    ఇక శభాష్‌ నాయుడు సినిమాలో కమల్ హాసన్ భార్యగా రమ్యకృష్ణ నటిస్తున్నది .ఈ కమల్ సినిమాలో అతని కూతురు శృతిహాసన్ కుమార్తెగానే చేస్తోంది. కమల్ హాసన్ అదివరకు దశావతారం సినిమాలో సీబీఐ ఆఫీసర్ బలరాం నాయుడిగా ఒక పాత్ర వేశాడు. అదే కేరక్టర్ ను మెయిన్ గా తీసుకుని ఆ పాత్రకు సీక్వెల్‑లా శభాష్ నాయుడు సినిమా తీస్తున్నారు.

    మరో ప్రక్క భారత క్రికెట్ జట్టు క్రికెటర్ అశ్విన్ కూడా పవర్ పంచ్‌తో శశికళపై విరుచుకుపడిన విషయం తెల్సిందే. ఇదే అంశంపై ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశాడు. 'త్వరలో రాష్ట్ర యువతకు 234 ఉద్యోగాలు రావడం ఖాయం' అంటూ శశికళపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

    'తమిళనాడులోని యువకులందరికీ శుభవార్త... త్వరలో 234 ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి'' అని పోస్టు చేశాడు. తమిళనాడు అసెంబ్లీలో 235 అసెంబ్లీ స్థానాలు ఉండడంతో త్వరలో 234 ఉద్యోగాలు అంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

    English summary
    Kamal Haasan has the courage to comment on political affairs of the state, even indirectly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X