twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    24న కమల్ హాసన్ కొత్త చిత్రం పూజ

    By Srikanya
    |

    చెన్నై : రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ నటించనున్న 'ఉత్తమవిలన్‌'ను ఈ నెల 24న లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందులో కమల్‌కు ముగ్గురు హీరోయిన్లు ఉండేలా కథను సిద్ధం చేసుకున్నారు. త్రిష, తమన్నా, కాజల్‌ను ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. 'దృశ్యం' రీమేక్‌లో కమల్‌హాసన్‌ సరసన నటించేందుకు నదియా, సిమ్రాన్‌ల మధ్య పోటీ నెలకొందన్న వార్తల నేపథ్యంలో ఆయన మరో కొత్త చిత్రంలో త్రిష, తమన్నా, కాజల్‌ జోడీ కట్టనున్నారనే వార్త హాట్‌ టాపిక్‌గా మారింది.

    వీరిలో త్రిష ఇప్పటికే కమల్‌తో 'మన్మథన్‌ అంబు'లో నటించగా, మిగతా ఇద్దరు మొదటిసారి ఆయనతో కలిసి పనిచేయనున్నారు. ఇందులో తనతో పాటు తన గురువు కె.బాలచందర్‌ కూడా నటిస్తున్నారని, చిత్రంలోని పాత్రకోసం గడ్డం కూడా పెంచుతున్నానని కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. కమల్‌తో కలిసి దక్షిణాదికే చెందిన మరో నలుగురు అగ్ర హీరోలు కూడా ఇందులో కనిపించనున్నారని సమాచారం. వారిలో ఒకరిగా మమ్ముటిని ఎంపిక చేశారు. ఇది పూర్తి హాస్యభరిత కథా చిత్రమని సమాచారం.


    ఈ తరహా చిత్రాలకు సంభాషణలు రాయడంలో రచయిత క్రేజి మోహన్ పేరు గడించారు. ఉత్తమ విలన్ చిత్రానికీ ఆయనే మాటలు రాస్తున్నారు. హాస్యపాత్రలో వివేక్ నటించనున్నారు. ప్రస్తుతం కమలహాసన్ విశ్వరూపం-2 చిత్ర రిలీజ్ హడావిడిలో బిజీగా ఉన్నారు. త్వరలో ఉత్తమ విలన్ తెరకెక్కనుంది. 'పంచతంత్రం'లో కమల్‌తోపాటు ఓ ముఖ్య పాత్ర పోషించారు రమేష్‌.

    రమేష్ అరవింద్ మాట్లాడుతూ.. '' నేను, కమల్‌ మంచి స్నేహితులు. కన్నడలో నేను తెరకెక్కించిన 'రామా శ్యామా భామా'లో కమల్‌ ముఖ్యపాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన 'విశ్వరూపం 2' చిత్రీకరణ పూర్తి చేశారు. నేను కూడా కన్నడ సినిమాలను ఒప్పుకోలేదు. కమల్‌తో 'ఉత్తమ విల్లన్‌' తెరకెక్కించే పనుల్లో ఉన్నా. దీని స్క్రిప్ట్‌ను కమలే రాశారు. పలు సినిమాలలో ఆయనతో కలసి నటించిన అనుభవం ఉంది. మా అభిప్రాయాలను బాహాటంగా చర్చించుకుంటాం. మంచి స్నేహితుడు కావడంవల్ల అడ్వాంటేజ్‌ తీసుకోగలుగుతున్నాను''అని చెప్పారు.

    English summary
    The pooja launch of Kamal Haasan's new film "Uthama Villain", helmed by Ramesh Aravind, will be held in Chennai on 24 February. They will start shooting some sequences in the city before they go in for a schedule break.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X