twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను క్షమాపణ చెప్పమన్నారు: కమల్‌

    By Srikanya
    |

    చెన్నై : 'సినిమా శాటిలైట్‌ రైట్‌ అంశం వచ్చిన తొలినాళ్లలో దీన్ని వినియోగించుకోవాలని, నిర్మాతలు ఆదాయం పొందాలని బాహాటంగా ప్రకటించాను. అయితే నా మాటలపై సినీ వర్తక సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా థియేటర్లో నడుస్తుండగానే శాటిలైట్‌ రైట్స్‌ విక్రయించడం సబబు కాదని, ఇందుకోసం క్షమాపణ చెప్పాలని వర్తక సంఘం కోరింది. కానీ నేను చెప్పలేదు. అందుకు గర్వం కారణం కాదు. వారి కోరికలో న్యాయం లేదు. ఇప్పుడు చేరన్‌ చేస్తున్నది సీ2హెచ్‌ కూడా అదే. ఆయన ప్రయోగం తప్పకుండా ఫలిస్తుంది. కాలం వెళ్లే దిశగానే మనం కూడా వేగంగా వెళ్లాలి'అని కమల్‌ చెప్పారు. అనారోగ్యం కారణంగా కమల్‌హాసన్‌ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే ఆయన మాట్లాడిన వీడియోను ప్రసారం చేశారు.

    ఆరు నెలల కిందట దర్శకుడు చేరన్‌ ఈ సీ2హెచ్‌కు శ్రీకారం చుట్టారు. గత ఏడాది దాదాపు 300 పైచిలుకు చిత్రాలు సెన్సార్‌ పూర్తి చేసుకున్నాయి. వీటిలో 143 చిత్రాలు మాత్రమే తెరపైకి వచ్చాయి. వాటిలో 12 సినిమాలు ఆశించిన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. 150కి పైగా చిత్రాలు విడుదలకు నోచుకోలేని దుస్థితిలో ఉన్నాయి. వీటి ప్రభావంతో ఎంతో మంది నిర్మాతలు, దర్శకులు, నటులు ప్రేక్షక పరిచయానికి దూరమయ్యారు. ఇదిలా ఉండగా.. విడుదలైన సినిమాల్లో 12 సినిమాలు మాత్రమే పేరు తెచ్చుకున్నాయి. మిగిలిన వాటిలో మంచి చిత్రాలు ఎక్కువగా ఉన్నా.. రెండో ప్రదర్శనకే పైరసీ సీడీలు లభ్యమవడంతో భారీ నష్టం వాటిల్లింది. ఇలా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న సినిమాలను నేరుగా ప్రజల చెంతకు తీసుకెళ్లే ప్రయత్నమే ఈ సీ2హెచ్‌. చిత్రాన్ని థియేటర్లలో కాకుండా సెల్‌ఫోన్‌, చిప్‌, సీడీలు, డీటీహెచ్‌లల్లో విడుదల చేయడమే దీని ప్రత్యేకత.

    చేరన్‌ స్పందిస్తూ.. ఇప్పటి వరకు చాలా మంది ప్రేక్షకులతో మాట్లాడాం. పైరసీల గురించి వారి వద్ద ప్రస్తావించగా.. 'కుటుంబంతో థియేటర్‌కు వెళ్తే.. రూ.1000 నుంచి రూ,2 వేల వరకు ఖర్చవుతోంది. ఒంటరిగా వెళ్లినా.. రూ.500 వరకు చెల్లించాల్సి వస్తోంది. అయితే నెలకు 10 నుంచి 20 సినిమాలు వస్తున్నాయి. వీటిలో ఒక్క సినిమాకే ఇంత ఖర్చయితే మిగిలినవి చూడలేం. అందుకే పైరసీలపై ఆధారపడుతున్నాం. ఒరిజినల్‌ సీడీలు లభ్యమైతే అసలు వాటి జోలికెళ్ల'మని చెబుతున్నారు.

     Kamal Haasan talks about Cheran's C2H

    అందువల్లే ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. ప్రస్తుతం దీని ద్వారా 'జేకే ఎనుం నన్బనిన్‌ వాళ్‌కై', 'ఆల్‌', 'సిగప్పు ఎనక్కు పిడిక్కుం'లతోపాటు పలు సినిమాలను విడుదల చేయనున్నాం. ఇదివరకు విడుదల కాని సినిమాలను తెరపైకి తీసుకొస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మా సంస్థకు 800 మంది డిస్ట్రిబ్యూటర్లు, 6,000 మంది ఉద్యోగులు ఉన్నారు. సినిమాను నేరుగా సీడీలు, చిప్‌, డీటీహెచ్‌ల రూపంలో విడుదల చేస్తాం. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మా ఉద్యోగులది. ఆ తర్వాత పైరసీలు రాకుండా వారే కాపలాకాస్తారని చెప్పారు.

    సాధారణ థియేటర్లు తగ్గాయి.. మల్టీప్లెక్సులు పెరిగాయి. వినోదం కోసం కుటుంబంతో వెళ్తే.. తిరిగొచ్చేప్పుడు జేబుకు చిల్లు తప్పట్లేదు. ఇది సగటు ప్రేక్షకుడి బాధ. అయితే.. తాను పైసా పైసా కూడబెట్టి.. అండంలోని శిశువులా తెరకెక్కించి.. చివరకు విడుదల చేయాలన్నా థియేటర్లు దక్కక.. ఎంతో మంది నిర్మాతలు కన్నీళ్లు పెట్టుకొంటున్నారు. మరోవైపు థియేటర్లు దొరికినా.. విడుదల రోజే పైరసీలు పుట్టుకురావడంతో నిర్మాత ఆదాయం విషయాన్ని పక్కనబెడితే.. అసలుకే ఎసరు వస్తోంది. ఈ పరిస్థితులకు దర్శకుడు చేరన్‌ 'సీ2హెచ్‌' సమాధానంగా చెబుతున్నారు.

    ఈ కార్యక్రమంలో దర్శకులు భారతిరాజా, భాగ్యరాజ్‌, కేఎస్‌ రవికుమార్‌, సీమాన్‌, అమీర్‌, నిర్మాత కేఆర్‌ తదితరులు పాల్గొని.. చేరన్‌ ప్రయత్నాన్ని అభినందించారు. భవిష్యత్తులో ఈ ప్రయోగమే కీలకంగా మారుతుందని వారు పేర్కొన్నారు.

    English summary
    
 Kamal Haasan talks about Cheran’s C2H . The main objective of this initiative is to enable producers to maximize the revenue with the use of latest technology and unique distribution networks, which were created over a period of 8 months.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X