twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏం జరుగుతోంది? : సత్యం థియేటర్‌పై పెట్రోబాంబు దాడి

    By Srikanya
    |

    చెన్నై: విజయ్‌ నటించిన 'కత్తి' చిత్రంపై నిరసనలు అధికమవుతున్నాయి. మురుగదాస్‌ దర్శకత్వంలోని ఈ సినిమా బుధవారం విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ చిత్రం విడుదలయ్యే రెండు థియేటర్లపై దాడులకు దిగారు. చెన్నైలోని సత్యం థియేటర్‌లో ఏర్పాటు చేసిన 'కత్తి' పోస్టర్‌ను చించివేశారు.

    థియేటర్‌ అద్దాలను ధ్వంసం చేశారు. పెట్రోబాంబును వేసి పరారయ్యారు. ఉడ్‌ల్యాండ్స్‌ థియేటర్‌పై కూడా దాడులు జరిగాయి. దీంతో సినిమా విడుదలవుతుందా? లేదా? అన్న ప్రశ్న మొదలైంది. కాగా చిత్రం బుధవారం విడుదలవుతుందని నటుడు విజయ్‌ స్పష్టం చేశారు. 'లైకా ప్రొడక్షన్‌' పేరును బ్యానర్లు, సినిమా నుంచి తొలగించామని తెలిపారు. ఈ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్‌ శ్రీలంకకు చెందటంతో ఈ చిత్రంపై తమిళనాడులో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

    దీంతో చిత్ర యూనిట్‌ బెంబేలెత్తిపోయింది. సంఘటనకు కారణమైన పెరియార్‌ ద్రావిడ కళగానికి చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను చిత్రయూనిట్‌ కమిషనర్‌కు మంగళవారం విన్నవించుకుంది చిత్ర యూనిట్‌. తమ సినిమా ఆడేందుకు తగిన భద్రత కల్పించాలని కమిషనర్‌ను కోరారు. 'తప్పనిసరిగా తగిన బందోబస్తు కల్పిస్తా'మని భరోసా ఇవ్వడంతో చిత్రయూనిట్‌ వూపిరి పీల్చుకుంది.

    మిగతా విశేషాలు ..స్లైడ్ షోలో...

    కనీసం ముగ్గురు పోలీసులు

    కనీసం ముగ్గురు పోలీసులు

    ఈ టెన్షన్ లను ప్రక్కన పెట్టి మంగళవారం విడుదలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగరవ్యాప్తంగా 'కత్తి' చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. ఒక్కో థియేటర్‌ వద్ద కనీసం ముగ్గురు పోలీసులను ఏర్పాటు చేశారు.

    హీరో విజయ్ భరోసా

    హీరో విజయ్ భరోసా

    అభిమానులు భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని చిత్ర హీరో విజయ్‌ కోరారు. 'లికా ప్రొడక్షన్‌' బ్యానరుపై విజయ్‌, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రారంభం నుంచే సమస్యల వలయంలో చిక్కుకుంది.

    ఆరోపణ

    ఆరోపణ

    శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సకు 'లికా ప్రొడక్షన్‌'కు సంబంధం ఉందని.. అలాంటి వ్యక్తి తమిళ చిత్రాన్ని నిర్మించడం సముచితం కాదని పలు తమిళ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందువల్లే ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఇతర అంశాలను కూడా బయటకు పొక్కనివ్వకుండా షూటింగ్ జరిపారు.

    నిరసనలు...

    నిరసనలు...

    ఆడియో విడుదల కార్యక్రమాన్ని కూడా చాలా నిరాడంబరంగా ముగించేశారు. కత్తి సినిమాకు వ్యతిరేకంగా వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌తోపాటు పలువురు నేతలు, తమిళ సంఘాలు, పెరియార్‌ద్రావిడ కళగం నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

    440 థియేటర్లలో..

    440 థియేటర్లలో..

    అనుకున్నట్టుగానే సినిమాను బుధవారం తెరపైకి తీసుకొస్తున్నామని చిత్రవర్గాలు మీడియా తో పేర్కొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 440 థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నామని తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా నగరంలో పోలీసు భద్రత అధికంగా వేశారని, అభిమానులు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది.

    ఎమ్మల్యే ప్రకటన

    ఎమ్మల్యే ప్రకటన

    విజయ్‌ నటించిన 'కత్తి' చిత్రాన్ని ప్రేక్షకులు బహిష్కరించాలని ఎమ్మెల్యే జవహిరుల్లా కోరారు. ఈ విషయమై ఆయన మంగళవారం ఓ ప్రకటన జారీ చేశారు. తమిళ జాతికి కీడు తలపెట్టిన రాజపక్స బంధువు ఈ సినిమాను నిర్మించారని.. అలాంటి సినిమాను తమిళులు ఎదుర్కోవాలని డిమాండ్‌ చేశారు.

     క్రేజూ బాగానే ఉంది...

    క్రేజూ బాగానే ఉంది...

    ఏఆర్‌ మురుగదాస్‌, విజయ్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో చిత్రం 'కత్తి'. విజయ్‌తో సమంత తొలిసారిగా జతకడుతోంది. అనిరుధ్‌ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ప్రారంభం నుంచే పలు సమస్యలను ఎదుర్కొంటోంది. గతంలో ఏఆర్‌ మురుగదాస్‌, విజయ్‌ కాంబినేషన్లో వచ్చిన 'తుప్పాక్కి' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో వీరి తదుపరి చిత్రంపై అంచనాలు పెద్దస్థాయిలోనే ఉన్నాయి.

    ఇదే డిమాండ్...

    ఇదే డిమాండ్...

    ఈ సినిమా తెరమీదకు రావాలంటే.. బ్యానర్ నుంచి లైకా ప్రొడక్షన్స్ పేరు తీసేయాలన్న డిమాండు గట్టిగా వినిపిస్తోంది. ఆ పేరు లేకపోతే మాత్రం సినిమా విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, వాళ్లు ఆ పేరు తీయకపోతే మాత్రం.. మొత్తం వందకు పైగా తమిళ సంఘాలు ఆ సినిమా తమిళనాడులోని ఏ థియేటర్ లోనూ విడుదల కాకుండా అడ్డుకుంటాయని ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న టి.వేల్ మురుగన్ చెప్పారు.

    అనుకున్నారు కానీ...

    అనుకున్నారు కానీ...

    తమిళ అనుకూల వర్గాలు, థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా నిర్మాతల మధ్య సోమవారమే ఓ సమావేశం నిర్వహించి ఈ సమస్యను పరిష్కరించాలని భావించారు. అయితే అనుకున్నట్లు గా జరగలేదు.

    విశ్వరూపం కు ఇలాంటి...

    విశ్వరూపం కు ఇలాంటి...

    విశ్వరూపం సినిమా విడుదల విషయంలో కూడా కొంత గందరగోళం నెలకొనడంతో చాలా వరకు థియేటర్లకు భారీ నష్టాలు వచ్చాయి. అలాంటి పరిస్థితిని కల్పించాలని తాము అనుకోవట్లేదని తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం సభ్యుడొకరు తెలిపారు. ఇక విజయ్ ఇంతకుముందు నటించిన 'తలైవా' సినిమా కూడా విడుదల విషయంలో సమస్యలు ఎదుర్కొంది.

    డిఫెరెంట్ గా...

    డిఫెరెంట్ గా...


    మురుగదాస్‌ కథలన్నీ విభిన్నంగా ఉంటాయి. షార్ట్‌ టర్మ్‌ మొమొరీ లాస్‌ అనే కథాంశంతో 'గజిని' తీర్చిదిద్దారు. 'రమణ', 'సెవెన్త్‌సెన్స్‌', 'తుపాకీ' కూడా సాధారణ సినిమాలకు విభిన్నంగా సాగేవే. అందుకే మురుగదాస్‌ సినిమా వస్తోందంటే అందరిలోనూ ఆసక్తి. ఇప్పుడాయన 'కత్తి' పదును చూపించబోతున్నారు. కె.కరుణామూర్తి, ఎ.శుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మించారు. అనిరుథ్‌ స్వరాలు అందించారు.

    తెలుగులో ...

    తెలుగులో ...

    తెలుగులో రిలీజ్ చేస్తున్న ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ''థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ చిత్రమిది. సెంటిమెంట్‌కీ చోటుంది. అనిరుథ్‌ స్వరాలు అదనపు ఆకర్షణ. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము. ఈ నెల 24న 'కత్తి' పాటల్ని విడుదల చేస్తాం ''న్నారు.

    English summary
    Kathi Movie which was planned to release on Wednesday, suffered attacks at major theatre's in Chennai by miscreants at late hours on Monday. At Around 12 in the night, a gang of trouble-makers had reportedly thrown stones, broken the glass panes and hurled petrol bombs at Sathyam theatre and Woodlands theatre. Some of the thugs even tore the banners of Kaththi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X