twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్ స్పాట్ లో దర్శకుడు అరెస్టు,యూనిట్ షాక్

    By Srikanya
    |

    Kollywood director Saran arrested, released on bail
    చెన్నై: చెక్ బౌన్స్ కేసులో ఓ దర్శకుడుని అరెస్టు చేసారు. ఆ దర్శకుడు తమిళ దర్శకుడు కావటంతో ఒక్కసారిగా చెన్నై సినీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. శివకాశికి చెందిన ఓ పారిశ్రామికవేత్త వద్ద రూ. 50లక్షల చెక్‌ మోసగింపు కేసులో దర్శకుడు చరణ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. షూటింగ్ స్పాట్ లోనే ఆయన్ను అరెస్టు చేయటంలో ఊహించని ఈ పరిణామానికి యూనిట్ మొత్తం షాక్ అయ్యింది.

    నెల్త్లెలో షూటింగ్ జరుగుతూండగా ఆయన్ను అరెస్టు చేశారు. కోవైకి చెందిన శరవణన్‌ అలియాస్‌ చరణ్‌ 'కాదల్‌ మన్నన్‌', 'పార్తేన్‌ రసిత్తేన్‌', 'జెమిని', 'వసూల్‌రాజా ఎంబీబీఎస్‌'.. లతో పాటు పలు సినిమాలకు దర్శకత్వం వహించారు.

    ప్రస్తుతం 'ఆయిరత్తిల్‌ ఇరువర్‌' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నెల్త్లెలో జరుగుతోంది. ఇదిలా ఉండగా శివకాశికి చెందిన పారిశ్రామికవేత్త వద్ద నుంచి రూ. 50లక్షలు అప్పు తీసుకున్నారు. దీనికి సంబంధించి చరణ్‌ ఆయనకు ఇచ్చిన చెక్‌ చెల్లలేదు. ఈ కేసు ఇటీవల శివకాశి కోర్టులో విచారణకు వచ్చింది. అయితే చరణ్‌ హాజరుకాకపోవడంతో.. శివకాశి పోలీసులు నెల్త్లెకి వెళ్లి చిత్రీకరణ స్పాట్‌లో చరణ్‌ను అరెస్టు చేశారు.

    ఇక 'ఆయిరత్తిల్‌ ఇరువర్‌' చిత్రం గురించి...

    గతంలో హిట్‌ అందించిన దర్శకుడితో మళ్లీ కలిసి పనిచేసేందుకు మన హీరోలు ఆసక్తి చూపించటం సహజమే. అందులోనూ నిలదొక్కుకునేందుకు ప్రయత్నించే హీరోలు ఈ జాబితాలో ముందు వరసలో ఉంటారు. ఈ క్రమంలో యువ నటుడు వినయ్‌ మరోసారి చరణ్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. 'ఉన్నాలే ఉన్నాలే', 'జయంకొండాన్‌', 'మోది విలైయాడు' తదితర చిత్రాలతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నా.. నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆయన.

    ఈ నేపథ్యంలో గతంలో 'మోది విలైయాడు'తో తనకు మంచి పేరు తెచ్చిన చరణ్‌ దర్శకత్వంలో మరోసారి నటించేందుకు సిద్ధమయ్యారు. 'ఆయిరత్తిల్‌ ఇరువర్‌' పేరుతో తెరకెక్కనున్న ఇందులో వినయ్‌ ద్విపాత్రల్లో నటించనున్నారు. ఆయనకు జంటగా ముంబయి మోడల్‌ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. చరణ్‌ ఆస్థాన సంగీత దర్శకుడు భరద్వాజ్‌ స్వరాలు సమకూర్చనున్నారు. నిర్మాత కూడా చరణ్‌ కావటం విశేషం. డిసెంబరులో సినిమాను ప్రేక్షకుల చెంతకు తీసుకొచ్చే యోచనలో ఉన్నారు.

    English summary
    Sivakasi police on Friday arrested Tamil film director Saran on Thursday in connection with a cheque fraud case. While the director was shooting for his Aaayirathil Iruvar, which has actor Vinay in the lead, at Tirunelveli, the Sivakasi town police armed with an arrest warrant took him in to custody early in the day. The film crew were shocked and the shooting was suspended.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X