twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్ భార్యపై భారం పడనివ్వం

    By Srikanya
    |

    చెన్నై: రజనీకాంత్ హీరోగా నటించిన ‘కొచ్చాడయాన్' చిత్రం నిర్మాణం కోసం ఎగ్జిమ్ బ్యాంకునుంచి తీసుకున్న 20కోట్ల రూపాయల రుణాన్ని మార్చినాటికి చెల్లిస్తామని చిత్ర నిర్మాతలు మంగళవారం స్పష్టం చేశారు. ఈ రుణాల రికవరీకి నోటీసులు జారీ అయ్యే నేపథ్వంలో ఈ మేరకు హామీ ఇచ్చారు. ఈ రుణానికి గ్యారంటర్‌గా వున్న రజనీకాంత్ భార్యపై ఎలాంటి భారం పడనివ్వమని మీడియా1 గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ సంస్థ తెలిపింది.

    22.21కోట్ల రూపాయలను చెల్లించాల్సిందిగా రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్‌కు ఎగ్జిమ్ బ్యాంక్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రుణాన్ని చెల్లించని కారణంగా లతా రజనీకాంత్‌కు చెందిన రెండెకరాల ఆస్తిని ఎగ్జిమ్ బ్యాంకు జప్తు చేసుకున్నట్లుగా కూడా కథనాలు వచ్చాయి. తమకు సహకరించాలన్న ఉద్దేశంతోనే ఈ రుణానికి లతా రజనీకాంత్ గ్యారంటర్‌గా వున్నారని సంస్థ డైరెక్టర్ తెలిపారు.

    వివరాల్లోకి వెళితే...

    Lata Rajinikanth won't be burdened

    తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సతీమణి లత పూచీకత్తుపై ఇచ్చిన కోట్లాది రూపాయల బకాయిలను వసూలు చేసుకునేందుకు ‘‘ఎగ్జిమ్‌'' ప్రైవేటు బ్యాంక్‌ నోటీసులు పంపింది. ‘కోచ్చడయాన్‌' చిత్రం కోసం మీడియా వన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగస్వామిగా ఉన్న లతా రజనీకాంత్‌... రూ.20 కోట్ల రుణానికి పూచీకత్తుగా ఉన్నారు. ప్రస్తుతం ఆ మొత్తం వడ్డీతో కలిపి రూ.22.21 కోట్లకు చేరింది.

    గడువు ముగిసినా బకాయిలు చెల్లించని కారణంగా ఆమె ఆస్తులు వేలం వేయనున్నట్లు ఎగ్జిమ్‌ బ్యాంక్‌ నోటీసులు పంపింది. ఈ మేరకు వేలం ప్రకటనను పత్రికలో కూడా ముద్రించింది. 60 రోజుల్లోపు తమ బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో కాంచీపురం జిల్లాలో ఉన్న రజనీ కుటుంబానికి చెందిన ఆస్తులను వేలం వేస్తామని బ్యాంక్‌ ప్రకటించింది.

    అయితే, పత్రికలో ప్రకటన వచ్చే వరకూ ఈ వ్యవహారం గురించి రజనీకాంత్‌కి కూడా తెలియదని సమాచారం. కాగా బ్యాంకుతో ఉన్న ఒప్పందం ప్రకారం వచ్చే మార్చి 31వ తేదీ వరకూ తమకు గడువు ఉందని మీడియా వన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ప్రకటించింది. ఈ బకాయిలను చెల్లించే విషయమై ఇటీవల బ్యాంకు అధికారులతో కూడా పలు దఫాలుగా చర్చించామని, ఇచ్చిన గడువులోపు తాము మొత్తం రుణం చెల్లిస్తామని సంస్థ ప్రకటించింది.

    English summary
    The Rs 20 crore loan taken from EXIM bank in connection with the production of Rajinikanth-starrer 'Kochadiyaan' will be paid by March next after notice was issued for its recovery and the actor's wife, who was the guarantor, will not be burdened, the film's producers said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X