twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేషనల్ అవార్డ్ లిరిసిస్ట్ నా ముత్తుకుమార్ ఇక లేరు

    By Bojja Kumar
    |

    చెన్నై: రెండు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న ప్రముఖ తమిళ లిరిసిస్ట్ నా.ముత్తుకుమార్ ఇక లేరు. కొంతకాలంగా జాండీస్, హై ఫీవర్ తో బాధ పడుతున్న ఆదివారం కన్నుమూసారు. 41 ఏళ్ల వయసున్న ముత్తు కుమార్ కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ముత్తుకుమార్ మరణంతో తమిళ సినీ పరిశ్రమ విషాద ఛాయలు అలుముకున్నాయి.

    Lyricist Na Muthukumar passes away

    తమిళ సినీ పరిశ్రమలో ఆయన్ను అంతా 'కవి ఇలవరసన్' అని పిలుస్తుంటారు. తంగమీనకల్ సినిమాలో రాసిన 'ఆనంద యాజై' అనే పాటుకు గాను ముత్తు కుమార్ తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. తర్వాత శైవం చిత్రంలో 'అఝగే అఝగే ఇతువమ్ అఝగే' అనే పాటకు గాను రెండో సారి జాతీయ అవార్డు అందుకున్నారు.

    తన కెరీక్లో 1500లకు పైగా పాటలను తమిళ సినిమాలకు రాసారు. ఒక గొప్ప గేయరచయితను కోల్పోయామనే విషాదంలో తమిళ సినీ పరిశ్రమ మునిపోయింది. ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Two-time national award-winning Tamil film lyricist Na Muthukumar passed away in Chennai on Sunday morning after a bout of jaundice. He was 41.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X