twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ తమిళ హీరోతో కలిసి చేస్తా : మహేష్ బాబు

    By Srikanya
    |

    చెన్నై: మహేష్ బాబు రీసెంట్ గా తన శ్రీమంతుడు చిత్రం తమిళ వెర్షన్ ప్రమోషన్ నిమిత్తం వెళ్లారు. అక్కడ ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియా వారు అతన్ని కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది. తమిళంలోనే వాటికి సమాధానం ఇచ్చిన మహేష్ అక్కడ వార్తల్లో వ్యక్తి అయ్యారు. దానికి కారణం తనకు తమిళంలో అత్యంత ఇష్టమైన హీరో గురించి చెప్పటమే. అంతే కాక..తను ఎవరితో కలిసి చేయటానికి ఇష్టపుడుతున్నారో చెప్పటమే.

    మహేష్ ని... మీ ఫేవెరెట్ తమిళ హీరో ఎవరూ అని అడిగితే..మొదట విజయ్ సార్, అజిత్ సార్, సూర్య సార్ అన్నాడు. ఆ సమాధానానికి ముచ్చట పడ్డ మీడియావారు వెంటనే ఈ ముగ్గరు హీరోల్లో ఎవరితో మీరు స్క్రీన్ స్పేస్ ని పంచుకోవటానికి ఇష్టపడతారు..ఇద్దరు హీరోల చిత్రంలో అన్నారు. దానికి వెంటనే తడుముకోకుండా మహేష్..ఇంకెవరు విజయ్ అన్నారు. విజయ్ తో ఎందుకంటే అతనితో కలిసి పనిచేయటం చాలా కంఫర్ట్ గా ఫీలవుతాను..అతన్ని చాలా సార్లు కలిసాను అన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    మహేష్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు' చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లి. పతాకంపై నవీన్ ఎర్నేని రూపొందించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతూ తొలిరోజే 30 కోట్ల రూపాయల షేర్‌ను సాధించిందని నిర్మాత తెలిపారు.

    దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, అన్ని చోట్లా సినిమా పెద్ద హిట్ అయిందని, మొదటిరోజునుండి అన్ని వర్గాల ప్రేక్షకుల వౌత్‌టాక్‌తోనే అనుకున్నదానికన్నా హిట్ అయిందని తెలిపారు. ఇటువంటి చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్న కధానాయకుడి కష్టమంతా ఈ చిత్రంలో కన్పిస్తుందని, చిత్ర విజయం గూర్చి విన్న తరువాత తాము పడ్డ కష్టం మర్చిపోయామని ఆయన అన్నారు.

    Mahesh Babu's Wish To Share Screen Space With Ilayathalapathy Vijay

    ప్రేక్షకులనుండి తమ సంస్థ నిర్మించిన తొలి చిత్రానికి మంచి టాక్ రావడం ఆనందంగా ఉందని, అన్ని కేంద్రాల్లో మంచి రిపోర్టులు వస్తున్నాయని, భారతదేశంలోనే కాక యుఎస్‌ఎ, ఓవర్‌సీస్‌లో విజయఢంకా మ్రోగిస్తోందని ఆయన తెలిపారు.

    మరో ప్రక్క ఈ సినిమాకు మంచి ప్రశంసలు వస్తున్నాయని, జీవితంలో ఈరోజు చాలా సంతోషకరమైందంటూ మహేష్‌ బాబు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

    మహేష్ మాట్లాడుతూ...గత చిత్రాల ఫలితాల ప్రభావం తదుపరి సినిమాలపై తప్పకుండా ఉంటుంది. పరాజయాల తర్వాత వస్తోన్న సినిమా హిట్ కావాలని ప్రతి హీరో కోరుకుంటాడు. కానీ శ్రీమంతుడు సినిమా ఫలితం విషయంలో మాత్రం నాకు ఆ భయాలన్ని తొలగిపోయాయి. ఊరిని దత్తత తీసుకోవడం అనే యూనివర్సల్ పాయింట్ విజయంపై నా నమ్మకాన్ని పెంచింది. బలమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలోని భావోద్వేగాలు అందరిని మెప్పిస్తాయనే నమ్మకముంది అన్నారు హీరో మహేష్‌బాబు.

    దర్శకుడు మాట్లాడుతూ ''మహేష్‌బాబు పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు ఆకట్టుకొంటాయి. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో మహేష్‌ చాలా సింపుల్‌గా కనిపిస్తారు. కానీ స్త్టెలిష్‌గా ఉంటారు. శ్రుతిహాసన్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, సుకన్య... ఇలా ప్రతిపాత్రా కీలకమైనదే. సంభాషణలూ కథకి తగ్గట్టే వినిపిస్తాయి. అవసరాన్ని మించి పంచ్‌ సంభాషణలుండవు'' అన్నారు.

    జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి,

    కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

    English summary
    When asked who Mahesh Babu ..whom would he choose to work with? "Vijay, because I would feel comfortable working with him as I've met him a couple of times", pat came the reply from Mahesh Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X