twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిషేధించాలంటూ రజనీ వేసిన కేసు ఇంకా తెగలేదు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తన అనుమతి లేకుండా తన పేరును వాడుకుంటున్నారని, తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ‘మై హూ రజనీకాంత్' అంటూ హిందీ సినిమాకు టైటిల్ పెట్టిన నేపథ్యంలో రజనీకాంత్ హై కోర్టు కెక్కారు. ఈ చిత్రం ‘మై హూ రజనీకాంత్' విడుదలపై నిషేధం విధించాలంటూ నటుడు రజనీకాంత్ చెన్నై హైకోర్టులో వేసిన పిటీషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసును ఇంతకు ముందు విచారించిన న్యాయ స్థానం మైహూ రజనీకాంత్ చిత్రం విడుదల పై తాత్కాలిక స్టే ను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ ముకుల్ చంద్ బోద్రా తనను ప్రతివాదిగా చేర్చాలని పిటీషన్ దాఖలు చేశారు.

    'Main Hoon Rajinikanth' case updates

    ఈ కేసును విచారించిన న్యాయమూర్తి సుబ్బయ్య రజనీకాంత్ తరపున బదులివ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసేలా ఉత్తర్వులిచ్చారు. ఈ కేసు గురువారం మళ్లీ విచారణకు వచ్చింది. రజనీకాంత్ తరపు న్యాయవాది కోర్టుకు హాజరై తన క్లైంట్‌ను కలిసే అవకాశం దొరకలేదు కాబట్టి రజనీకాంత్‌ను కలిసి ఆయన సమాధానం తీసుకుని పిటిషన్ దాఖలు చేయడానికి కొంచెం వ్యవధి కావాలని కోరారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

    ‘మై హూ రజనీకాంత్' ఫైజల్ సైఫ్ దర్శకత్వం వహించారు. సరోజ్ నిర్మిస్తున్నారు. ఆదిత్యయ మీనన్, కవితా రాధేశ్యామ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదొక కామెడీ చిత్రం. బప్పి లహరి, సాహిబని కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.

    English summary
    The case by Tamil Super Star Rajinikanth against the hindi film Main Hoon Rajinikanth adjourned.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X