» 

'మర్యాద రామన్న' తమిళ రీమేక్ టైటిల్, పూర్తి డిటేల్స్

Posted by:

చెన్నై : తెలుగులో ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన 'మర్యాద రామన్న'ను తమిళంలో హాస్య నటుడు సంతానంతో 'వల్లవనుక్కు పుల్లుక్కూడ ఆయుధం' పేరిట రూపొందించనున్నారు. 'వేటెక్కారన్‌', 'ఉత్తిమ పుత్తిరన్‌', 'ఉన్నాలే ఉన్నాలే'లలో హాస్యనటుడిగా కనిపించిన శ్రీనాథ్‌ దర్శకత్వం వహించనున్నాడు. మిగతా సాంకేతిక నిపుణుల ఎంపిక కొనసాగుతోంది.

ఇక ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరాలు సమకూర్చిన తొలి చిత్రం '3'. పూర్తి ఆడియో విడుదలకు ముందుగానే ప్రేక్షకుల చెంతకొచ్చిన 'వై దిస్‌ కొలవెరి..' పాట సంచలనం సృష్టించింది. ఆ గీతాన్ని ఆలపించిన ధనుష్‌తో పాటు అనిరుధ్‌ పేరు కూడా మార్మోగిపోయింది. మొదటి సినిమాతోనే మంచిపేరు తెచ్చుకున్న అనిరుధ్‌ ఆ తర్వాత ధనుష్‌ నిర్మించిన 'ఎదిర్‌నీచ్చల్‌'కి స్వరాలు సమకూర్చాడు. పాటలతో పాటు చిత్రం కూడా విజయం సాధించింది. తాజాగా సంతానం ప్రధానపాత్రధారిగా వస్తున్న ఈ సినిమాకి సంగీతం అందించే అవకాశం దక్కింది.

మర్యాద రామన్న చిత్రం కన్నడంలో రీమేకై ఆ మధ్యన విడుదలైంది. అయితే అక్కడ పెద్దగా ఆడలేదు. కోమల్ అనే ఆర్టిస్టు కన్నడ మర్యాద రామన్న లో సునీల్ పాత్రను చేసాడు. కీరవాణి సంగీతం అందించాడు. తెలుగు ఉన్నదున్నట్లుగా అనువదించారు. ఉపేంద్ర అక్కడ సైకిల్ వాయిస్ కి డబ్బింగ్ ఇచ్చారు. తెలుగులో రవితేజ చెప్పినట్లుగా చేసాడు. ముకేష్ రుషి..ఇక్కడ తెలుగులో నాగినీడు పాత్రను చేసాడు. నిషా అక్కడ హీరోయిన్ గా సలోని పాత్రను చేసింది.

Read more about: maryada ramanna, santhanam, sunil, మర్యాద రామన్న, సంతానం, సునీల్
English summary
Rajamouli's superhit film ‘Maryada Ramanna’ is going to Kollywood. The film is featuring Santhanam in lead, will now be tuned by ace music director Anirudh Ravichander. Srinath, popular comedian is directing the film on PVP cinemas banner. Film titled ‘Vallavanukku Pullum Aayudham’ which will go to regular shoot by this month end.

Telugu Photos

Go to : More Photos