Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
లారెన్స్ కి అనారోగ్యం...అందుకే లేటైంది
చెన్నై: దెయ్యం కథలతో వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకున్నారు దర్శకుడు రాఘవ లారెన్స్. 'ముని'.. ఆ తర్వాత వచ్చిన 'కాంచన' (ముని-2) లారెన్స్ ప్రతిభకు అద్దంపట్టాయి. మాస్ కమర్షియల్ చిత్రాలతోపాటు హర్రర్ సినిమాలతో కూడా ప్రేక్షకులకు ఆశ్చర్యం, హాస్యాన్ని కూడా కలుగజేస్తారని చాటారు. ఇప్పుడు మూడో కొనసాగింపును కూడా సిద్ధం చేశారు. ఇందులో తాప్సి, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులోనూ లారెన్స్ హీరోగా కనిపించనున్నారు. కోవై సరళ, శ్రీమాన్ నటిస్తున్నారు.
లారెన్స్ మాట్లాడుతూ.. ''రానున్న నాలుగో తేదీన క్లెమాక్స్ సన్నివేశాలను తెరకెక్కించనున్నాం. 20 రోజుల పాటు షూటింగ్ కొనసాగనుంది. దీంతో మొత్తం పూర్తవుతుంది. గ్రాఫిక్ సన్నివేశాలు జోడించడం కోసం మరో రెండు నెలల సమయం పడుతుంది. ఇటీవల అనారోగ్యం కారణంగా కొన్ని నెలల పాటు ట్రీట్ మెంట్ తీసుకోవడంతో సినిమా ఆలస్యమైంది. డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. 'కాంచన' మాదిరిగా ఇది కూడా ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంటుంది''అని వివరించారు.
చిత్రం గురించి హీరోయిన్ తాప్సీ మాట్లాడుతూ... నేను 'ముని 3'లో నటిస్తున్నా. అదీ.. హారర్ సినిమానే. నటిస్తున్నానన్న మాటేగానీ, ఈసినిమా విడుదలైనా నేను చూడను. ఎందుకంటే... నాకు అంత భయం'' అని చెబుతోంది.
''నిజ్జం.. దెయ్యాలున్నాయి. నేను చూడలేదు గానీ, నా స్నేహితుల అనుభవాలు వింటే నిజమే అనిపిస్తుంటుంది. కొంతమంది ఏ కారణం లేకుండా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తుంటారు. దాన్ని ఏమనాలి?? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కదా..? దైవ శక్తిని నమ్మినప్పుడూ దుష్ట శక్తినీ నమ్మాల్సిందే. అందుకే నేను ఈ తరహా సినిమాల్ని చూడ్డానికి ఇష్టపడను.
అర్థరాత్రి, ఇంట్లో ఎవరూ లేనప్పుడు, తలుపులన్నీ మూసేసి, టీవీలో హారర్ సినిమాల్ని చూడడంలో.. ఓ వింతైన అనుభవం దాగుంటుంది. భయపడుతూనే ఆ అనుభవాన్ని ఆస్వాదించడం ఓ సరదా అలవాటు. అందుకే హారర్ సినిమాల్ని చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. మీరూ దెయ్యాల సినిమాల్ని చూస్తుంటారా? అని తాప్సిని అడిగితే ఏం చెప్పిందంటే - ''అమ్మో.. హారర్ సినిమాలా? నాకు చాలా భయం. ఒకసారి ఓ సినిమా చూశానంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సినిమానే మళ్లీ మళ్లీ గుర్తొస్తుంది. అందుకే.. వాటి జోలికి అస్సలు వెళ్లను..'' అంటోంది. దెయ్యాల టాపిక్ అనేసరికి చాలా విషయాలే మాట్లాడింది.