twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నారా రోహిత్ చిత్రాన్ని హిందీలో మురగదాస్ రీమేక్

    By Srikanya
    |

    హైదరాబాద్: తెలుగులో నారా రోహిత్ హీరోగా శంకర అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీలో కు రీమేక్ అవుతోంది. ఆ రీమేక్ చేసే డైరక్టర్ ఎవరూ అంటారా మరెవరో కాదు...మురగదాస్. అదేంటి సినిమానే ఇంకా రిలీజ్ కాలేదు.. అప్పుడే రీమేక్ రైట్స్ అమ్ముడయ్యాయా అనుకుంటున్నారా...అదేమి కాదు.. ఆల్రెడీ శంకర చిత్రమే...మౌనగురు అనే తమిళ చిత్రం రీమేక్.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇప్పుడు మౌనగురు చిత్రానికి కొద్ది పాటి మార్పులతో మురగదాస్ హిందీకు తీసుకువెళ్తున్నారు. మార్చినుంచి షూటింగ్ కు వెళ్లనుంది. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఆర్.డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కొంచెం క్లాస్ టచ్ తో ఉండే ఆ చిత్రాన్ని పూర్తి మాస్ ఓరియెంటెడ్ యాక్షన్ చిత్రంగా మురగదాస్ మార్చినట్లు తెలుస్తోంది.

    Murugadoss to remake Tamil film in Bollywood

    శంకర విషయానికి వస్తే...

    భీమిలీ కబడ్డి జట్టు దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నారా రోహిత్ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'శంకర' అనే పేరుని ఖరారు చేశారు. ఆర్‌.వి.చంద్రమౌళి ప్రసాద్‌ (కిన్ను) నిర్మాత. కె.ఎస్‌.రామారావు సమర్పకులు. శ్రీలీలా మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రెజీనా హీరోయిన్.

    దర్శకుడు తాతినేని సత్యప్రకాష్‌ మాట్లాడుతూ ''ఉత్కంఠను కలిగించే ప్రేమ కథతో దీన్ని తీర్చిదిద్దుతున్నాం. ఇందులో పైట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. కథకు తగ్గ పేరు కావడంతో 'శంకర' అని నిర్ణయించాం. అటు యువతనీ, ఇటు మాస్‌నీ సమంగా అలరిస్తుంది''అన్నారు.

    ఈ సినిమా మంచి విజయాన్ని సాదిస్తుందని నారా రోహిత్ తెలియజేశాడు. ఈ సినిమాలో నారా రోహిత్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రెజినా హిరోయిన్ గా నటిస్తోంది. తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

    నారా రోహిత్ చక్కటి క్రమశిక్షణ కలిగిన నటుడు. శంకర చిత్రంలో ఆయన నటన చూస్తే బాలీవుడ్‌లో అమితాబ్‌బచ్చన్ మాదిరిగా తెలుగు పరిశ్రమకు యాంగ్రీహీరో దొరికాడనిపించింది. భవిష్యత్తులో ఆయన పెద్ద హీరోగా ఎదుగుతాడు అన్నారు కె.ఎస్.రామారావు. ఆయన సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది.

    నిర్మాత మాట్లాడుతూ... తమిళచిత్రం మౌనగురు హక్కుల్ని తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించాం. టైటిల్‌కు తగినట్టుగా నారా రోహిత్ పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్ కనబర్చాడు. కె.యస్.రామారావుగారి సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మించాను అన్నారు.

    కథ నచ్చి సినిమా చేశానని, కొత్తదనాన్ని స్వాగతించే ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చుతుందని నారా రోహిత్ తెలిపారు. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు సాయికార్తీక్ అన్నారు.

    ఆహుతిప్రసాద్‌, జాన్‌ విజయ్‌, రాజీవ్‌ కనకాల, చిన్నా, రాఖీ, సత్యకృష్ణన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కళ: సాహి సురేష్‌, సంగీతం: సాయికార్తీక్‌, ఛాయాగ్రహణం: సురేందర్‌రెడ్డి.

    English summary
    Murugadoss is all set to remake a Tamil film Mounaguru in Bollywood. Sonakshi Sinha will be the heroine in the film for which Anirudh will be scoring music. RD.Rajasekhar is the cinematographer for the film whose regular shooting will start from March.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X