twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ అనుకుంటే నాగ్ సీన్ లోకి వచ్చాడేంటి?

    By Srikanya
    |

    చెన్నై: 'రన్‌', 'పయ్యా', 'వేట్టె'.. వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న దర్శకుడు లింగుస్వామి. ఆయన, మహేష్ కాంబినేషన్ లో చిత్రం ఉండే అవకాసం ఉందంటూ చాలా కాలంగా వార్తలు వినపడుతున్నాయి. రీసెంట్ గా మహేష్ కు మరో కథ వినిపించాడని కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన నాగార్జునతో చిత్రం చేయనున్నాడని సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

    ప్రస్తుతం సూర్య హీరోగా లింగుస్వామి దర్శకత్వం వహించిన 'అంజాన్‌'(సికిందర్) తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలుగు, తమిళంలో నటించేందుకు తన వద్ద మంచి స్క్రిప్టు ఉందని నాగార్జునకు చెప్పారు లింగుస్వామి.

    Nagarjuna wants to work with Lingusamy

    ఇప్పుడా విషయం సినిమాగా కార్యరూపంలోకి రానుందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. నాగార్జున హీరోగా కొత్త సినిమా పట్టాలెక్కినట్లు సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున సైతం మనం చిత్రం తర్వాత కొత్త ప్రాజెక్టులు ఏమీ ఒప్పుకోలేదు. లింగు స్వామి చెప్పిన కథ ఆసక్తికరంగా ఉండటంతో తన బ్యానర్ పైనే నిర్మించటానికి ముందుకు వస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

    నాగార్జున మాట్లాడుతూ... " నేను లింగు స్వామి సినిమాలకు పెద్ద ప్యాన్ ని. నేను వేట చిత్రం ఇష్టపడి తడాఖా గా రీమేక్ చేసాను. నాతో ఒక సినిమా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ." అన్నారు.

    ఇక లింగు స్వామి ...తన తిరుపతి బ్రదర్స్‌ బ్యానరుపై పలు చిత్రాలను రూపొందిస్తూ నిర్మాతగా కూడా ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇటీవల పలు చిత్రాలను కూడా కొనుగోలు చేసి విడుదల చేస్తున్నారు. అయితే ఆయనకు తెలుగులో సినిమా చేయాలని చాలా కాలం నుంచీ ఉంది. ఆయన డైరక్ట్ చేసిన తమిళ సినిమాలు డబ్బింగై ఇక్కడ రన్, పందెం కోడి, ఆవారా టైటిల్స్ తో మంచి విజయం సాధించాయి. మహేష్ తో సినిమా అనుకుంటున్నా అది కార్యరూపం మాత్రం దాల్చటం లేదు.

    English summary
    Nagarjuna showered rich praise of the film's director Lingusamy and even went on to express his desire to work with him saying, "I am a big fan of Lingusamy's films. I loved Veta which was remade in Telugu as Thadakha. I want request him to make a Telugu film with me sometime." An elated Ligusamy was only too happy to do so. "It would be an honour to work with you," said Ligusamy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X