twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నయనతార 'నైట్ షో' కి సిద్దంకండి

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఈ మధ్యకాలంలో నయనతార వరసగా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్యన శేఖర్ కమ్ముల తో కలిసి కహాని రీమేక్ లో చేసిన ఆమె ఇప్పుడు ఓ తమిళ హర్రర్ చిత్రం కమిటైంది. ఈ చిత్రాన్ని అశ్విన్ శరవణ్ అనే దర్శకుడు డైరక్ట్ చేస్తున్నారు. నైట్ షో అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది ఓ లో బడ్జెట్ చిత్రం కావటంతో లో ప్రొపైల్ నటి కోసం వెతికారు. ఈ లోగా ఈ స్క్రిప్టు గురించి తెలుసుకున్న నయనతార, పిలిచి విని చేస్తానని చెప్పటంతో వారి ఆనందానికి అంతేలేదు. స్క్ర్రిప్టు బాగా నచ్చటంతో ఆమె ఇష్టపడి చేస్తోందని చెప్తున్నారు.

    ఆ మధ్య పెళ్లి చేసుకుంటున్నానంటూ సినిమాలకు బై చెప్పేసిన నయనతార మళ్లీ ఊహించని విధంగా సీన్ లోకి వచ్చి బిజీ అయ్యింది. బిజీ అవ్వటమే కాక వరస హిట్స్ కొడుతోంది. తమిళంలో 'రాజా రాణి', 'ఆరంభం' సినిమాలతో వరుస విజయాలు అందుకొంది నయన్‌. తెలుగులో 'అనామిక'తో పాటు గోపీచంద్‌తో ఓ చిత్రం చేస్తోంది. ఈ నేఫద్యంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాక పట్టిందల్లా బంగారమే అన్నట్టుంది అని చెప్తోంది.

     Nayanthara roped in for Tamil horror film

    సెకండ్ ఇన్నింగ్స్ గురించి నయనతార మాట్లాడుతూ... ''చిత్ర పరిశ్రమకి నేనెప్పుడూ దూరం కాలేదు. అందుకే కెరీర్‌ని మళ్లీ కొత్తగా ప్రారంభించానని నాకెప్పుడూ అనిపించలేదు. అందరూ అంటున్నారు కాబట్టి నేను కూడా రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాననే చెబుతున్నాను. నాపై ప్రేక్షకులు ఎప్పట్లాగే ఆదరణ చూపిస్తుండడం మాటల్లో చెప్పలేనంత అనుభూతినిస్తోంది. దర్శకులకు కూడా నాపై మరింత నమ్మకం పెరిగిందేమో మరి. అందరూ ప్రాధాన్యమున్న పాత్రలను అప్పజెబుతున్నారు. ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?'' అని చెప్పుకొచ్చింది.

    అలాగే... ''తొలినాళ్లల్లో చేతికొచ్చిన పాత్రలు చేస్తూ వెళ్లాను. వాటిలో ఏ పాత్ర ఎంత సంతృప్తినిచ్చిందంటే ఇప్పుడేమీ చెప్పలేను. అయితే కొంతకాలంగా మాత్రం అన్నీ మనసుకు నచ్చే పాత్రలే నా దగ్గరికి వస్తున్నాయి. వాటికోసం వెచ్చించే ప్రతీ క్షణం ఓ అపురూపం అనిపిస్తోంది''అంటోంది నయనతార. ఇక నయనతార ఇప్పుడు మరింత గ్లామర్‌తో కూడిన పాత్రల్ని కోరుకుంటోంది. ''కొంచెం బరువైన పాత్రల్ని పోషించానేమో అనిపిస్తోంది. అందుకే ఇప్పుడు అందం కొట్టొచ్చినట్టు కనిపించే పాత్రలు చేయాలనిపిస్తోంది'' అని చెప్పుకొచ్చింది నయన్‌.

    ''నిజం చెప్పాలంటే రెండో ఇన్నింగ్స్ లో ఇంతటి ఆదరణ నేను కూడా వూహించలేదు. చిత్ర పరిశ్రమ నన్నూ, నా పరిస్థితినీ అర్థం చేసుకొంది. సినిమాలకు స్వస్తి చెప్పినప్పుడు నా నిర్ణయాన్ని ఎంత గౌరవించారో, మళ్లీ రావాలి అనుకొన్నప్పుడు అంతగా ప్రోత్సహిస్తున్నారు. నా గురించి నేను ఆలోచించుకొనే తీరిక లేనంతగా షూటింగ్‌లతో మమేకమైపోయా. దర్శకుల నమ్మకాన్ని వమ్ము కానివ్వను'' అంది. అయితే నయనతార తన ఈ రీ ఎంట్రీ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కెరీర్ కి,పర్శనల్ లైప్ కి ముడి పెట్టకుండా కొనసాగాలని భావిస్తోంది.

    English summary
    Nayanthara will be playing the lead in a Tamil horror film that will be directed by newcomer Ashwin Saravanan. The film, tentatively titled Night Show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X