twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నెట్ లో త్రిషపై విమర్శల వర్షం, ఆరోపణలు

    By Srikanya
    |

    చెన్నై : మూగ జీవాలను సమర్దిస్తూ ఓ ఎమ్మల్యేని ఉద్దేశిస్తూ త్రిష చేసిన ట్వీట్ మీడియాలో ఓ రేంజిలో హైలెట్ అయిన సంగతి తెలిసిందే. కొందరు ఆమెకు మూగ జీవాల పట్ల ఉన్న అభిమానానికి అభినందిస్తూంటే మరో ప్రక్క ఆమెపై విమర్శలు గుప్పు మంటున్నాయి. ముఖ్యంగా తమిళనాడు నుంచి ఎక్కువ విమర్శలు వస్తున్నాయి.

    ఆ విమర్శల్లో ఎక్కువగా... గుర్రం కాలికి తగిలిన దెబ్బలపైనే స్పందించిన త్రిష... కులమతాల పేరుతో జరుగుతున్న హత్యలపై గొంతెత్తడం లేదు అంటున్నారు. అలాగే ఆమె.. ఆ మధ్య జల్లికట్టు నిషేధం పై త్రిష నోరు మెదపలేదేం అంటూ ప్రశ్నిస్తున్నారు. అంటే ఆమెకు జంతువలే ముఖ్యం కానీ మనుష్యులు కాదన్నమాట అంటున్నారు.

    Also Read: గుర్రం కాళ్లు విరగ్గొట్టిన ఎమ్మెల్యే: సినీ తార త్రిష పైర్

    ఇంకొదరైతే మరొక అడుగు ముందుకు వేసి... ఇలాంటి ట్వీట్ల వల్ల త్రిషకు మూగ జీవాల సంరక్షణ సంస్థ పెటా నుంచి మంచి ఆదాయం అందుతోందని ఆరోపించారు. ఈ విషయమై చెన్నై సుందరి ఇప్పటివరకూ నోరు మెదపలేదు. ఆమె ఈ ఆరోపణలకు ఎలా బదులిస్తుందో అని నెటిజన్లు ఎదురుచూస్తున్నారు.

    Netizens angry on Trisha's tweet

    అసలు విషయమేమిటంటే.. మూగ ప్రాణుల సంరక్షణ సంస్థ పేటాకు త్రిష గత కొంత కాలంగా ప్రచారకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏ మూగ జీవి బాధింపునకు గురైనా వెంటనే ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంటారు.

    అదే విధంగా ఇటీవల ఉత్తరాఖండ్‌లో రాజకీయ వాదుల గొడవల్లో ఒక గుర్రం తీవ్రంగా గాయపడింది.కాంగ్రెస్ పాలిత ప్రాంతమైన ఆ రాష్ట్రంలో బీజేపీ పార్టీ శాసన సభ్యుడు ముసోరి గణేశ్ జోషీ నేతృత్వంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. దాన్ని అడ్డుకున్న పోలీసులు గుర్రాలపై వచ్చారు. కోపంతో బీజేపీ శాసన సభ్యుడు ముసోరి గణేశ్ జోషి పోలీసు నుంచి లాఠి లాక్కుని గుర్రాన్ని చితక బాదారు.

    Also Read: రానాతో లవ్ ఎఫైర్ గురించి త్రిష వివరణ

    ఆ సంఘటన కు సంభందించిన పూర్తి దృశ్యాలు మీడియాలో హల్‌చల్ చేశాయి. అవి చూసిన నటి త్రిష ట్విట్టర్ లో తీవ్రంగా స్పందించారు. గుర్రాన్ని రక్తం కళ్ల చూసిన ఆ శాసన సభ్యుడిని ఉద్దేశిస్తూ మిమ్మల్ని నరకంలో కాల్చాలి అని పేర్కొంది. అదీ విషయం.

    English summary
    Trisha has now courted some controversy for the tweet that she put out on BJP Mla.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X