twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళితో కాదు...నెక్ట్స్ మురుగదాస్‌ తో ఖరారు ..!

    By Srikanya
    |

    చెన్నై : రజనీకాంత్ తదుపరి చిత్రం ఏం చెయ్యబోతున్నారు అనేది ఎప్పుడు ఆసక్తి కరమైన విషయమే. దానికి తోడు 'లింగ' చిత్రం తర్వాత సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించబోయే చిత్రానికి సంబంధించి ఇప్పటికే రోజుకొకటి చొప్పున పలు వార్తలు వచ్చాయి. తదుపరి ఆయన 'రోబో' రెండో భాగంలో శంకర్‌ దర్శకత్వంలో నటించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా మళ్లీ కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో నటించనున్నారని, లేదంటే రాజమౌళి దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    కానీ ఇప్పుడు రజనీ సినిమాకు ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించనున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. ఇటీవల మురుగదాస్‌ ద్విపాత్రాభినయ చిత్ర కథను రజనీకాంత్‌కు వినిపించినట్లు సమాచారం. ఆ కథ నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నారట రజనీ. త్వరలో అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉందని కోడంబాక్కం వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించనున్నారు.

    ఇదిలా ఉండగా 'లింగ' కేసుల పరంపర కొనసాగుతోంది.

    Not with Rajamouli it's with Director Murugadas

    రీసెంట్ గా 'లింగ' నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌, నటుడు రజనీకాంత్‌పై క్రిమినల్‌కేసు నమోదు చేసేలా పోలీసు కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. ఈ సినిమా వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.21 కోట్లు గండి పడిందని అందులో ఆరోపించారు.

    మానినా పిక్చర్స్‌ మేనేజింగ్‌ పార్ట్నర్‌ ఆర్‌.సింగారవడివేలన్‌ ఈ వ్యాజ్యం వేశారు. తమిళం, తమిళాషాభివృద్ధి సంబంధిత శీర్షికలకు మాత్రమే వినోదపు పన్ను మినహాయింపు ఉందని గుర్తుచేశారు. 'లింగ' సంస్కృత పదమని పేర్కొన్నారు. రజనీకాంత్‌ పలుకుబడితోనే పన్ను మినహాయింపు ఇచ్చారని ఆరోపించారు.

    దీనిపై ఈనెల మూడో తేదీన కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులపై క్రిమినల్‌ కేసు దాఖలు చేసేందుకు కమిషనర్‌ను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చే అవకాశముంది.

    ఇక ... ఓ భారీ చిత్రం ఫెయిల్యూర్ అనేక తలనొప్పులను తీసుకు వస్తుంది. రీసెంట్ గా ...సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగ' సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా వల్లా డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది నష్టపోయారు. తమకు నష్టపరిహారం ఇవ్వమని వారు చాలా కాలంగా కోరుతున్నారు. ఈ మేరకు నిర్మాతతో చర్చలు సైతం జరిగాయి..జరగుతున్నాయి.

    కానీ ఈ చర్చల్లో చివరగా నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తాను 10% మాత్రమే వెనక్కి ఇస్తానని చెప్పడంతో వారు మళ్ళీ ఎదురు దాడికి దిగారు. అందుకే ఆ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి సరికొత్తగా వారి నిరసనలు తెలియజేయడానికి నిర్ణయించుకున్నారు. అందుకే వీళ్ళందరూ రజినీకాంత్ ఇంటివద్ద, లింగా థియేటర్స్ ముందు బిక్షం ఎత్తుకోవాలని నిర్ణయించుకున్నారు.

    వారంతా సమావేశమయ్యి... ఇక నుంచి రజినీకాంత్ ఇంటి ముందు బిక్షాటన చేయాలని, అలాగే ఏ ఏ థియేటర్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేసారో అక్కడ రోజు అడుక్కోవాలని వారు నిర్ణయించుకున్నారు.

    అంతే కాకుండా ప్రతి సినిమా థియేటర్లో ఒక బిక్షం ఎత్తుకునే ఒక బౌల్ పెట్టి అందులో థియేటర్ కి వచ్చే ఆడియన్స్ వీలైనంత దానం చెయ్యాలని కోరటం. వాళ్ళు ఇచ్చే డబ్బు మా రికవరీకి కొంతైనా హెల్ప్ అవుతుందని వారు అంటున్నారు. మరి డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్న ఈ నిర్ణయానికి నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

    English summary
    AR Murugadoss is likely to team up with superstar Rajinikanth for a yet-untitled Tamil project, which will be produced by Aascar Ravichandran. The project is expected to go on the floors by the year end.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X