twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్లాక్ మనీ ఉందా..అందుకే మోడీని విమర్శిస్తున్నావ్? స్టార్ హీరోపై కామెంట్స్

    By Srikanya
    |

    చెన్నై: బ్యాంకులు కాలం తీరిపోయిన 500, 1000 రూపాలయల నోట్లను తీసుకొని కొత్త నోట్లను ఇవ్వడం ప్రారంభించిన నేపధ్యంలో... సినీ సెలబ్రెటీలు ఇప్పటికే చాలా పాజిటివ్ గా స్పందించారు. అయితే సామాన్యులు ఎటిఎం ల వద్ద, బ్యాంక్ ల వద్ద పడుతున్న ఇబ్బందులు చూసి తమిళ హీరో విజయ్ మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది అంటూ ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు చేసారు.

    అయితే ఈ విషయమై విజయ్ ని తమిళనాడు బిజేపి స్పోక్స్ పర్శన్ వనితి శ్రీనివాసన్ విజయ్ పై విమర్శలు గుప్పించారు. ఆయన సామాన్యులు ఇబ్బదులు పడటం చూడలేకపోతే, ఆయన సంపాదించుకున్న డబ్బుతో సాయిం చేయవచ్చు కదా అన్నారు.

    మరో ప్రక్క విజయ్ దగ్గర ఎక్కువ నల్లధనం ఉంది కాబట్టే , ఇలా మాట్లాడాడు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఫ్యాన్స్ ఊరుకుంటారా..వారు ఇమ్మీడియట్ గా రంగంలోకి దిగి తమ అభిమాన హీరోపై ఈగ వాలనీయకుండా చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు. మా హీరోనే విమర్శిస్తావా అంటూ ఆమెపై మండిపడుతున్నారు.

     A Popular Politician criticises Hero Vijay

    ఇంతకీ విజయ్ ఏమాట్లాడాడు అంటే..

    విజయ్ మాట్లాడుతూ... ఇరవై శాతంమంది కారణంగా మిగతా 80శాతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మీడియా ఆయనను ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ప్రజలు నేడు ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.

    అలాగే విజయ్ కంటిన్యూ చేస్తూ... 'సాధారణ పౌరులే సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. 20శాతం మంది కారణంగా 80శాతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు' అంటూ విజయ్ అన్నారు.

     A Popular Politician criticises Hero Vijay

    మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేక చాలా మంది బాధపడుతున్నారని అన్నాడు. డబ్బు మార్చుకోలేక తన మనవరాలి పెళ్లి జరగకపోవడంతో ఓ వృద్ధుడు మరణించిన ఘటన తనను ఎంతో బాధించిందని చెప్పాడు.

    కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని చెప్పాడు. మన దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ఈ నిర్ణయం మార్చి వేస్తుందని... ఇలాంటి నిర్ణయం చాలా అవసరమని, ఎంతో ధైర్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని కితాబిచ్చాడు.

    English summary
    Though the Theri actor has lauded PM Narendra Modi's bold move, the TN BJP Spokesperson Vanathi Srinivasan has come out with a strong criticism over Vijay's statement. Vanathi Srinivasan said that if Vijay dont want common people to suffer, he should come forward to help them with the money he earn.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X