twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీకు లవ్ లెటర్స్ ఇచ్చాననుకుంటున్నావా? హీరో కార్తీపై రాధిక ఫైర్

    తన భర్తపై నడిగర సంఘంలో వేటు వేయటంపై .. రాధిక శరత్‌కుమార్‌ ఖండించారు.ట్విట్టర్‌ వేదికగా రాధిక తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

    By Srikanya
    |

    చెన్నై: రెండు రోజుల క్రితం ...దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) సర్వసభ్య సమావేశంలో సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్‌, మాజీ ప్రధాన కార్యదర్శి రాధారవిలపై శాశ్వత వేటు పడిన సంగతి తెలిసిందే.

    ఈ చర్యను రాధిక శరత్‌కుమార్‌ ఖండించారు.ట్విట్టర్‌ వేదికగా రాధిక తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరసగా చేసిన ట్వీట్లలో హీరో కార్తికి, విశాల్ కు మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారని అని అన్నారామె. అలాగే హీరో కార్తికి ఛాలెంజ్ విసిరారు.

    రాధిక కార్తీని ఉద్దేసిస్తూ... నడిగర సంఘం ఎలక్షన్ అయ్యాక ..ఎక్కౌంట్స్ కు సంభందించిన ఏ పుస్తకాలు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. మరి నా భర్త శరత్ కుమార్..ఆ రోజు తాజ్ హోటల్ లో నాజర్ కు ఇచ్చనవి ఏమిటి. అవన్నీ వీడియో టేప్ చేసారు కదా. అంటే అవన్నీ ఏమన్నా నీకు ఇచ్చిన లవ్ లెటర్సా అనుకుంటున్నావా అని తీవ్ర స్దాయిలో మండిపడ్డారు.

    'నడిగర్‌ సంఘంలో నేను శాశ్వత సభ్యురాలిని. కనీసం నాకు సమాచారం కూడా ఇవ్వలేదు. కోరం లేకుండా ఏజీఎంను ఎలా నిర్వహిస్తారు. నిరూపించండి. సంఘంలో ఒకరిని తొలగించాలంటే 21 రోజుల నోటీస్‌ ఉండాలి. మీరు దాన్ని ఉల్లఘించారు.

    బుల్లి తెర నిర్మాతలు లిస్టెడ్‌ కంపెనీని నడపడం కుదురుతుందా? చెప్పండి. సర్వసభ్య సమావేశం వేదికను మార్చడానికి ఏ కమిషనర్‌ మీకు అనుమతి ఇచ్చారు. ఆ అనుమతి పత్రాన్ని నేను చూడాలి. ఇరు పార్టీల మధ్య చర్చ లేకుండా సంఘం మాజీ అధ్యక్షుడిని ఎలా తొలగిస్తారు. ఇది కోర్టు ధిక్కారం కిందకు రాదా?' అని రాధిక ప్రశ్నించారు.

    నటీనటుల సంఘం 63వ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం లయోలా కళాశాల ప్రాంగణంలో నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. కొన్ని కారణాల వల్ల సంఘం కార్యాల‌య‌ ప్రాంగణంలోనే నిర్వహించనున్నట్లు విశాల్‌ ప్రకటించారు.

    ఈ నేపథ్యంలో గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే లోపలకు అనుమతించారు. పాత నిర్వాహకుల మద్దతుదారులు పలువురు లోపలకు వెళ్లేందుకు యత్నించగా, ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ముదిరి ఘర్షణకు దారి తీసింది.

    English summary
    Radika Sarathkumar says Vishal and Karthi have no maturity to handle the sequence. She had thrown series of questions to Nadigar Sangam. Radika Sarathkumar had tweeted the following . “This subject is getting tedious, #NadigarSangam my questions in my press release , Case on temporary suspension cming tmrw, subjudice matter”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X