twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాత పరిచయాలతో విసిగిస్తున్నారు

    By Srikanya
    |

    చెన్నై : తన తాజా చిత్రం లింగ షూటింగ్ లో ఉన్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కు ఓ కొత్త సమస్య పట్టుకుంది. ఆయన్ను గతంలో ఆయనతో జంటగా నటించిన పలువురు హీరోయిన్లు ప్రస్తుతం మరోసారి ఆవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. వారికి ఏం సమాధానం చెప్పాలో అర్దం కాక ఆయన సతమతమవుతున్నట్లు యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

    కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'లింగ'లో రజనీకాంత్‌ నటిస్తున్నారు. ఈ సినిమా సన్నివేశాలను ఆంధ్ర, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు. చిత్రీకరణ జరుగుతున్న ప్రాంతాల్లో పలువురు సీనియర్‌ హీరోయిన్లు రజనీకాంత్‌ను కలిసి మళ్లీ ఆయనతో కలిసి నటించే అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారట. రజనీకాంత్‌తో 'బిల్లా' చిత్రంలో జంటగా నటించిన శ్రీప్రియ, 'యజమాన్‌', 'ముత్తు' తదితర చిత్రాల్లో జంటగా నటించిన మీనా కూడా ఆయన్ను ఇటీవల కలిసిన వారి జాబితాలో ఉన్నారు.

    Rajani's probelm with heroines

    'లింగ' విషయానికి వస్తే...

    రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానరుపై కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'లింగా'. ఇందులో సూపర్‌స్టార్‌ రజినికాంత్‌ హీరోగా నటిస్తున్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లు. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూర్చుతు న్నారు. ఈ సినిమా ఆడియోని అక్టోబర్ 23న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్రం యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

    ఇక ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలన్నీ తెరకెక్కించారు. ఇటీవల క్లెమాక్స్‌ సన్నివేశాలను కర్ణాటకలో తెరకెక్కించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా వినాయకచవితి సందర్భంగా 14 సెకన్ల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో రజనీకాంత్‌ నడిచిస్తున్నట్టుగా ఉన్న ఫొటో అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. రజినీ ఇందులో మరింత స్టెల్‌గా కనిపిస్తున్నారన్నది ఆయన అభిమానుల మాట.

    ఇదిలా ఉండగా పాటల చిత్రీకణ కోసం చిత్ర యూనిట్‌ త్వరలో ఐరోపా వెళ్లనుంది. అక్కడ మొత్తం రెండు పాటలను చిత్రీకరించనున్నారు. ఒకటి అనుష్క, రజినీకాంత్‌ కలయికలో కాగా.. మరోటి రజిని- సోనాక్షి జంటగా. ఇందుకోసం రజినీకాంత్‌, అనుష్క, సోనాక్షి, కేఎస్‌ రవికుమార్‌, కెమెరామెన్‌ రత్నవేల్‌ (రాండి) తదితర చిత్ర యూనిట్‌ ఐరోపా వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా పాటలను రజినీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 12వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం.

    దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కొన్నిటిని ఈ సినిమాలో చర్చించే అవకాసం ఉందని అంటున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి, మార్పు తేవాలి అనే అంశంతో కథనం నడుస్తుందని అంటున్నారు. 'లింగా' అనేది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర పేరు అని, అలాగే ప్రారంభం నుంచి యువకుడైన రజనీ పాత్ర ఉంటుందని అంటున్నారు. ఇద్దరికి ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారు. రజనీ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. విలన్ గా జగపతిబాబు పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో కీలకమై నిలుస్తుందని చెప్తున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. రజనీకాంత్‌ మనవడు (ధనుష్‌- ఐశ్వర్య కుమారుడు) పేరు కూడా లింగా కావడం గమనార్హం.

    English summary
    Rajani's old film's heroines met him and asking to work with again.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X