twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్...రోబో ‘2.0’..ఓ ఇంట్రస్టింగ్ న్యూస్

    By Srikanya
    |

    చెన్నై: భారీ బడ్జెట్ లో సినిమాలు తీసేటప్పుడు ఆ డబ్బుని వెనక్కి రాబట్టడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తూంటారు దర్శక,నిర్మాతలు. రెండు,మూడు పార్ట్ లు తీయడం, అలాగే త్రీడి, టుడీలలో సినిమాని తీయటం ఇలా జనాలని ఎట్రాక్ట్ చేయటానికి డబ్బు రాబట్టడానికి కొత్త కొత్త స్కీమ్స్ వేస్తారు. ఇప్పుడు రజనీకాంత్ తాజా చిత్రం రోబో సీక్వెల్ కు అదే పరిస్దితి ఏర్పడుతోంది.

    పూర్తి వివరాల్లోకి వెళితే..రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం '2.0'. తెలుగు,తమిళ భాషల్లో సూపర్ హిట్టైన 'రోబో'కు సీక్వెల్‌ ఇది. ఇటీవలే 150 రోజులు షూటింగ్‌ను పూర్తి చేసుకున్నట్లు శంకర్‌ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. రజనీకాంత్‌కు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలే మిగిలి ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం బడ్జెట్‌ రూ.350 కోట్ల వార్త లొస్తున్నాయి.

    Rajani's Robo-2 In 3D Format?

    ఆయుధపూజ అనంతరం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమాను ఏకకాలంలోనే త్రీడీలో కూడా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి భాగంలో లాగే అధిక సంఖ్యలో రోబోలు కనిపించే సన్నివేశాలు ఇందులోనూ ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. వాటికి సంబంధించిన సన్నివేశాలే ప్రస్తుతం తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

    సినిమా ఫస్ట్‌లుక్‌ను వచ్చే నెల 20న విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు. చెన్నైలో జనవరిలో భారీఎత్తున నిర్వహించే కార్యక్రమంలో టీజర్‌ను విడుదల చేయనున్నారు. అందుకోసం సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Rajani's Robo-2 movie will be shot using 2D and 3D cameras simultaneously. Around 200 Cr and more will be spent on making this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X