twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్‌కు వార్నింగ్.. హాజీ మస్తాన్ సినిమా తీస్తే ఖబడ్డార్.. లేఖ రాసిన..

    మాఫియా కార్యకలాపాలతో ముంబై మహానగరాన్ని గడగడలాడించిన హాజీ మస్తాన్ మీర్జా జీవిత కథ ఆధారంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ తన 161వ సినిమాను తీస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా గురించి తాజాగా ఆసక్తికరమైన

    By Rajababu
    |

    మాఫియా కార్యకలాపాలతో ముంబై మహానగరాన్ని గడగడలాడించిన హాజీ మస్తాన్ మీర్జా జీవిత కథ ఆధారంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ తన 161వ సినిమాను తీస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా గురించి తాజాగా ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. హాజీ మస్తాన్ బయోపిక్ వార్తల నేపథ్యంలో రజనీకాంత్‌ను మస్తాన్ వారసుడిగా చెప్పుకొనే వలార్‌పుమగన్ హెచ్చరించారనే విషయం కోలీవుడ్‌లో సంచలనం రేపుతున్నది.

    హాజిమస్తాన్ కుమారుడినని...

    హాజిమస్తాన్ కుమారుడినని...

    హాజీమస్తాన్ జీవిత కథను సినిమాగా తెరకెక్కించే విషయంపై గ్యాంగస్టర్ కుమారుడిగా చెప్పుకొనే వలార్‌పుమగన్ వార్నింగ్‌తో కూడిన లేఖను రజనీకాంత్‌కు పంపినట్టు తెలిసింది. హాజీ మస్తాన్ కుమారుడు వలార్‌పుమగన్ భారతీయ మైనారిటీస్ సురక్ష మహాసంఘ్ అనే సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. వాస్తవిక అంశాలకు దూరంగా చిత్రాన్ని నిర్మిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నా తండ్రి ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించవద్దు. నా తండ్రి వ్యక్తిత్వాన్ని కించపరిస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయి అని వలార్ పుమగన్ బెదిరించినట్టు సమాచారం.

    మీడియాకు చిక్కిన లేఖ

    మీడియాకు చిక్కిన లేఖ

    రజనీకాంత్‌కు పంపిన లేఖ ఓ మీడియా సంస్థకు చిక్కడంతో దానిని సదరు బాలీవుడ్ పత్రిక ఈ విషయాన్ని బయటపెట్టింది. ఆ లేఖలో ఉన్న సారాంశమేమిటంటే.. నా గాడ్‌ఫాదర్ శ్రీ హాజీ మస్తాన్ మిర్జా జీవిత కథ ఆధారంగా బయోపిక్‌ను దర్శకుడు రంజిత్ రూపొందిస్తున్నారనే విషయం మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. అందుచేత ఈ లేఖను మీకు రాస్తున్నాను. జాతీయ రాజకీయ నేత అయిన అయిన హాజీ మస్తాన్‌ను స్మగ్లర్‌గా, అండర్ వరల్డ్ డాన్‌గా తప్పుడు రీతిలో చిత్రీకరిస్తే సహించేది లేదు అని స్పష్టం చేసినట్టు సమాచారం.

    కావాలటే వివరాలు అందిస్తా..

    కావాలటే వివరాలు అందిస్తా..

    ఒకవేళ మీరు హాజీ మస్తాన్ జీవితం గురించి తెలుసుకోవాలంటే మీకు పూర్తి వివరాలు అందిస్తాను. అంతేకాని అవాస్తవ ఆధారాలతో తప్పుగా చిత్రీకరిస్తే మాత్రం సహించబోము అని హెచ్చరించినట్టు తెలిసింది. ఈ లేఖ వ్యవహారం మీడియాలో రావడంపై కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

    హాజీ మస్తాన్ కథ ఇదే..

    హాజీ మస్తాన్ కథ ఇదే..

    హాజీమస్తాన్ ముంబైలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్. స్మగ్లింగ్, సినిమాలకు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, హవాలా కార్యక్రమాలతో ముంబై మాఫియా సామ్రాజ్యాన్ని 1926 రెంయి 1994 వరకు ఏలిన చరిత్ర ఉంది. ఆ తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ మాఫియా సంబంధాలతో హాజీ మస్తాన్ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు.

    పేదరికం నుంచి విలాసవంతమైన జీవితం వైపు

    పేదరికం నుంచి విలాసవంతమైన జీవితం వైపు

    కడు పేదరికంలో పుట్టిన హాజీ మస్తాన్ విలాసవంతమైన జీవితాన్ని గడుపాలనే కోరిక చిన్నతనం నుంచే ఉందని చెప్తుంటారు. పేదరికం కారణంగా ఎదురైన ఆటుపోట్లతో ఎలాంటి పరిస్థితులైన ఎదురించే స్థాయికి వెళ్లాడనే పోలీసులు వెల్లడిస్తుంటారు. హాజీ మస్తాన్ బలమైన మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం వెనుక తమిళుడైన వరదరాజన్ ముదలియార్ హస్తం, మద్దతు ఉందని పేర్కొంటారు.

    రజనీకాంత్ తప్పా మరెవరూ..

    రజనీకాంత్ తప్పా మరెవరూ..

    భాషా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఇలాంటి ప్రభావవంతమైన కోణాలు ఉన్న మాఫియా గ్యాంగ్ లీడర్ పాత్రను సూపర్‌స్టార్ రజినీకాంత్ తప్పా మరెవరూ పోషించలేదనే భావన ఏర్పడింది. హాజీ మస్తాన్ ఆహార్యం రజనీ పక్కాగా సూట్ అవుతాయనే సినీ వర్గాల అభిప్రాయం. హాజీమస్తాన్ తెల్లటి లాల్చీ, షూస్ ధరించి మెర్సిడెజ్ బెంజ్ కారులో ప్రయాణించడం, ఖరీదైన సిగరెట్లు తాగడం లాంటి అంశాలతో కూడిన పాత్రను పోషించడం రజనీకాంత్‌కే సాధ్యమనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది.

    English summary
    Recently, several reports started doing the rounds which suggested that South superstar Rajinikanth is planing to make a biopic on Haji Mastan Mirza along with director Ranjit. While speculations about the said biopic were still floating around, they also reached Mastan's foster son Valarpumagan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X