twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కబాలి': అక్కడేమో ఏకంగా క్లైమాక్స్‌ మార్చేసారు..ఇక్కడేమో సూపర్ జోక్స్

    By Srikanya
    |

    చెన్నై: సినిమా రిలీజ్ అయ్యాక టాక్ ని బట్టి క్లైమాక్స్ లు మార్చటం చూస్తూంటాం. అలాగే కొన్ని సార్లు దర్శకుడుకే డౌట్ వచ్చినప్పుడు రెండు క్లైమాక్స్ లు రెడీ చేసి పెట్టుకుని, ఏది బాగుంటే అది పెడదామని ఫిక్స్ అవుతూండటం కూడా చూసాం. ఇప్పుడు ఏకంగా క్లైమాక్స్ ట్విస్ట్ నే మార్చేసారు. అదీ కబాలి సినిమాకు కావటం విశేషం.

    పూర్తి వివరాల్లోకి వెళితే... సినిమా రిలీజ్ కు ముందు 'కబాలి' సినిమా క్లైమాక్స్‌పై మీడియాలో అనేక ఊహాగానాలు, కథనాలు వచ్చాయి. 'కబాలి' సినిమాలో విషాదాంతం అంటే నెగిటివ్ ఎండింగ్ ఉంటుందని చెప్పకనే చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో క్లైమాక్స్‌లో 'కబాలి' చనిపోతాడా? అని రకరకాల ఓ రేంజిలో స్పెక్యులేషన్స్ జరిగాయి.

    ఈ విషయమై రజనీకాంత్ కుమార్తె, నిర్మాత ...ఇద్దరూ కూడా పట్టుబట్టారని చెప్పుకున్నారు. దాంతో దర్శకుడు పా రంజిత్ క్లైమాక్స్‌ విషయంలో ధైర్యం సరిగా చేయలేక ఓపెన్ ఎండ్ గా వదిలేసాడు. ఇదంతా ఇండియన్ స్క్రీన్స్ పై కనపడిన వ్యవహారం.

    కానీ మలేషియాలో వేరే విధంగా సినిమా ఎండింగ్ ఇచ్చారు. సినిమా అంతా మలేషియా నేపథ్యంగా, అక్కడ జరిగే గ్యాంగ్‌వార్ ప్రధాన కథగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మలేషియాలో ఈ సినిమా క్లైమాక్స్‌ను మార్చారు. క్లైమాక్స్‌లో 'కబాలి' పోలీసులకు లొంగిపోతాడని పేర్కొన్నారు.

    ఇందుకు కారణం...మలేషియా నేపథ్యంగా సినిమా తెరకెక్కడం, ఎక్కువశాతం షూటింగ్ అక్కడే జరిగిన నేపథ్యంలో స్థానికంగా వ్యతిరేకత రాకుండా.. చట్టాన్ని గౌరవించి 'కబాలి' పోలీసులకు లొంగిపోయినట్టు పేర్కొన్నారని భావిస్తున్నారు.

    ఇక రజనీకాంత్...అమెరికా నుంచి ఇండియా వచ్చేస్తున్నారు. ఆయన ఇప్పటికే బయిలు దేరి పోయారు. ఈ విషయమై ఇదిగో సోషల్ మీడియాలో ఇలా హంగామా మొదలయ్యింది. ఇండియా వచ్చాక రజనీ ఏం చేస్తారు..ఏం చెయ్యబోతున్నారు..

    మనకు క్లైమాక్స్ ఎలా ఇచ్చారు...అది ఎందుకు అలా చెయ్యాల్సి వచ్చిందనేది క్రింద చదవండి

    నో క్లారిటీ

    నో క్లారిటీ

    మనకు ఇండియాలో ఇక్కడ క్లైమాక్స్ అయ్యిపోయాక ఎండ్ షాట్ లో ....సీన్‌లో తుపాకీ పేలుడు శబ్దం వినిపించినా.. ఈ తూటాకి 'కబాలి' చనిపోయాడా? అన్న విషయాన్ని మాత్రం దర్శకుడు చూపించలేదు.

    అది మాత్రం నిజం

    అది మాత్రం నిజం

    కథ, కథనం విషయంలో తనదైన స్టైల్‌ను ఫాలో అయిన పా రంజిత్ క్లైమాక్స్‌ విషయంలో మాత్రం సాహసించలేకపోయాడనేది మాత్రం నిజం.

    అందుకే చేసాడు

    అందుకే చేసాడు

    రజనీ పాత్ర తెరపై చనిపోయినట్టు చూపించడం అంత ఈజీ కాదని దర్శకుడు గ్రహించబట్టే ఇలా చేసాడంటున్నారు.

    ఫ్యాన్స్ జీర్ణించుకోలేరనే...

    ఫ్యాన్స్ జీర్ణించుకోలేరనే...

    నిజంగా రజనీని చంపేసినట్లు చూపిస్తే అభిమానులు జీర్ణించుకోలేరు. అందుకే తుపాకీ శబ్దంతో, కొంత సస్పెన్స్‌తో 'కబాలి' క్లైమాక్స్‌ను ముగించాడు.

    సరిగ్గా అర్దం కాకుండా..

    సరిగ్గా అర్దం కాకుండా..

    దీంతో సినిమా నెటిగివ్ ఎండింగ్.. పాజిటివ్ ఎండింగా అనేది ప్రేక్షకుడికి సరిగ్గా అర్దంకాకుండా మిగిలిపోయింది.

    జోక్ 1

    జోక్ 1

    కబాలి పైరసీ పై ఓ జోక్.... 'కబాలి సినిమాను డౌన్‌లోడ్ చేసేందుకు ప్రయత్నించాను. వెంటనే టోరంటో అన్‌ఇన్‌స్టాల్ అయిపోయింది. సిస్టం ఫార్మెట్‌ అయిపోయింది. వై-ఫై క్రాష్ అయింది. సమీపంలో ఉన్న ఎయిర్‌టెల్ టవర్ మాయమైంది'

    జోక్ 2

    జోక్ 2

    కబాలిపై మరో జోక్... 'మీరు అక్రమంగా రజనీకాంత్ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేస్తే.. ఓ వైరస్ బయటకొచ్చి మీ చెంపఛెళ్లుమనిపిస్తుంది. మిమ్మల్ని వెంటనే పట్టుకెళ్లి రజనీ సినిమా నడుస్తున్న థియేటర్‌లో పడేస్తుంది'

    కబాలి జోక్ 3

    కబాలి జోక్ 3

    'అందరి సినిమాలు మొదట విడుదలై తర్వాత టోరంట్ లో లీకవ్వుతాయి. కానీ రజనీ సినిమా టోరంట్ లో లీకైన తర్వాతే షూటింగ్ మొదలవుతుంది'.

    ప్రకటన

    ప్రకటన

    'కబాలి' సినిమా తొలిరోజే రూ. 250 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి ఉంటుందని చిత్రనిర్మాతలు ఓ ప్రకటనలో తెలుపడం సంచలనం రేపుతోంది. '

    150 కోట్లు

    150 కోట్లు

    'కబాలి' తొలిరోజు ఒక్క తమిళనాడులోనే వందకోట్లు వసూలుచేసిందని, తమిళనాడు బయట దేశమొత్తంగా రూ. 150 కోట్లు వసూలుచేసిందని నిర్మాతలు ప్రకటించారు.

    కేవలం శాటిలైట్ ద్వారానే

    కేవలం శాటిలైట్ ద్వారానే

    ఈ వసూళ్ల ప్రకటన ఇలా వుంటే.. మరోవైపు'కబాలి' శాటిలైట్ హక్కుల ద్వారా రూ. 200 కోట్లు సాధించవచ్చునని మరో కథనం చెప్పుకొచ్చింది.

    ఇదే పెద్ద రికార్డ్

    ఇదే పెద్ద రికార్డ్

    ప్రపంచవ్యాప్తంగా 12వేల థియేటర్లలో విడుదలైన 'కబాలి' సినిమా గత కలెక్షన్ల రికార్డులన్నింటినీ బద్దలుకొట్టి తొలిరోజు భారీగా వసూళ్లు రాబట్టడం ప్రశంసల జల్లు కురుస్తోంది.

    అజయ్ దేవగన్ ఇలా

    అజయ్ దేవగన్ ఇలా

    'కబాలి' కలెక్షన్లు లెజెండ్ రజనీ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటాయని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్ దేవగణ్‌ కితాబిచ్చారు.

    సురేష్ రైనా ఇలా..

    సురేష్ రైనా ఇలా..

    గొప్ప సినిమా విడుదైన రోజే తొలి ఆట చూడడం అద్భుతమైన అనుభవమని, ఇది సంబరాలు చేసుకోవాల్సిన సమయమని టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా ట్వీట్ చేశాడు. '

    బ్రదర్ ఆఫ్ లింగా

    బ్రదర్ ఆఫ్ లింగా

    సినిమా గొప్పగా ఏంలేదని, 'కబాలి' తీవ్ర నిరాశకు గురిచేసిందని, డబ్బులు తిరిగిచ్చేయాలని కొందరు ప్రేక్షకుడు వాపోతున్నారు. ఇలాంటి చెత్త సినిమా తీసిన దర్శకుడు పా రంజిత్ ను క్షమించలేమంటూ ప్రేక్షకులు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'కబాలి'ని 'లింగా' సోదరుడిగా పోలుస్తున్నారు.

    English summary
    Rajnikanth fans in Malaysia who watched Kabali have reported that the climax of the film has been changed on screens in that country.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X