twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాధాకరమైన రేర్ వీడియో: జయలలితను దారుణంగా...వెహికల్ నుంచి క్రిందకు నెట్టేస్తున్నప్పుడు

    గతంలో ఎమ్.జీ ఆర్ మృతి చెందినప్పుడు జరిగిన ఓ సంఘటన కు సంభందించిన వీడియో ఒకటి మళ్లీ వెలుగులోకి వచ్చింది.

    By Srikanya
    |

    చెన్నై: జయలలిత ఇక సెలవంటూ తుది వీడ్కోలు తీసుకున్నారు. అశేష జనం కన్నీటివదనంతో ఆమె అంతిమయాత్రలో పాల్గొన్నారు. చెన్నై మెరీనా తీరంలో కడలి ఒడ్డున ఎంజీఆర్‌ సమాధి ఉన్న ప్రాంతంలో జయలలిత పార్థివదేహాన్ని ఖననం చేశారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేపట్టారు. ఆమె పార్థివదేహంపై కప్పిన త్రివర్ణ పతాకానికి త్రివిధ దళాలు గౌరవవందనం చేసి జాగ్రత్తగా తీసి జయ స్నేహితురాలు శశికళకు అందజేశాయి. ఆమె దాన్ని కన్నీటివదనంతో అందుకున్నారు. ఈ నేపధ్యంలో జయలలిత గతంలో ఎమ్.జీ ఆర్ మృతి చెందినప్పుడు జరిగిన ఓ సంఘటన కు సంభందించిన వీడియో ఒకటి మళ్లీ వెలుగులోకి వచ్చింది.

    తన రాజకీయ గురువు ఎంజీఆర్ మరణించినప్పుడు జయలలిత జీవితంలో అత్యంత విషాదకర సంఘటన చోటు చేసుకుంది.ఆయన పార్థివదేహాన్ని అంత్యక్రియలకు తరలించే క్రమంలో ఓ వాహనంలో తరలిస్తున్నారు. ఆ వాహనంలోకి ఎక్కేందుకు జయలలిత ప్రయత్నిస్తుండగా ఓ ఎమ్మెల్యే కేకలేస్తూ వచ్చి అడ్డుకున్నారు. ఇంతలో ఎంజీఆర్ భార్య తమ్ముడి కొడుకు, నటుడు దీపన్ జయను సమీపించి ఆమెను కొట్టాడు. జుట్టు పట్టుకుని ఈడ్చినంత పనిచేశాడు. ఆమెకు ఈ ఘటనలో గాయాలయ్యాయి. అందుకు సంభందించిన వీడియోని మీరు ఈ క్రింద చూడవచ్చు.

    ఎంజీఆర్ మరణవార్తను తన స్నేహితురాలి ద్వారా తెలుసుకున్న జయలలిత.. ఆయన పార్థివ దేహాన్ని చూడటం కోసం తొట్టంలోని ఆయన ఇంటికి బయలుదేరారు. అయితే అప్పటికే జయను ఇంట్లోకి రానివ్వకూడదని నిర్ణయించుకున్నారు.

    దీంతో ఇంటి వెనక పక్కనున్న గేటు నుంచి లోపలికి వెళ్లారు జయలలిత. అప్పటికీ ఆమెను లోపలికి రావడానికి అనుమతించలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఎంజీఆర్ పార్థివ దేహాన్ని రాజాజీ హాల్ కు అంబులెన్స్ లో తరలించడానికి సిద్దమయ్యారు. దీంతో అంబులెన్స్ ను ఫాలో అవాల్సిందిగా జయ తన కారుకు డ్రైవర్ కు చెప్పారు. అక్కడ దాదాపు 13గం.ల పాటు తన అభిమాన నేత పార్థివ దేహం వద్దనే కూర్చున్నారు జయలలిత.

    పార్థివ దేహాన్ని ఉంచిన మరుసటిరోజు.. పక్కనున్న మహిళలు తనను గోళ్లతో గిల్లడం, కాళ్లను తొక్కడం, చర్మంపై గుచ్చడం వంటి ఇబ్బందికర పరిణామాల్ని జయ ఎదుర్కొన్నారు. అయినా ఆమె మాత్రం పార్థివ దేహం పక్కనుంచి కదలలేదు. ఇక అక్కడినుంచి అంత్యక్రియల కోసం ఆయన పార్థివ దేహాన్ని తరలించడానికి సిద్దమైన తరుణంలో జయకు ఘోర అవమానం ఎదురైంది.

    ఎంజీఆర్ పార్థివదేహాన్ని తరలిస్తున్న వాహనంలో జయ ఎక్కడానికి ప్రయత్నించడంతో.. అక్కడే ఉన్న ఎమ్మెల్యే డాక్టర్.కె.పి.రామలింగం జయపై కేకలు వేస్తూ ఆమె మీదకు వచ్చాడు. ఇంతలోనే ఎంజీఆర్ భార్య జానకి తమ్ముడు కొడుకు, నటుడు దీపన్ జయను వద్దకు వచ్చి ముఖంపై దాడి చేశాడు. జుట్టు పట్టుకుని ఈడ్చినంత పనిచేసి వాహనం నుంచి కిందకి నెట్టేశాడు. దీంతో జయకు స్వల్ప గాయాలయ్యాయి.

    తమిళ ప్రజలు 'అమ్మ'గా ఆరాధించిన జయలలిత లోకాన్ని విడిచి వెళ్లినా ఆమె వదలి వెళ్లిన జ్ఞాపకాలు అజరామరం. ముఖ్యంగా సినీ జగత్తులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు జయలలిత. అలనాటి రోజుల్లో సినీ అభిమానులను తన అందం.. అభినయంతో మంత్రముగ్ధులను చేశారు.

    కేవలం నటిగానే కాకుండా నృత్య కళాకారిణిగా.. గాయనిగా ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎన్టీఆర్‌తో ఆమె నటించిన 'ఆలీబాబా 40 దొంగలు' చిత్రం అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ చిత్రంలో ఆమె స్వయంగా ఓ పాట పాడారు. బి.విఠలాచార్య దర్శకత్వం వహించగా, ఘంటసాల స్వరాలు సమకూర్చారు. 'చల్ల చల్లని వెన్నెలాయో..' అంటూ సాగే ఆ పాట ఇక్కడ మీకోసం..

    English summary
    When MGR had died in December 1987, left with few supporters, Jayalalithaa was humiliated by the coterie. She was even pushed off the van in-front of TV cameras.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X