Don't Miss!
- News Lok Sabha Election 2024 Polling LIVE Updates: అతిపెద్ద పండగకు తొలి ఘట్టం..
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘రెమో’ అఫీషియల్ ట్రైలర్ రిలీజైంది
చెన్నై: తమిళ నటుడు శివ కార్తికేయన్, కార్తీ సురేష్ జంటగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'రెమో'. అక్టోబర్ 7న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. 24ఎఎం స్టూడియోస్ బేనర్లో ఆర్.డి రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది.
వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 5న ఆడియో రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియో ఆల్బంలో మొత్తం 7 పాటలున్నాయి. ఆడియోకు మంచి స్పందన వస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
'సిరిక్కాదే' పేరుతో ఇటీవల ప్రమోషన్ సాంగ్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. తమిళంలో ఆల్రెడీ రిలీజైన ఈ వీడియోకు మంచి స్పందన వచ్చింది. ఆడియో రిలీజ్ సందర్భంగా 'సిరిక్కాదే' సాంగ్ ఇంగ్లిష్ వెర్షన్ ను 'కమ్ క్లోజర్' పేరుతో రిలీజ్ రిలీజ్ చేసారు.
'రెమో' మూవీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీలైన 24ఎఎం స్టూడియోస్ అధినేత ఆర్.డి రాజా ..... దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ తో మరో సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించారు.