» 

చిరంజీవితో సినిమాపై తేల్చి చెప్పిన శంకర్

Posted by:
Give your rating:

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్సకత్వంలో చిరంజీవి హీరోగా 150వ చిత్రం రూపొందనుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తనను కలిసిన మీడియాతో అటువంటి ప్రపోజల్ ఏమీ లేదని శంకర్ తేల్చి చెప్పారు. అస్సలు ఇప్పటివరకూ తన తదుపరి చిత్రం కోసం ఏ హీరోని సైన్ చేయించుకోలేదని అన్నారు. తన మనస్సులో అనేక కాన్సెప్టులు ఉన్నాయని వాటిల్లో ఏది ఫైనలైజ్ చేసి ముందుకు వెళ్తాననేది ఇంకా తేల్చుకోలేదని చెప్పారు. మార్చిలో తన నెక్ట్స్ చిత్రం గురించి తెలియచేస్తానని అన్నారు. ప్రస్తుతం హ్యాలిడే మూడ్ లో ఉన్నానని,నన్భన్ సక్సస్ ని ఎంజాయ్ చేస్తున్నానని అన్నారు.

అలాగే తను భవిష్యత్ లో చేయబోయే స్క్రిప్టులన్నీ ఒరిజనల్ స్క్రిప్టులని, రీమేక్ లు కావని స్పష్టం చేసారు. ఇక తనను ఇండియాలో హైయిస్ట్ పెయిడ్ డైరక్టర్ అంటున్నారని, అది తనకు తెలియదని, అయినా అది ఆనందాన్ని ఇచ్చే విషయం కాదని,తను ప్రేక్షకులను సంతృప్తి పరిచే డైరక్టర్ అంటే సంతోషిస్తాను అన్నారు. ఇక త్రి ఇడియట్స్ రీమేక్ పై మాట్లాడుతూ..తను ఎప్పుడూ రీమేక్ చేస్తానని ఊహించలేదని,ఇది కొత్త ఎక్సపీరియన్స్ అనీ,ఇంక భవిష్యత్ లో మరో రీమేక్ చెయ్యనని అన్నారు. తన సొంత చిత్రాలు రీమేక్ చెయ్యమన్నా చేయనని చెప్పుకొచ్చారు. ఇక తన నన్భన్ చిత్రాన్ని రాజ్ కుమార్ హిర్వానీ చూసారని, చాలా ఆనందపడ్డారని,గ్రేట్ రీమేక్ అని పొగిడారని,పాటలు చాలా బాగా తీసానని మెచ్చుకున్నారని చెప్పుకొచ్చారు. అలాగే హిందీలో షారూఖ్ చెయ్యాలి కానీ కొంత టైమ్ పడుతుందని అన్నారు.

Read more about: shankar, chiranjeevi, 3 idiots, శంకర్, చిరంజీవి, త్రీ ఇడియట్స్
English summary
Director Shankar says... Ajith, Vikram or Chiranjeevi...No one has been signed on yet. There are several concepts in mind. My next will be an original script and I should finalize it by March. As of now, I am off on holiday.
Please Wait while comments are loading...
 
X

X
Skip Ad
Please wait for seconds

Bringing you the best live coverage @ Auto Expo 2016! Click here to get the latest updates from the show floor. And Don't forget to Bookmark the page — #2016AutoExpoLive