twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో విషాదం: సీనియర్ నటుడు, దర్శకుడి మృతి

    By Bojja Kumar
    |

    చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో ఈ మధ్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో విషాదం వెలుగు చూసింది. తమిళ నటుడు, దర్శకుడు బాలు ఆనంద్ గుండెపోటుతో మరణించారు.

    బాలు ఆనందం తమిళనాడులోని కోయంబత్తూర్ లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయిన ఆయన్ను వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు గుర్తించారు.

    balu anand

    62 సంవత్సరాల బాలు ఆనందం దాదాపు 100కుపైగా చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా కూడా ఆయన పలు సినిమాలు చేసారు. పిస్తా, అన్నానగర్ ఫస్ట్ స్ట్రీట్, అనబెశివమ్, ననె రాజ నానె మంత్రి అనే సినిమాల్లో నటించారు. అయితే ఆయన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. బాలు ఆనంద్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

    బాలు ఆనంద్ మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేసారు. విషయం తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు కోయంబత్తూర్ లోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహించ అవకాశం ఉంది.

    English summary
    Tamil actor and director Balu Anand died following a massive heart attack in his house here today, family sources said. Anand (62), who has acted in some 100 films and directed a few Tamil movies, complained of chest pain at his house in Kalampalayam and was immediately rushed to a nearby private hospital.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X