twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జయ అరెస్ట్: నిరాహా దీక్షలో కార్తి, సూర్య, విక్రమ్ (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    చెన్నై: అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్షకు గురైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మద్దతుగా తమిళ సినిమా రంగం ఏకైంది. నటీనటులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇలా అన్ని వర్గాల వారు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ రోజంతా (సెప్టెంబర్ 30) థియేటర్లు, షూటింగులు బంద్ పెట్టారు.

    థియేటర్ల బంద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో జయలలితకు సంఘీభావంగా నిరాహార దీక్షలు చేసారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో తమిళ స్టార్స్ సూర్య, విక్రమ్, కార్తి, శరత్ కుమార్, ఆనంద్ రాజ్, రాధా రవి తదితరులు పాల్గొన్నారు. అయితే కోర్టు తీర్పుపై ఎవరూ స్పందించలేదు.

    అమ్మ(జయలలిత)కు శిక్ష పడిందని తెలిసి తమ వంతు సంఘీభావంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సినీ పరిశ్రమ నుండి వచ్చి, పరిశ్రమలోని కష్టనష్టాల గురించిన తెలిసిన వ్యక్తిగా తమిళ సినీ పరిశ్రమకు జయలలిత ఎంతో మేలు చేసారని, అందుకే ఆమెకు సంఘీభావంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

    స్లైడ్ షోలో ఫోటోలు...

    నిరాహార దీక్షలో సూర్య

    నిరాహార దీక్షలో సూర్య


    జయలలితకు మద్దతుగా జరిగిన నిరాహార దీక్షలో పాల్గొన్న తమిళ స్టార్ హీరో సూర్య.

    జయలలితకు మద్దతుగా విక్రమ్, కార్తి

    జయలలితకు మద్దతుగా విక్రమ్, కార్తి


    అవినీతి కేసులో అరెస్టయిన జయలలితకు సంఘీభావంగా జరిగిన నిరాహార దీక్షలో కార్తి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

    అవినీతి కేసు

    అవినీతి కేసు


    ముఖ్యమంత్రిగా రూ. 66 కోట్లు అక్రమంగా సంపాదించారనే ఆరోపణలతో 18 ఏళ్ల క్రితం జయలలితపై కేసు నమోదైంది. సుధీర్ఘ విచారణ అనంతరం జయలలితపై నేరం రుజువైంది.

    జయలలితకు శిక్ష పడింది.

    జయలలితకు శిక్ష పడింది.


    దీంతో ఆమెకు 4 సంవత్సరాల జైలు శిక్ష, 100 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

    English summary
    Actors Vikram and Karthi at the Chepauk state guest house where members of the film industry are participating in a fast to protest Jayalalithaa's conviction, in Chennai on Tuesday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X