»   » తొలి‌ఆల్బం లో అమ్మానాన్నలతో పాట, గాయనిగా స్టార్‌హీరో మదర్ ఎంట్రీ

తొలి‌ఆల్బం లో అమ్మానాన్నలతో పాట, గాయనిగా స్టార్‌హీరో మదర్ ఎంట్రీ

తమిళ కామెడీ హీరో సంతానం హీరోగా తెరకెక్కుతున్న ‘సక్క పోడు పోడు రాజా’ చిత్రానికి శింబు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు, తన తొలి ఆల్బమ్‌లో తల్లిదండ్రులిద్దరి చేత పాట పాడించడం విశేషం.

Posted by:
Subscribe to Filmibeat Telugu

అయితే వివాదం లేదంటే సంచలనం హీరో సింబు ఏం చేసినా ఏదో ఒక ప్రత్యేకంగానే ఉంటుంది. ఒకప్పటి హీరో "ప్రేమసాగరం" టీ రాజేందర్ కుమారుడైన శింబు ఇళవరసన్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు కాకుంటే ఎక్కువగా అతని చుట్టూ ఉన్నవి వివాదాలే. నయన తారతో సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోల లీక్ దగ్గరినుంచీ, నిన్నా మొన్నటి బీప్ సాంగ్ వరకూ అన్నీ ఏదో ఒక కాంట్రవర్సీ తో ముడి పడి ఉన్నవే.., ఏదో ఒక సంచలనం అయినవే. ఇపుడు కూడా ఈ కాంట్రవర్షియల్ నటుడు ఇంకో సంచలనం తో వార్తల్లోకి ఎక్కాడు. అదేమిటంటే.....

శింబు

మొదటి నుంచీ నటనలోనే కాదు సినిమాకి సంబందం ఉన్న అన్ని విభాగాలలోనూ శింబు తనకంటూ ఒక ముద్ర వేస్తూనే ఉంటాడు. నటుడిగా, దర్శకుడిగా, గాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు కూడా.

తమ్ముడు కురలరసన్‌

పోయిన సంవత్సరం తమ్ముడు కురలరసన్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశాడు. అది సరిపోలేదేమో ఇప్పుడు శింబు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. అంతేకాదు, తన తొలి ఆల్బమ్‌లో తల్లిదండ్రులిద్దరి చేత పాట పాడించడం విశేషం.

 

 

టి.రాజేందర్‌

శింబు తండ్రి అయిన టి.రాజేందర్‌ పాడటం కొత్తకాదు ఇదివరకూ చాలా సినిమాల్లో పాడాడు. అయితే ఈసారి స్పెషల్ ఏమిటంటే తొలిసారి శింబు తల్లి ఉష కూడా గాయనిగా మారింది. కొడుకు సంగీత దర్శకత్వం లో విజయవంతంగా ఆవిడ తొలి పాట రికార్డ్ కూడా అయిపోయింది.

సక్క పోడు పోడు రాజా

తమిళ కామెడీ హీరో సంతానం హీరోగా తెరకెక్కుతున్న ‘సక్క పోడు పోడు రాజా' చిత్రానికి శింబు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. హాస్యనటుడు వీటీవీ గణేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పోర్షన్స్ పూర్తి చేసుకుని, వచ్చే వారంలో పాటల చిత్రీకరణ జరుపుకోనుంది. ఊటీ, బెంగళూరు, చెన్నైలతోపాటు అమెరికాలోనూ పాటల చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారు.

బీప్ సాంగ్ సమయం లో

మొన్నటిదాకా దుమారం రేపిన బీప్ సాంగ్ సమయం లో శింబు తరపున వకాల్తా తీసుకొని మీడియా మీద విరుచుకుపడ్డారు ఉష., బహుశా అప్పుడే ఆవిడ గొంతులో ఉన్న టాలెంట్ బయటపడి ఉంటుంది. మొత్తానికి ఉష రూపం లో కోలీవుడ్ కి ఇంకో గాయని దొరికిందన్నమాట

English summary
Simbu is making his music directorial debut through Santhanam’s Sakka Podu Podu Raja. The album apparently comprises of 5 tracks and there is a mass song ‘va munima va’ which feature Simbu's mother Usha Rajender’s vocals
Please Wait while comments are loading...