twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఐ’ సినిమాకు వ్యతిరేకంగా హిజ్రాల ఆందోళన

    By Bojja Kumar
    |

    చెన్నై: శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ' చిత్రానికి వ్యతిరేకంగా హిజ్రాలు, ట్రాన్స్ జెండర్స్ ఆందోళనకు సిద్ధమయ్యారు. ‘ఐ' సినిమాలోని కొన్ని సీన్లు తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ పాత్ర ‘ఓస్మా'ను చిత్రీకరించిన తీరు తమ మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉందని ట్రాన్స్ జెండర్స్ ఆగ్రహంగా ఉన్నారు.

    ‘ఐ' సినిమాలో ఓస్మా పాత్రను ఓజాస్ రజనీ పోసించారు. ఓజాస్ రజనీ ఈ సినిమాలో సినిమాలో మాత్రమే కాదు.....నిజ జీవితంలో సేమ్ టు సేమ్. ఓజాస్ రజనీ ఐశ్వర్యరాయ్ తో పాటు పలవురు బాలీవుడ్ స్టార్స్ స్టైలిస్ట్ గా పని చేసారు. అయితే ఓస్మా పాత్రను విలన్ పాత్రగా చిత్రీకరించడంపై ట్రాన్స్ జెండర్స్ ఆగ్రహంగా ఉన్నారు. దర్శకుడు శంకర్ ఇంటి ముందు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు.

    Transgenders protest against I movie

    ‘ఐ' సినిమా విషయానికొస్తే...ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం తొలి రోజే యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సినిమాపై ముందు నుండి హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉండటం, భారీగా థియేటర్లలో విడుదల చేయడంతో ఓపెనింగ్ కలెక్షన్లు బావున్నాయి. అయితే భారీ బడ్జెట్ మూవీ సినిమా బిజినెస్ పూర్తయ్యే లోపు ఎలాంటి ఫలితాలను నమోదు చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

    ఈ చిత్రంలో విక్రమ్, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటించారు. శంకర్ దర్శకత్వం వహించాగా ఆస్కార్ ఫిలింస్ పతాకంపై రవిచంద్రన్ నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఆస్కార్ ఫిలింస్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించారు. సినిమా ఓపెనింగ్స్ బావున్నాయని మెగా సూపర్ గుడ్ ఫిలింస్ అధినేతల్లో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ ప్రకటించారు.

    English summary
    Transgender community announce protests against I film in front of the Director Shankar’s house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X