twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్ సినిమాలో త్రిష ఐటం సాంగ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఈ మధ్య స్టార్ హీరోయిన్లు ఐటం సాంగులు చేస్తుండటం సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ త్రిషకు ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. దీంతో అంది వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు అమ్మడు. ఐటం సాంగులు చేయడానికి కూడా రెడీ అయిపోయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్రిష ‘లింగా' సినిమాలో ఐటం సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ చిత్రం కావడంతో వెంటే త్రిష ఒప్పుకుంది. సినిమా త్రిష చేసే స్పెషల్ సాంగ్ హైలెట్ కానుందని అంటున్నారు. మరో వైపు అజిత్ నటిస్తున్న తమిళ సినిలోనూ త్రిష ఐటం సాంగ్ చేస్తున్నట్లు టాక్.

    Trisha

    రజనీకాంత్ హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరో హరోయిన్లుగా ‘లింగా' చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే సెకండ్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లో రజనీకాంత్ సంతానంతో కలిసి నవ్వులు చిందిస్తూ కనిపించారు. సినిమాలో రజనీకాంత్ ను ఎంత స్టైలిష్‌గా చూపించబోతున్నారో ఈ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది. పోస్టర్ రిలీజ్ లుక్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

    రజనీకాంత్ సినిమా కోసం అభిమానులు గత కొంతకాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా తొలి పోస్టర్ విడుదలైనప్పటి నుండే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో రజనీకాంత్ ద్విపాత్రాభినయంలో సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నారు.

    ఈ చిత్రంలో రజనీ దొంగగా, ఇంజినీరు గా ద్విపాత్రలలో కనిపించనున్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. చిత్రీకరణ చివరిదశకొచ్చింది. ''రజనీకాంత్‌ను మరోసారి మాస్‌ లుక్‌లో చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. స్వాతంత్య్రం ముందు, తర్వాత తరాలకు చెందిన రెండు పాత్రల్లో రజనీకాంత్‌ కనిపిస్తారు'' అంటున్నారు దర్శకుడు.

    English summary
    The sizzling news about Linga – The director K.S.Ravikumar is in discussion of making Trisha to dance in an item song of the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X