twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రిష, హన్సిక..ఇద్దరికి ఒకేసారి దెబ్బకొట్టి షాక్ ఇచ్చాడు, కంప్లైంట్ చేసారు

    త్రిష, హన్సిక... ఇద్దరి ఫోన్లను ఎవరో హ్యాక్ చేశారు. ఫోన్‌లో ఉన్నవన్నీ చెరిపేసి.. మొత్తం ఖాళీ చేసేశారు. మొదట ఈ విషయాన్ని వివరిస్తూ త్రిష ట్వీట్ చేసింది.

    By Srikanya
    |

    చెన్నై: ప్లీజ్ ..మీ నెంబర్ నాకు మెసేజ్ పెట్టండి అంటూ త్రిష, హన్సిక తన స్నేహితులను, సన్నిహితులను రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేసిన సంఘటన అందరి దృష్టి వీరిపైకి మళ్ళింది. హఠాత్తుగా వీరికేం జరిగింది..ఎందుకిలా రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే క్రింద కథనం చదవాల్సిందే.

    ఈ రోజున తిండి,తిప్పలు ఎలా ఉన్నా ఫోన్ నెంబర్స్ మెయిన్ అయ్యిపోయాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తం తెల్లారి లేస్తే ఎవరో ఒకరి ఫోన్ కాల్ తో మొదలవుతోంది. అలాగే పడుకునేటప్పుడు ఎవరో ఒకరితో మాట్లాడే నిద్రపోతున్నారు. ఇలా జీవితం మొత్తం పెనవేసుకుపోయిన ఫోన్ నెంబర్లు డిలేట్ అయితే, ప్రాణం ఏమీ పోదు. కానీ మళ్లీ వాటిని సంపాదిచటం , తిరిగి వాటిని యాడ్ చేసుకోవటం పెద్ద పని. మనకే ఇలా అనిపిస్తే ఇక సెలబ్రెటీల పరిస్దితి ఏమిటి.

    ప్రస్తుతం హాట్ హీరోయిన్స్ త్రిషకూ, హన్సికకూ అదే ఎదురైంది. ఈ ఇద్దరి ఫోన్లను ఎవరో హ్యాక్ చేశారు. ఫోన్‌లో ఉన్నవన్నీ చెరిపేసి.. మొత్తం ఖాళీ చేసేశారు. మొదట ఈ విషయాన్ని వివరిస్తూ త్రిష ట్వీట్ చేసింది.

    ''ఎవరో పనిలేనివాళ్లు నా ఫోన్‌లో ఉన్న డేటానంతా చెరిపేశారు.అందుకని నా ఫోన్ నంబర్ తెలిసిన సన్నిహితులు, శ్రేయోభిలాషులందరూ మీ పేరుతో మీ ఫోన్ నంబర్ జతచేసి నా ఫోన్‌కి మెసేజ్ పెట్టగలరు'' అని త్రిష పేర్కొన్నారు.

    ఇక ఈ విషయమై తను సైబర్ క్రైమ్ సెల్ కు వెళ్లినట్లుగా ఆమె తెలియచేసారు. సైబర్ క్రైమ్ వాళ్ళు ఈ విషయమై ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే వీరి ఫోన్ లను హ్యాక్ చేసినవారి ని పట్టుకునే ఉన్నట్లు సమాచారం.

    ఇక త్రిష ట్వీట్ వచ్చిన కొద్ది సేపటికే ..హన్సిక... ''నా ఫోన్ పరిస్థితి కూడా ఇదే. అందుకని నాక్కూడా మెసేజ్ పెట్టగలరు'' అని విన్నవించుకున్నారు.

    ఇలా హ్యాక్ చేసి వీళ్లకు సమస్యలు తెచ్చిపెట్టినవాళ్లు త్వరలోనే సమస్యలు పాలు అవుతారని , అభిమానులు వీళ్లిద్దరినీ ఓదారుస్తున్నారు. మొత్తానికి ఇద్దరు హీరోయిన్స్ కు ఒకే సమస్య, ఒకేసారి రావటంతో తమిళనాట చర్చనీయాంశంగా మారింది.

    English summary
    Trisha and Hansika Motwani have taken it to Twitter to report something that has happened to them. During the early evening of 20th of November, Trisha posted on her twitter account that she had lost all her contacts on her phone due to some hacker who had erased her phone clean.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X