»   »  సినిమాల కోసం భర్తకు విడాకులిచ్చిన టీవీ యాంకర్

సినిమాల కోసం భర్తకు విడాకులిచ్చిన టీవీ యాంకర్

Posted by:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి పరిచయం ఉన్న వారికి తమిళ టీవీ యాంకర్, వీడియో జాకీ రమ్య గురించి కూడా తెలిసే ఉంటుంది. తమిళ నాట పాపులర్ యాంకర్ ఆమె. గతేడాది పిబ్రవరిలో అపరిజిత్ జయరామన్‌తో ఆమె వివాహం జరిగింది. తమిళ సినీ ప్రముఖులకు రమ్య చాలా క్లోజ్ కావడంతో మణిరత్నం, సూర్య, శింబు, ఆర్య, తెలుగు నాని లాంటి వారు సైతం వచ్చారు.

పెళ్లయి నెలరోజులు గడవక ముందే భార్య భర్తల మధ్య విబేధాలొచ్చాయనే విషయం ప్రపంచానికి అర్థమయిపోయింది. సినిమాలు, టీవీ కార్యక్రమాలు, పార్టీలతో ఎప్పుడూ బిజీగా ఉండే రమ్య....పెళ్లయిన తర్వాత కూడా అదే పద్దతికొనసాగించింది. దీంతో కుటుంబం కోసం సమయం తక్కువగా కేటాయిస్తుండటంతో భార్య భర్తల మధ్య విబేధాలు వచ్చినట్లు స్పష్టమవుతోంది.

ఇటీవల రమ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లయిన పదిరోజుల్లోనే తాను విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు చెప్పి అందరికీ షాకిచ్చింది. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఉంటున్నానని, సినిమాలపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు రమ్య వెల్లడించింది.

ఆమె చెప్పిన విషయాలను బట్టి సినిమాల్లో నటించడానికి భర్త అడ్డు చెప్పడంతో, ఆయన అడ్డుగా తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రం ''ఓకే బంగారం '' చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా రమ్య నటించిన సంగతి తెలిసిందే.

గతేడాది జరిగిన రమ్య పెళ్లి నాటి దృశ్యాలు స్లైడ్ షోలో మరోసారి....

మణిరత్నం, సుహాసిని


గతేడాది రమ్య పెళ్లి వేడుకలో మణిరత్నం, సుహాసిని

మెహందీ


గతేడాది తన పెళ్లి వేడుక సందర్భంగా మెహందీతో రమ్య

సూర్య, జ్యోతిక


రమ్య పెళ్లి వేడుకలో సూర్య, జ్యోతిక కూడా పాల్గొన్నారు.

అమలా పాల్


రమ్య పెళ్లి వేడుకలో హీరోయిన్ అమలా పాల్

సుందర్, కుష్బూ


రమ్య పెళ్లి వేడుకలో సుందర్, కుష్బూ దంపతులు

రమ్య కృష్ణ


రమ్య పెళ్లి వేడుకలో రమ్య కృష్ణ కూడా పాల్గొన్నారు.

స్నేహ-ప్రసన్న


గతేడాది రమ్య పెళ్లి వేడుకలో ప్రసన్న, స్నేహ దంపతులు కూడా పాల్గొన్నారు.

శింబు


అప్పట్లో రమ్య పెళ్లి వేడుకలో శింబు

English summary
Vijay Tv Anchor Ramya wants Divorce with Aparajith.
Please Wait while comments are loading...