twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో కన్నా విలన్ కే ఎక్కువ పేరు వచ్చింది

    By Srikanya
    |

    చెన్నై : ఒక్కోసారి హీరో కన్నా విలన్ గా చేసిన వారికే ఎక్కువ గుర్తింపు వస్తూంటుంది. అటువంటి అరుదైన సంఘటన తాజాగా తమిళ చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంది. వైవిధ్య నటనతో అందరి మెప్పు పొందుతున్నారు నటుడు సింహ. తాజాగా 'జిగర్‌దండా' (చిక్కడు దొరకడు) లో ఆయన విలన్‌గా నటించి అందర్నీ ఆశ్చర్యచకితులను చేశారు. ఆయన నటన అందర్నీ ఆకట్టుకుంటోంది.

    'కాదలిల్‌ సొదప్పువదు ఎప్పడి'తో తెరంగేట్రం చేసి.. అందులో చిన్న పాత్రతో ఆకట్టుకున్నారు. తర్వాత 'పిజ్జా', 'సూదుకవ్వుం', 'నాన్‌ రాజావాగపోగిరేన్‌'.. తదితర చిత్రాల్లో హాస్యనటుడిగా, అమాయకుడిగా నటించారు.

    సింహ స్పందిస్తూ.. ''డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగానికని ఇంట్లో అబద్ధం చెప్పి చెన్నై వచ్చాను. అప్పుడే కార్తీక్‌ సుబ్బురాజ్‌ పరిచయం అయ్యారు. నాలుగేళ్ల క్రితమే నాకు 'జిగర్‌దండా' కథ తెలుసు. 'సేదు' పాత్రలో నటిస్తానని అప్పుడే అడిగాను. సరిపోనని కార్తి చెప్పాడు. 'నేరం'లో నేను దాదాగా నటించాక ఒప్పుకున్నాడు. నన్ను సేతుగా మలిచిన ప్రత్యేకత కార్తిక్‌ సుబ్బురాజ్‌దే. నాకు దక్కే అభినందనలన్నీ ఆయనకే చేరాలి. సిద్ధార్థ్‌ పెద్ద హీరోగా ఉన్నప్పటికీ.. నాకు ఎక్కువ అవకాశమిచ్చి నటించారు. నన్ను ప్రారంభంలో కోపగించుకున్న నా తల్లిదండ్రులు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. నటనకు తగిన పాత్ర లభిస్తే.. తప్పకుండా చేస్తాను''అని చెప్పారు.

    మిగతా విశేషాలు..స్లైడ్ షోలో

    సూపర్ హిట్

    సూపర్ హిట్

    సిద్ధార్థ్‌, లక్ష్మీమీనన్‌ జంటగా నటించిన చిత్రం 'జిగర్‌దండా'. గత శుక్రవారం తెరపైకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకాదరణకు నోచుకుంది. ఈ నేపథ్యంలో మరో 65 థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత కదిరేశన్‌. దాంతో ఈ చిత్రం సూపర్ హిట్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

    సిద్దార్ద హ్యాపీ

    సిద్దార్ద హ్యాపీ

    రిలీజైన మొదటి రోజు నుంచీ ఈ చిత్రం కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. వరస ఫ్లాపుల్లో ఉన్న సిద్దార్దని ఈ చిత్రం ఒడ్డున పడేసిందనే చెప్పాలి.

    నిర్మాత కదిరేశన్‌ మాట్లాడుతూ...

    నిర్మాత కదిరేశన్‌ మాట్లాడుతూ...

    ''మా చిత్రం అన్ని సెంటర్లలోనూ మంచి కలెక్షన్లతో ఆడుతోంది. సిద్థార్థ్‌ నటనకు మంచి పేరొచ్చింది. లక్ష్మీమీనన్‌ను కొత్త కోణంలో చూపించారని అందరూ మెచ్చుకుంటున్నారు. మరో 65 థియేటర్లలో ఆదివారం నుంచి విడుదల చేసాం. తెలుగు అనువాద పనులు పూర్తయ్యాయి. 'చిక్కడు దొరకడు' అని టైటిల్‌ పెట్టాం. వచ్చే నెలలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి'' అన్నారు.

    గ్యాంగ్‌స్టర్‌ లవ్‌స్టోరీ

    గ్యాంగ్‌స్టర్‌ లవ్‌స్టోరీ

    సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక యంగ్‌స్టర్‌ లైఫ్‌లో మొదలై కర్నూలు రౌడీషీటర్స్‌ ప్రపంచాన్ని టచ్‌ చేస్తూ, మంచి లవ్‌స్టోరీ, కామెడీ క్యారెక్టర్స్‌ మధ్య ట్రావెల్‌ అయి చిత్రమైన మలుపులు తిరుగుతూ చివరికి ఎవరూ ఊహించని క్లయిమాక్స్‌లో ఎండ్‌ అవుతుంది. ఆడియన్స్‌ ఒక కొత్త అనుభూతిని కలిగించే ఒక మ్యూజికల్‌ గ్యాంగ్‌స్టర్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కింది.

     శంకర్ సైతం...

    శంకర్ సైతం...

    ఇటీవల శంకర్‌ సైతం ట్విట్టర్‌లో ప్రత్యేకించి 'జిగర్‌దండా' సినిమా గురించి ప్రస్తావించారు. దాంతో మరొక సారి ఈ చిత్రం గురించి అంతటా మారు మ్రోగింది.

    తెలుగులో

    తెలుగులో

    తెలుగు అనువాద పనులు పూర్తయ్యాయి. 'చిక్కడు దొరకడు' అని టైటిల్‌ పెట్టాం. వచ్చే నెలలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి '' అన్నారు.

    పైరసీ ఎఫెక్టు

    పైరసీ ఎఫెక్టు

    అలాగే ...'పైరసీ వల్ల వసూళ్లపై భారీ ప్రభావం పడుతోంది. అందువల్లే కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. ''అని చెప్పారు.

    ఎంతవరకూ...

    ఎంతవరకూ...


    'పిజ్జా' వంటి పెద్ద హిట్‌ చిత్రాన్ని అందించిన కార్తిక్‌సుబ్బురాజ్‌ దీనికి దర్శకత్వం వహించటంతో అక్కడ రిలీజ్ కు ముందే మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. మరోవైపు లక్ష్మీమీనన్‌ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూడటంతో కూడా ఓపినింగ్స్ అద్బుతంగా వచ్చాయి. అయితే తెలుగులో చిక్కడు దొరకడు టైటిల్తో డబ్బింగ్ చేసి ఇప్పటికే ట్రైలర్‌, పాటలు విడుదల చేసారు. అయితే పెద్దగా ఇక్కడ మన యూత్ ని ఆకట్టుకోలోకపోయాయి. తమిళ వాసన ఎక్కువ ఉండటంతో ఇక్కడెవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే రిలీజ్ అయ్యాక సినిమాలో విషయం ఉంది కాబట్టి ఆడే అవకాసం ఉందంటున్నారు.

    ఎవరెవరు..

    ఎవరెవరు..

    మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్‌, కెమెరా: సంతోష్‌ నారాయణ్‌, ఎడిటింగ్‌: వివేక్‌ హర్షన్‌, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎ.ఎన్‌.బాలాజీ (సూపర్‌గుడ్‌ మూవీస్‌), నిర్మాత: కదిరేశన్‌, దర్శకుడు: కార్తిక్‌ సుబ్బురాజ్‌.

    English summary
    Karthik Subbaraj latest flick is titled as “Jigarthanda” in Tamil and “Chikkadu Doraku” in Telugu. This movie stars Sidharth, Lakshmi Menon and Karunakaran in the lead roles.The director of this film, Karthik Subbaraj says that he chose actor Simha as his villain in this flick and felt that he was the most unexpected person to play that role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X