twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్క పాటకు రూ.2.5 కోట్లు ఖర్చు

    By Srikanya
    |

    చెన్నై: ఓ మీడియం సినిమా బడ్జెట్ అంత కేవలం ఒక్క పాటకే ఖర్చుపెట్టామంటున్నారు దర్శక,నిర్మాతలు. సంగీత దర్శకుడు అనిరుధ్‌, 'ఇలయ తలబది' విజయ్‌ కాంబినేషన్లో తొలిసారిగా తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఇందులోని ఓ పాట కోసం అంత మొత్తాన్ని ఖర్చు పెట్టాల్సి వచ్చింది.

    దానికి కారణం..ఇటీవల ఓ పాటను లండన్‌లో తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాలతో ముంబయిలో ప్రత్యేక సెట్‌ వేసి చిత్రీకరించారు. ఈ ఒక్క పాట కోసం రూ.2.5 కోట్లు ఖర్చుపెట్టిందట చిత్ర యూనిట్‌. విజయ్‌, సమంతలతోపాటు 50 మంది నృత్య కళాకారులు ఇందులో పాలుపంచుకున్నారు.

    Vijay's 'Kathi' Song cost 2.5 Cr.

    ఇక ఈ పాట యువతకు కిక్కెక్కిస్తుందని, సినిమా విడుదలయ్యాక అందరినోట ఈ పాటే నానుతుందన్నారు సంగీత దర్శకుడు అనిరుధ్‌. ఇదిలా ఉండగా.. ఈ పాటలో ఓ సన్నివేశంలో ఏఆర్‌ మురుగదాస్‌, అనిరుధ్‌లు కూడా కనిపిస్తారని సమాచారం.

    బాలీవుడ్ లోనే కాదు... దక్షిణాదిలోనూ మార్కెట్‌ భారీగా పెరిగింది. విజయ్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'తుపాకి' ఏకంగా రూ. 130 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో 'కత్తి'ని రూ.150కోట్లపై టార్గెట్‌ చేసినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాణ దశలోనే 'కత్తి' సినిమాపై విపరీతమైన బిజినెస్ జరుగుతోంది. ఇందులో బాలీవుడ్‌ హీరో నీల్‌ నితిన్‌ ముకేష్‌ విలన్‌గా నటించారు. దీపావళికి సినిమాను తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం.

    ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని 'తుపాకి'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు 'ఇలయ దళపతి' విజయ్‌. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. విజయ్‌కి ఉన్న మాస్‌ ఇమేజ్‌కు తగ్గట్టు శీర్షిక కూడా కుదరడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విజయ్‌ని మరో కొత్త కోణంలో చూపించనున్నట్లు ఇప్పటికే మురుగదాస్‌ తెలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లోని 'తుపాకి' దీపావళికి విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సెంటిమెట్‌తో ఈసారి కూడా 'కత్తి'ని పదునెక్కించి దీపావళి కదనరంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు విజయ్‌.

    English summary
    Vijay and director AR Murugadoss have set a new trend by shooting in unexplored locations in Mumbai for their blockbuster Thuppakki. Following the same, the duo are all set to shoot ‘Selfie Pulla’ in a Rs 2.5 Cr set there.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X