twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ 'కత్తి' కథ ఇదేనా?...తెలుగు నుంచి ఎత్తారా?

    By Srikanya
    |

    Vijay’s Kathithi/Kathi Story Leaked
    చెన్నై: మురుగదాస్‌ కథలన్నీ విభిన్నంగా ఉంటాయి. షార్ట్‌ టర్మ్‌ మొమొరీ లాస్‌ అనే కథాంశంతో 'గజిని' తీర్చిదిద్దారు. 'రమణ', 'సెవెన్త్‌సెన్స్‌', 'తుపాకీ' కూడా సాధారణ సినిమాలకు విభిన్నంగా సాగేవే. అందుకే మురుగదాస్‌ సినిమా వస్తోందంటే అందరిలోనూ ఆసక్తి. ఇప్పుడాయన 'కత్తి' పదును చూపించబోతున్నారు. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.

    చెన్నై తమిళ సిని వర్గాల సమాచరం ప్రకారం...ఈ సినిమాలో విజయ్ ...దొంగ గానూ, రైతు సంఘం అధ్యక్ష్యుడుగానూ కనిపస్తారు. ఒకానొక సిట్యువేషన్ లో పోలీసులు రైతు సంఘం అధ్యక్ష్యుడుని అరెస్టు చేస్తారు. అప్పుడు దొంగ అతని ప్లేస్ లోకి వచ్చి రైతుల సమస్యలను ఎలా తీర్చాడన్నదే మిగతా కథ అని తెలుస్తోంది. ఈ కథ రాజమౌళి విక్రమార్కుడు, వివి వినాయిక్ నాయిక్ లను పోలి ఉంటుందని చెప్పుకుంటున్నారు.

    విజయ్‌, సమంత జంటగా నటించిన చిత్రమిది. కె.కరుణామూర్తి, ఎ.శుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మించారు. అనిరుథ్‌ స్వరాలు అందించారు. ఈ నెల 24న 'కత్తి' పాటల్ని విడుదల చేస్తారు. చిత్ర సమర్పకుడు ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ''థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ చిత్రమిది. సెంటిమెంట్‌కీ చోటుంది. అనిరుథ్‌ స్వరాలు అదనపు ఆకర్షణ. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.

    గత ఏడాది మాదిరిగానే 'తుపాకి' వంటి హిట్‌ను సొంతం చేసుకోవాలని భావించిన ఏఆర్‌ మురుగదాస్‌, విజయ్‌లు.. ఈ సారి 'కత్తి'తో సిద్ధమయ్యారు. ఈ సినిమాకు చిత్రీకరణ దశ నుంచి ఇప్పటి వరకు సమస్యలు ఎదరవుతూనే ఉన్నాయి. 'కత్తి' సినిమా విడుదలను అడ్డుకుంటామని వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇంకా పలు తమిల సంఘాలు కూడా గుర్రుగా ఉన్నాయి. ఓ తమిళ చిత్రాన్ని శ్రీలంకకు చెందిన వ్యక్తి.. అందులోనూ రాజపక్స బంధువు నిర్మించడమేంటని నిలదీస్తున్నారు. మరి ఈ పరిస్థితులను దాటుకుని దీపావళికి చిత్రం వస్తుందో?.. రాదో?.. కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

    కాపీ సమస్య...

    ఈ భారీ చిత్రం తమ కథనే కాపీ కొట్టి తీసారంటూ తిరువల్లూరు కి చెందిన మింజూర్ అనే వ్యక్తి కేసు వేసారు. తను రూపొందిస్తున్న మూత కుడై అనే చిత్రం కథనే తస్కరించాడంటూ కత్తి చిత్రం రిలీజ్ ని ఆపాలంటూ కోర్టులో పిటీషన్ వేసాడు. అయితే ఈ విషయమై మురుగదాస్ వెంటనే స్పందించారు. తనకు అసలు మింజూర్ అనే వ్యక్తి ఎవరో తెలియదని, కేవలం ఇవన్నీ జనం అటెన్షన్ ని గ్రాబ్ చేయటానికి చేస్తున్న ట్రిక్ అనే కొట్టిపారేసారు.

    ఇక 'కత్తి' విశేషాలు కి వస్తే...

    'జిల్లా' తర్వాత 'ఇలయ తలబది' విజయ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'కత్తి'. 'తుపాక్కి' తర్వాత ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్నారాయన. ఇందులో తొలిసారిగా విజయ్‌ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది. ముంబయిలో పలు కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. విజయ్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌లో స్లీపర్‌సెల్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన 'తుపాక్కి' ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

    దీంతో మురుగదాస్‌ అంటేనే వందకోట్ల మార్కెట్‌ను సునాయాసంగా ఛేదించగలడనే నమ్మకం ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బలంగా నాటుకు పోయింది. ఆ దిశగా ఈ సినిమా కూడా వందకోట్లను వసూలు చేస్తుందని సంబంధిత వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా పోస్టర్లు, టీజర్‌లు కూడా మంచి ఆదరణను సంపాదించుకున్నాయి.

    విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్లలో విజయ్‌ భిన్నంగా కనిపిస్తుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రధాన భవనాలతో కూడిన చెన్నైని చూపుతూ.. ఆ సన్నివేశం విజయ్‌ ముఖం మాదిరిగా ముగిసేలా వచ్చిన టీజర్‌కు 'కత్తి'లాంటి రెస్పాన్స్‌ వచ్చింది. మరి 'కత్తి' వసూళ్ల విషయంలో ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో వేచిచూడాల్సిందే.

    English summary
    The story of Kathi/Kaththi has been leaked, according to the story Vijay will be playing a dual role in this movie, one character is a thief and the other one will be a mass leader role who will be dealing with problem of farmers and how the government is treating them. Thief enters into the leader’s role and solves farmers’ issues since the leader character will be arrested by the Police. The story looks similar to Rajamouli’s Vikramarkudu and Ram Charan’s Naayak. Samantha is playing female lead in this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X