twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విక్రమ్ ఐ పోటీ గా ‘కత్తి’ లాంటి టీజర్ (వీడియో)

    By Srikanya
    |

    చెన్నై: తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. అది...ఇళయ దళపతి విజయ్‌ నటించిన కత్తి' సినిమా టీజర్. శంకర్, విక్రమ్ ల తాజా చిత్రం ఐ టీజర్ కు పోటీగా దీన్ని వదిలారని టాక్. దీపావళికి ఈ చిత్రం విడుదల కానుండటంతో ఈ చిత్రంపై అంచనాలు బాగా ఉన్నాయి. ఐ సినిమాను ఎంతవరకూ పోటీ ఇస్తుందో కానీ... సినిమాపై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. ఆ టీజర్ కు ఆ రేంజి ఉందో లేదో మీరే చూసి నిర్ణయించండి...

    కత్తి చిత్రంలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. లికా ప్రొడక్షన్స్‌ బ్యానరుపై కరుణామూర్తి, సుభాష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'తుప్పాక్కి' తర్వాత విజయ్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. ముంబయి, హైదరాబాద్‌, చెన్నైతోపాటు పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. వడపళనిలోని పుష్పాగార్డెన్‌లో పెద్ద సెట్‌ వేసి 40 రోజుల పాటు చిత్రీకరించారు. అనిరుధ్‌ సంగీతం సమకూర్చారు.

    Vijay's new movie ‘Kathi’ Teaser!

    ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని 'తుపాకి'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు 'ఇలయ దళపతి' విజయ్‌. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. విజయ్‌కి ఉన్న మాస్‌ ఇమేజ్‌కు తగ్గట్టు శీర్షిక కూడా కుదరడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విజయ్‌ని మరో కొత్త కోణంలో చూపించనున్నట్లు ఇప్పటికే మురుగదాస్‌ తెలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లోని 'తుపాకి' దీపావళికి విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సెంటిమెట్‌తో ఈసారి కూడా 'కత్తి'ని పదునెక్కించి దీపావళి కదనరంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు విజయ్‌.

    English summary
    Ilayathalapathi's upcoming film 'Kathi' Makers has unveiled the first look teaser of 'Kaththi' at the audio launch.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X